Flight Charges: విమాన ఛార్జీలు తగ్గే ఛాన్స్.. ఎందుకంటే.. 

జెట్ ఇంధన ధరలు తగ్గుతున్నాయి. వరుసగా రెండో నెలలోనూ ఇంధన ధరలు తగ్గడంతో విమానయాన సంస్థలకు ఉపశమనం కలిగింది. దీంతో నిర్వహణ ఖర్చులు భారీగా తగ్గనున్నాయి. ఈ నేపథ్యంలో విమాన ఛార్జీలు తగ్గే అవకాశం ఉందని భావిస్తున్నారు. 

New Update
Flight Charges: విమాన ఛార్జీలు తగ్గే ఛాన్స్.. ఎందుకంటే.. 

Flight Chargesజూలై నుంచి  అక్టోబర్ వరకు వరుసగా నాలుగు నెలల పాటు జెట్ ఇంధనాన్ని అంటే ఎయిర్ టర్బైన్ ఇంధనాన్ని ఖరీదైనదిగా చేసిన తరువాత, చమురు కంపెనీలు వరుసగా రెండవ నెల కూడా ఎయిర్‌లైన్ కంపెనీలకు ఉపశమనం కలిగించాయి. జెట్ ఇంధనం ధరను మొదట నవంబర్‌లో తగ్గించారు. తరువాత ఇప్పుడు డిసెంబర్‌లో కూడా తగ్గించారు. దేశరాజధానిలో జెట్ ఇంధనం ధర నవంబర్ నెలలో ఐదున్నర శాతం కంటే తక్కువ తగ్గింది. డిసెంబర్ నెలలో మళ్ళీ దీనిని 4.5 శాతానికి పైగా తగ్గించారు. దీంతో మొత్తం 10 శాతానికి పైగా జెట్ ఇంధనం ధరలు ఢిల్లీలో తగ్గాయి. ఇప్పడు విమానయాన కంపెనీలకు భారీగా ఉపశమనం లభించినట్టు చెప్పవచ్చు. ఇంధన ధరలు తగ్గడం అంటే విమాన సంస్థలకు భారీగా నిర్వహణ ఖర్చులు తగ్గినట్టే.  ఇప్పుడు విమాన కంపెనీలు ఈ నిర్వహణ ఖర్చుల తగ్గుదల ప్రయోజనాన్ని ప్రయాణీకులకు బదిలీ చేసే ఛాన్స్ ఉంది. అంటే టికెట్ల రేట్లను తగ్గించే అవకాశం కనిపిస్తోంది. 

రెండు నెలల్లో ధరలు 6 శాతానికి పైగా తగ్గాయి

జెట్ ఇంధనం ధరలో (Fuel rates) 10 శాతానికి పైగా ఢిల్లీలో తగ్గుదల కనిపించింది. ఇప్పుడు దేశ రాజధాని ఢిల్లీలో ఏటీఎఫ్ ధర కిలోలీటర్‌కు రూ.1,06,155.67గా ఉంది. నవంబర్ నెలలో ఇది రూ.1,11,344.92లు. అంటే నవంబర్‌తో పోలిస్తే ఢిల్లీలో తగ్గింపు 4.66 శాతం అంటే కిలోలీటరుకు రూ. 5,189.25 తక్కువ ఖర్చు అని అర్ధం.  అక్టోబర్ నెలలో ఢిల్లీలో ఏటీఎఫ్ ధర కిలోమీటరుకు రూ.1,18,199.17గా ఉంది. రెండు నెలల్లో ఈ తగ్గుదల 10.18 శాతానికి అంటే కిలోలీటర్‌కు రూ.12,043.5కి చేరింది.

Also Read: ఇల్లు కొంటున్నారా? ఈ ఐదు విషయాలు జాగ్రత్తగా చెక్ చేసుకోండి..  

జూలై నుంచి ఆగస్టు వరకు ధరలు పెరిగాయి

ప్రస్తుతం వరుసగా రెండు నెలలు ధరలు తగ్గుతూ(Flight Charges) వచ్చాయి. అంతకు ముందు మాత్రం ఢిల్లీలో (Delhi) వరుసగా నాలుగు నెలలపాటు జెట్ ఇంధనం ధర పెరుగుతూ పోయింది.  చివరిసారిగా అక్టోబర్ 1న కిలోలీటర్‌కు  రూ. 5,779.84 లేదా 5.1 శాతం చొప్పున పెంచారు. అంతకుముందు, ATF ధరలు సెప్టెంబర్ 1న అత్యంత వేగంగా 14.1 శాతం (కిలోలీటర్‌కు రూ. 13,911.07)- ఆగస్టు 1న కిలోలీటర్‌కు 8.5 శాతం లేదా రూ. 7,728.38 చొప్పున పెరిగాయి. జూలై 1న, ATF ధర కిలోలీటర్‌కు 1.65 శాతం లేదా రూ.1,476.79 పెరిగింది. నాలుగుసార్లు పెరుగుదల కనపర్చడంతో, ATF ధరలు కిలోలీటర్‌కు రికార్డు స్థాయిలో రూ.29,391.08 పెరిగాయి. జెట్ ఇంధన ధరలు విమానయాన సంస్థల నిర్వహణ ఖర్చులలో 40శాతం వాటాను కలిగి ఉంటాయి. ఇప్పటికే ఆర్థికంగా ఇబ్బందుల్లో కొట్టుమిట్టాడుతున్న నేపథ్యంలో ఈ ధరలు తగ్గించడంతో విమాన సంస్థలపై భారం తగ్గుతుంది. గతంలో జెట్ ఇంధన ధరలు పెరిగినపుడు ప్రయాణీకులకు టికెట్ల ధరను భారీగా పెంచాయి విన్నాను సంస్తలు . ఇప్పుడు ధరలు తగ్గుతుండడంతో టికెట్ల ధరలు తగ్గించే అవకాశం ఉందని భావిస్తున్నారు. 

Watch this interesting Video:

Advertisment
Advertisment
తాజా కథనాలు