సముద్రంలో చేపల వేటకు వెళ్లి రాత్రికిరాత్రే కోటీశ్వరుడైన మత్స్యకారుడు..

పాకిస్థాన్‌లోని కరాచీ తీర ప్రాంతంలో అరేబియా సముద్రంలోకి చేపల వేటకు వెళ్లిన ఓ వ్యక్తి రాత్రికి రాత్రే కోటీశ్వరుడైపోయాడు. అతని వలలో 10 గోల్డ్‌ ఫిష్‌ (సోవా) లు పడ్డాయి. వాటిని కరాచీ హర్బర్‌లో వేలం వేయగా రూ.7 కోట్లకు అమ్ముడుపోయాయి. ఒక్కో చేప రూ.70 లక్షల ధర పలికింది.

New Update
సముద్రంలో చేపల వేటకు వెళ్లి రాత్రికిరాత్రే కోటీశ్వరుడైన మత్స్యకారుడు..

కాలం ఎవరికి ఎప్పుడు, ఎలా ఉంటుందో ఎవరూ ఊహించలేరు. కొంతమంది రాత్రికి రాత్రే సెలబ్రిటీలు అయిపోతుంటారు. మరికొందరు కోటీశ్వరులైపోతుంటారు. ఇక ఇంకొందరు ఉన్న ఆస్తులు పొగొట్టుకుంటారు. ఇలాంటి ఊహించని పరిణామాలు ప్రపంచంలో ఎక్కడో ఓ చోట నిత్యం జరుగుతూనే ఉంటాయి. మన ఇండియాలో కూడా ఈ మధ్య ఇలాంటి ఘటనలు చాలానే జరిగాయి. కొందరికి లాటరీలు తగిలి అప్పటికప్పుడే కోటీశ్వరులైపోతున్న వారి గురించి వార్తల్లో కూడా చూస్తున్నాం. అయితే తాజాగా ఇలాంటిదే కాస్త భిన్నంగా జరిగింది. సముద్రంలో ఓ చేప దొరికి మత్స్యకారుడు రాత్రికి రాత్రే కోటీశ్వరుడైపోయాడు. ఈ ఘటన పాకిస్థాన్‌లో చోటుచేసుకుంది. ఇంతకీ ఏం జరిగిందో తెలియాలంటే ఈ వీడియో చూడాల్సిందే.

ఇక వివరాల్లోకి వెళ్తే.. కరాచీ తీరంలోని ఇబ్రహీం హైదరి గ్రామానికి చెందిన హజీ బలోచ్‌ అనే వ్యక్తి సముద్రంలో చేపలు పట్టుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. అయితే సోమవారం రాత్రి ఎప్పటిలాగే తన వద్ద పనిచేసే మత్స్యకారులతో కలిసి అరేబియా మహాసముద్రంలోకి వేటకి వెళ్లాడు. అయితే అలా వెళ్తుండగా.. అంతలోనే 10 గోల్డ్‌ఫిష్‌ (సోవా)లు అతడి వలకు చిక్కాయి. ఇక శుక్రవారం నాడు ఈ చేపలను కరాచీ హర్బర్‌లో వేలం వేయగా.. అవి మొత్తం ఏకంగా రూ.7 కోట్ల రూపాయలకు అమ్ముడుపోయాయి. ఒక్కో సోవా చేప రూ.70 లక్షల ధర పలికింది.

Also read: అదానీ సంస్థ రూ.13 వేల కోట్ల కుంభకోణానికి పాల్పడింది.. మొయిత్రా సంచలన ఆరోపణలు..

అయితే ఈ సోవా చేప పొట్ట నుంచి వచ్చే పదార్థాలు అనేక ఔషధ గుణాలు ఉంటాయని స్థానికులు చెప్పారు. ఈ చేపల నుంచి తీసే దారం లాంటి పదార్థాన్ని ఆపరేషన్లలో వినియోగిస్తారని తెలిపారు. సాధారణంగా ఈ చేప 20 నుంచి 40 కిలోల బరువు ఉంటుందని.. 1.5 మీటర్ల వరకు పెరుగుతుందన్నారు. అయితే ఈ సోవా చేపలు తూర్పు ఆసియా దేశాల్లో చాలా ఎక్కువగా దొరుకుతాయని వెల్లడించారు.

Advertisment
Advertisment
తాజా కథనాలు