Weight Loss Tips: అధిక బరువు తగ్గించే ఐదు రకాల చట్నీలు.. ఎలా చేసుకోవాలంటే?

అధిక బరువుతో బాధపడేవారు ఇంట్లో కొత్తిమీర, పుదీనా, టమాటా వెల్లుల్లి, కొబ్బరి కరివేపాకు, యాపిల్ దాల్చిన చెక్క వంటి వాటితో చట్నీ చేసుకొని తింటే మంచి ఫలితం ఉంటుందని నిపుణులు అంటున్నారు. వీటితోపాటు ప్రతీరోజూ వ్యాయామం చేయటం వలన ఆరోగ్య ప్రయోజనాలు పొందవచ్చు.

New Update
Weight Loss Tips: అధిక బరువు తగ్గించే ఐదు రకాల చట్నీలు.. ఎలా చేసుకోవాలంటే?

Weight Loss Tips: అధిక బరువు అనేది నేటికాలంలో ఎక్కువగా వేధిస్తున్న సమస్య. ఈ సమస్యకు ప్రధాన కారణం ఆహారం తీసుకునే విధానం, శరీరరానికి తగిన శ్రమ ఇవ్వకపోవడం వల్ల జరుగుతుందని నిపుణులు అంటున్నారు. అయితే.. బరువు పెరగడం వల్ల ఎన్నో ఆనారోగ్య సమస్యలు వస్తాయని హెచ్చరిస్తున్నారు. కొందరైతే.. ఏ చిన్న పని చేసిన త్వరగా అలసిపోతారు. అంతేకాదు కొన్ని సార్లు వారి పనులు వారే చేసుకోలేని ప్రరిస్థితి ఉంటుంది. ఈ అధిక బరువు వలన ఏ పనికోసమైన ఇతరులపై ఆధారపడే అవసరం వస్తుంది. ఇలాంటి కారణంగా చేత ప్రతిఒక్కరూ డాక్టర్లను సంప్రదిస్తే..కొందరు వ్యాయామంపై మక్కువ చూపుస్తున్నారు. అయితే.. నిజానికి వ్యాయామం చేస్తే.. ఆరోగ్యానికి చాలా మంచిదని నిపుణులు అంటున్నారు. కానీ.. అధిక బరువు ఉంటే వ్యాయామం చేయడం అంటే కష్టంగా ఉంటుంది. దీంతోపాటు ఆయాసం, హర్ట్ ఎటాక్ వంటి సమస్యలు వచ్చే అవకాశం ఉంది.  అందుకని ఇంట్లోనే కొన్ని రకాల చట్నీలతో ఆరోగ్యానికి మంచితోపాటు బరువు సమస్య కూడా తగ్గుతారు. అయితే.. బరువు తగ్గాలనుకునే వారు ఇంట్లోనే చట్నీలను సిద్ధం చేసుకుంటే బరువు సింపుల్‌గా తగ్గవచ్చు. ఆహారంలో రుచికరమైన, ఆరోగ్యకరమైన ఈ చట్నీ తీసుకుంటే మంచిది. ఇంట్లో చేసే చట్నీలలో మూలికలు, కూరగాయలు, పండ్లు వంటి తాజా పదార్థాలు వాడుతారు. ఈ రకమైన చట్నీని తింటే అధిక బరువు పెరగకుండా ఉంటారు. అంతేకాదు..కేలరీలు తక్కువ ఉండడం వల్ల బరువు తగ్గుతారు.

బరువు తగ్గించే చట్నీలు ఇవే:

కొత్తిమీర చట్నీ: ఇది ఇంట్లో సులభంగా సిద్ధం చేసుకోవచ్చు. దీనిలో కేలరీ తక్కువ. కాబట్టి ఆరోగ్యానికి మంచిది. బరువు పెరగకుండా చేస్తోంది.

కొబ్బరి కరివేపాకు చట్నీ: ఇది బరువు తగ్గించేందుకు ఉపయోగపడుతుంది. ఈ చట్నీ తినడం వల్ల హెయిర్ ఫాల్ సమస్య నుంచి ఉపశమనం లభిస్తుంది.

పుదీనా చట్నీ: ఈ చట్నీ ఎంతో రుచిగా ఉంటుంది. దీనిని తీనటం వలన బరువు పెరగరు. అంతేకాదు జుట్టు పెరుగుదలకు మేలు చేస్తుంది.

టమాటా వెల్లుల్లి చట్నీ: వెల్లుల్లి ఆరోగ్యానికి ఔషధంగా పనిచేస్తుంది. టమాటో, వెల్లుల్లితో పచ్చడి చేసి తీనడం వల్ల ఎన్నో ప్రయోజనాలు పొందవచ్చు.

యాపిల్ దాల్చిన చెక్క చట్నీ: ఈ చట్నీ అంటే చాలామంది తెలియదు. పేరు వినడానికి కొత్తగా ఉన్న దీనిన చేసుకోని తింటే ప్రయోజనాలు అద్భుతంగా పొందవచ్చు. ఈ చట్నీలో ఫైబర్, విటమిన్లు, ఖనిజాలు ఎక్కువగా ఉంటాయి కాబట్టి బరువు పెరగకుండా చేస్తుంది. ఇవి సహజసిద్ధంగా చేసుకుంటాం కావున బరువు పెరగకుండా ఉండటంతోపాటు ఆరోగ్యానికి మంచిదని ఆరోగ్య నిపుణులు అంటున్నారు.

ఇది కూడా చదవండి: పురుషుల్లో ఈ లక్షణాలు కనిపిస్తే ఏదైనా క్యాన్సర్ కావచ్చు..జర భద్రం!

గమనిక: ఈ కథనం ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇచ్చినది. RTV దీనిని ధృవీకరించడంలేదు. ఆరోగ్య సమస్యల నివారణకు సంబంధిత వైద్య నిపుణుడిని సంప్రదించడం ఉత్తమం.

Advertisment
Advertisment
తాజా కథనాలు