iphone14: అతి తక్కువ ధరకే ఐఫోన్ 14..త్వరపడండి! ఐఫోన్ 14 ధరలు మరింత తగ్గనున్నాయి. ఫ్లిప్ కార్ట్ లో రూ. 50 వేల కంటే తక్కువ ధరకే ఐ ఫోన్ 14ను సొంతం చేసుకోవచ్చు. ఈ విషయాన్ని ఈ కామర్స్ దిగ్గజం స్వయంగా ప్రకటించింది. By Bhavana 06 Oct 2023 in బిజినెస్ New Update షేర్ చేయండి మరో రెండు రోజుల్లో ఫ్లిప్ కార్ట్ బిగ్ బిలియన్ డేస్ మొదలు కాబోతున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే ఈ సంబరాల్లో వేటి మీద తగ్గింపు ధరలు ఉన్నాయనేది గత కొన్ని రోజులుగా అన్ని మీడియా సంస్థలు వివరిస్తున్నాయి. గత నెలలో యాపిల్ కంపెనీ తన ఐఫోన్ 15 సిరీస్ ను గ్రాండ్ గా లాంచ్ చేసిన విషయం తెలిసిందే. ఇప్పటికే ప్రపంచ వ్యాప్తంగా వీటి అమ్మకాలు కూడా జోరుగా సాగుతున్నాయి. సిరీస్ 15 లాంచ్ అనంతరం పాత సిరీస్ 14 మోడళ్ల ధరలు తగ్గాయి. అయితే ఐఫోన్ 14 ధరలు మరింత తగ్గనున్నాయి. ఫ్లిప్ కార్ట్ లో రూ. 50 వేల కంటే తక్కువ ధరకే ఐ ఫోన్ 14ను సొంతం చేసుకోవచ్చు. ఈ విషయాన్ని ఈ కామర్స్ దిగ్గజం స్వయంగా ప్రకటించింది. ఫ్లిప్ కార్ట్ ప్లస్, వీఐపీ మెంబర్స్ కు ఒకరోజు ముందుగానే ఆఫర్స్ అందుబాటులో ఉండనున్నాయి. Also read:సెక్యూరిటీ సిబ్బందిని చెంప పై కొట్టిన హోంమంత్రి! ఐఫోన్ 12 రూ. 32,999 కే లభిస్తుందని ఫ్లిప్కార్ట్ తెలిపింది. ఐఫోన్ 14, ఐఫోన్ 14 ప్లస్ ధరలు కూడా త్వరలోనే ప్రకటించనున్నట్లు పేర్కొంది. బిగ్ బిలియన్ డేస్ సందర్భంగా ఐ ఫోన్ 14ను రూ. 50 వేల కంటే తక్కువ ధరకే సొంతం చేసుకోవచ్చు. ఐఫోన్ 14 ధర రూ. 50వేల లోపే ఉంటుందని టీజర్లో ఫ్లిప్కార్ట్ హింట్ ఇచ్చింది. సేల్లో ఈ ఫోన్ ధర మరింత తగ్గుతుందని పేర్కొంటూ.. ‘4?,???’ ఆఫర్ను గెస్ చేయాలని కస్టమర్లను టీజర్ పేజీలో అడుగుతోంది. ఐఫోన్ 14పై రూ. 30వేల వరకు ఎక్స్ఛేంజ్ ఆఫర్ అందిస్తున్నట్లు ఫ్లిప్కార్ట్ టీజర్లో స్పష్టం చేసింది. ఒకవేళ పూర్తి ఎక్స్ఛేంజ్ ఆఫర్ వర్తిస్తే.. మీకు ఐఫోన్ 14 దాదాపుగా రూ. 20,000లకు అందుబాటులో ఉంటుంది. ఎక్స్ఛేంజ్ చేసేముందు పాత ఫోన్కు ఎంత వస్తుందో తెలుసుకుంటే బెటర్. ఐఫోన్ 14ను తక్కువ ధరకు సొంత చేసుకునే అవకాశం మళ్లీ ఎప్పటికో గానీ రాదు అనే చెప్పవచ్చు. #iphone-15 #flipkart #bigbillion-days #iphone-14 సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి