తెలంగాణలో బీజేపీ-జనసేన పొత్తు ఫిక్స్..పవన్ కల్యాణ్ కీలక ప్రకటన..!! By Bhoomi 04 Nov 2023 in తెలంగాణ హైదరాబాద్ New Update షేర్ చేయండి తెలంగాణలో ఎన్నికలు సమీపిస్తున్నాయి. ఈ తరుణంలో బీజేపీ తన వ్యూహాలకు మరింత పదునుపెట్టింది. తెలంగాణలో జనసేనతో పొత్తు కోసం ప్రయత్నించిన బీజేపీ ఆ దిశగా దూకుడుగా వ్యవహారించింది. దీనిలో భాగంగానే జనసేన అధినేత పనవ్ కళ్యాణ్ తో బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి శనివారం సాయంత్రం ప్రత్యేకంగా భేటీ అయ్యారు. పవన్ నివాసంలో జరిగిన ఈ భేటీలో జనసేన రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్, బీజేపీ ఓబీసీ మోర్చా చైర్మన్ లక్ష్మణ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా పొత్తుతోపాటుగా, సీట్ల పంపకాలపై ప్రధానంగా చర్చించినట్లు సమాచారం. తెలంగాణ ఎన్నికల్లో బీజేపీతో కలిసి పోటీ చేయాలని నిర్ణయం తీసుకోగా...పవన్ కళ్యాణ్ కీలక ప్రకటన చేశారు. రానున్న ఎన్నికల్లో కలిసి పోటీ చేస్తున్నట్లు వెల్లడించారు. పవన్ కల్యాణ్ ఏమన్నారంటే: -తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో 32 స్థానాల్లో పోటీ చేయాలని భావించాం. -ఎన్డీయే భాగస్వామ్య పక్షంగా భారతీయ జనతా పార్టీతో చర్చలు చేశాం. -సుహృధ్బావంగా ఎన్నికల్లో పోటీ అంశంపై చర్చిస్తున్నాం. -మేము పోటీ చేసే స్థానాలపై చర్చలు తదిదశకు వచ్చాయి. -రెండు స్థానాల విషయంలో ఇంకా తేలాల్సి ఉంది మరోసారి బిటి అవుతాం. -మా పార్టీ పీఏసీ ఛైర్మన్ శ్రీ నాదెండ్ల మనోహర్ గారు ఈ అంశాన్ని సమన్వయం చేస్తున్నారు. -నరేంద్ర మోడీ ముచ్చటగా మూడోసారి ప్రధాని కావాలి . -ఇటీవల జరిగిన ఎన్డీయే మీటింగ్ లో కూడా ఈ దేశానికి మరోసారి నరేంద్ర మోదీ ప్రధానమంత్రిగా ఉండాల్సిన ఆవశ్యకత గురించి మాట్లాడాము. -ఈ నెల 7వ తేదీన హైదరాబాద్ లో బీజేపీ నిర్వహించే బహిరంగ సభలో మోదీ పాల్గొంటారు. -మోదీ హాజరు అయ్యే సభకు నన్ను ఆహ్వానించారు. ఈ సభలో పాల్గొంటాను. ఈ నెల 7న LB స్టేడియంలో @BJP4Telangana అధ్వర్యంలో జరగనున్న BC సదస్సు కు ప్రధాని శ్రీ @narendramodi గారితో కలిసి పాల్గొననున్న @JanaSenaParty అధినేత శ్రీ @PawanKalyan గారు.#TelanganaElection2023 #JSPBJPAlliance — 𝗝𝗮𝗻𝗮𝗦𝗲𝗻𝗮 𝗧𝗲𝗹𝗮𝗻𝗴𝗮𝗻𝗮 (@JSPTelangana) November 4, 2023 భేటీ అనంతరం కిషన్ రెడ్డి వ్యాఖ్యలు: -ఎన్డీయే భాగస్వామ్య పక్షంగా ఉన్న జనసేన పార్టీ మాకు జీహెచ్ఏంసీ ఎన్నికల్లో ఎంతో సహకరించింది. -ఇప్పుడు జరుగుతున్న అసెంబ్లీ ఎన్నికలు ఎంతో కీలకమైనవి. -తెలంగాణకు డబుల్ ఇంజన్ సర్కార్ అవసరం ఉంది. -జనసేనతో సీట్ల సర్దుబాటు చర్చలు ఒక కొలిక్కి వచ్చాయి. -రెండు సీట్ల అంశంపై చర్చించాల్సి ఉంది. -ఈ నెల 7వ తేదీన ఎల్బీ స్టేడియంలో నిర్వహించే బహిరంగ సభలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పాల్గొంటారు. -ఈ సభకు పవన్ కల్యాణ్ ను ఆహ్వానించాం” ఇది కూడా చదవండి: అసెంబ్లీ ఎన్నికలకు ముందు బీజేపీ నేత దారుణ హత్య..!! #pawan-kalyan #bjp #janasena #telangana-elections-2023 #kishan-reddy #laxman మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి