Jogi Ramesh : కృష్ణా జిల్లా వైసీపీలో ముదిరిన లొల్లి..జోగికి వ్యతిరేకంగా వెలసిన ప్లెక్సీలు

పెనమలూరు వైసీపీ టెకెట్ ను మంత్రి జోగిరమేష్ కు కేటాయించడాన్ని నిరసిస్తూ స్థానిక నాయకులు ఫ్లెక్సీలు కట్టి నిరసన వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు జోగి రమేష్‌ పుట్టిన  రోజు సందర్భంగా కొత్త నియోజక వర్గం పెనమలూరులో పర్యటించేందుకు సిద్ధం అయ్యారు..

New Update
Jogi Ramesh : కృష్ణా జిల్లా వైసీపీలో ముదిరిన లొల్లి..జోగికి వ్యతిరేకంగా వెలసిన ప్లెక్సీలు

ఎన్నికలకు సమయం దగ్గర పడుతుండడంతో అధికార వైసీపీలో టికెట్ల లొల్లి ముదిరి పాకాన పడుతోంది. పార్టీలో సీట్ల మార్పులు, చేర్పులు చిచ్చు పెడుతున్నాయి. కృష్ణాజిల్లా పెనమలూరు వైసీపీ టికెట్‌ మంత్రి జోగి రమేష్‌కు కేటాయించటంతో స్థానిక నేతలు ప్లెక్సీలు కట్టి నిరసన తెలుపుతున్నారు. పెనమలూరు సిట్టింగ్‌ ఎమ్మెల్యే కొలుసు పార్థసారథి వైసీపీకి గుడ్ బై చెప్పి తెలుగుదేశంలో చేరేందుకు సిద్ధమవటంతో వైసీపీ అధిష్టానం పెడన అసెంబ్లీ నుంచి ప్రాతినిథ్యం వహిస్తోన్న మంత్రి జోగి రమేష్ ను పెనమలూరు ఇంఛార్జిగా నియమించింది. దీంతో పెనమలూరులో పొలిటికల్ ఫ్లెక్సీల వార్‌ నడుస్తోంది. ఆ సీటు తమకే కేటాయించాలని కంకిపాడుకు చెందిన పడమట సురేష్‌బాబు, కమ్మ కార్పొరేషన్‌ ఛైర్మన్‌ తుమ్మల చంద్రశేఖర్‌ (బుడ్డి) లు ఇప్పటికే అధిష్ఠానానికి విజ్ఞప్తి చేశారు. వీరిద్దరూ జోగికి వ్యతిరేకంగా పడమటలో బ్యానర్లు కట్టించి నిరసన తెలిపారు. తుమ్మలబుడ్డి అనుచరులు రాస్తారోకో చేసి నిరసన వ్యక్తం చేశారు. జోగి రమేష్ నాన్ లోకల్ అని ఆయనకు టికెట్ కేటాయిస్తే తాము సహకరించమని సురేష్ తేల్చి చెప్పారు. మరోవైపు జోగి మాకొద్దు, స్థానిక మహిళకే టికెట్ ఇవ్వాలని కంకిపాడులో ప్లెక్సీలు వెలిశాయి.ఇక్కడ ఎలాంటి పరిచయాలు లేని వ్యక్తికి టికెట్‌ ఎలా కేటాయిస్తారంటూ అధిష్టానాన్ని నిలదీస్తున్నారు.

మరోవైపు జోగి రమేష్‌పై పార్టీలో కుట్ర చేసి గెలవని పెనమలూరు సీట్ ఇచ్చారని జోగి అభిమానులు భారీ ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. నేడు మంత్రి జోగి రమేష్‌ పుట్టిన  రోజు సందర్భంగా ఆయన కొత్త నియోజక వర్గం పెనమలూరులో పర్యటించేందుకు సిద్ధం అయ్యారు. దీంతో.. జోగి రమేష్ పెనమలూరు తొలి విజిట్ టెన్షన్‌ పుట్టిస్తోంది. అసమ్మతి రాగాల నడుమ జోగి రమేష్‌ తొలి పర్యటన ఎలా సాగుతుంది అనేది ఆసక్తికరంగా మారింది. జోగి అభిమానులు మాత్రం  మంత్రికిబర్త్ డే విషెస్ చెబుతూనే రెండు సార్లు గెలిచిన పెడన సీటు ఇవ్వకుండా.. కుట్ర చేశారని కామెంట్స్ తో ఫ్లెక్సీలు ఏర్పాటు చేయడంతో పెనమలూరులో టెన్షన్‌ వాతావరణం నెలకొంది.

ఇదిలా ఉండగా జోగి ఇంఛార్జి అవ్వగానే దళిత అధికారులను వేధిస్తున్నాడని వైసీపీ రాష్ట ఎస్సీ సెల్ కన్వీనర్ రాజీనామా చేయడం మరో వివాదానికి దారితీసినట్టు అయ్యింది. పెనమలూరు సీటును మంత్రి జోగి రమేశ్‌కు కేటాయించడాన్ని వ్యతిరేకిస్తూ డీసీఎంఎస్ చైర్‌ప‌ర్స‌న్‌ పడమట స్నిగ్ధ తన పదవికి రాజీనామా చేశారు. తమకు కనీసం మాట మాత్రం కూడా చెప్పకుండా జోగి రమేశ్‌కు పెనమలూరు టికెట్ ఇవ్వడం పట్ల నిరసన వ్యక్తం చేశారు. తమ నియోజకవర్గ సీటును ఆయనకు ఇవ్వడం సమంజసం కాదని స్నిగ్ద అన్నారు. కృష్ణా జిల్లాలో పార్టీ జెండా పట్టుకున్న మొట్టమొదటి వ్యక్తి తన తండ్రి అని గుర్తు చేశారు.

Advertisment
Advertisment
తాజా కథనాలు