Telangana : దావోస్ లో తెలంగాణకు పెట్టుబడుల వరద

దావోస్ లో జరుగుతున్న వరల్డ్ ఎకనమిక్ ఫోరమ్ సదస్సులో తెలంగాణకు భారీ పెట్టబడుల వరద కొనసాగుతుంది. గోడి ఇండియా ప్రైవేట్‌ లిమిటెడ్‌ కంపెనీ తెలంగాణలో రూ.8000 కోట్ల పెట్టుబడులు పెట్టడానికి ముందుకు వచ్చింది.

New Update
Telangana : దావోస్ లో తెలంగాణకు పెట్టుబడుల వరద

దావోస్ లో జరుగుతున్న వరల్డ్ ఎకనమిక్ ఫోరమ్ సదస్సులో తెలంగాణకు భారీ పెట్టబడుల వరద కొనసాగుతుంది. గోడి ఇండియా ప్రైవేట్‌ లిమిటెడ్‌ కంపెనీ తెలంగాణలో రూ.8000 కోట్ల పెట్టుబడులు పెట్టడానికి ముందుకు వచ్చింది. అలాగే జేఎస్ డబ్ల్యూ ఎనర్జీ రూ.9000 కోట్ల పెట్టుబడి పెట్టడానికి అంగీకరించింది.

Also Read :KCR: సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న కేసీఆర్ వీడియో

ఈ మేరకు గిగా స్కేల్ బ్యాటరీ సెల్ తయారీ కేంద్రాన్ని నెలకొల్పేందుకు గాను రాష్ట్ర ప్రభుత్వంతో ఒప్పందం కుదుర్చుకుంది. ఈ యూనిట్ లో 12.5 జీడబ్ల్యూహెచ్ (గిగావాట్ ఫర్ అవర్ ) సామర్థ్యముండే బ్యాటరీ సెల్ తయారు చేయనున్నట్లు గోడి ఇండియా కంపెనీ వ్యవస్థాపకుడు, సీఈవో మహేష్ గోడి ప్రకటించారు. దానికి సంబంధించి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో అవగాహన ఒప్పందం (ఎంవోయూ) కుదుర్చుకుంది.

రాబోయే ఐదు సంవత్సరాల వ్యవధిలో తెలంగాణలో లిథియం, సోడియం అయాన్, సంబంధిత సాంకేతిక పరిజ్ఞానాల పరిశోధన, అభివృద్ధి , గిగా స్కేల్ సెల్ తయారీ కేంద్రం నెలకొల్పనున్నట్లు ప్రకటించింది. దీనిద్వారా 6వేల మందికి తొలి దశలో ఉద్యోగాలు కలిపిస్తారని రేవంత్ రెడ్డి ప్రకటించారు.

Also read :BIG NEWS: సంక్రాంతి సెలవులు పొడిగింపు

జేఎస్ డబ్ల్యూ ఎనర్జీ పెట్టుబడి రూ.9వేలకోట్లు

మరోవైపు జేఎస్ డబ్ల్యూ ఎనర్జీ  తెలంగాణలో రూ.9వేల కోట్ల పెట్టుబడి పెట్టడానికి ముందుకు వచ్చింది. ఈ మేరకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో సమావేశమైన చైర్మన్ సజ్జన్ జిందాల్ అవగాహన ఒప్పందం కుదుర్చుకున్నారు. దీనితో పంప్ఢ్ స్టోరేజీ ప్రాజెక్ట్ ను ఏర్పాటు చేయనున్నట్టు ప్రకటించింది.

తెలంగాణలో గ్రీన్ ఫీల్డ్ డేటా సెంటర్

మరోవైపు రూ. 5,200 కోట్లతో వెబ్ వర్క్ టేటా సెంటర్ ఏర్పాటు చేసేందుకు ముందుకు వచ్చింది. తెలంగాణలో డేటా సెంటర్లు ఏర్పాటు చేసేందుకు ఈ మేరకు ఒప్పందం కుదుర్చుకుంది.

 
Advertisment
Advertisment
తాజా కథనాలు