Hyderabad: నడిరోడ్డు మీద కాలి బూడిద అయిన బీఎండబ్ల్యూ

రోడ్డు మీద వెళుతున్న కారులో ఉన్నట్టుండి మంటలు చెలరేగి...పూర్తిగా కాలి బూడిద అయిపోయింది. హైదరాబాద్‌లోని జూబ్లీహిల్స్‌లో ఈ సంఘటన జరిగింది. అదృష్టవశాత్తు డ్రైవర్ తప్పించుకుని ప్రాణాలతో బయటపడ్డారు. దీంతో చాలాసేపు రోడ్డు మీద ట్రాఫిక్ నిలిచింపోయింది.

New Update
Hyderabad: నడిరోడ్డు మీద కాలి బూడిద అయిన బీఎండబ్ల్యూ

పేరుకే ఖరీదైన కార్లు. కానీ సాధారణ కార్ల కన్నా కనిష్టంగా ఉంటున్నాయి. ఊహించని విధంగా మంటలు రావడం, కాలిపోవడం లాంటి సంఘటనలతో బెంబేలెత్తిస్తున్నాయి. లక్షలు, కోట్లు పోసి కొనుక్కున్న కార్లు కళ్ళముందే నాశనం అవుతుంటే ఏం చేయలేక వాపోతున్నారు ఓనర్లు. తాజాగా హైదరాబాద్‌లోని జూబ్లీహిల్స్ నడిరోడ్డు మీద ఓ బిఎండబ్ల్యూ కారు దగ్ధమైపోయింది. ఒక్కసారిగా కారులో మంటలు చెలరేగి...నిమిషాల్లో మొత్తం కాలి బూడిద అయిపోయింది. అదృష్టవశాత్తు డ్రైవర్ ప్రాణాలతో బయటపడ్డారు.

జూబ్లీ హిల్స్ నందగిరి హిల్స్‌లో ఈ ప్రమాదం జరిగింది. సాధారణంగా ఇది బిజీ రోడ్డు కావడంతో ...ప్రమాదం జరిగిన తరువాత కిలోమీటర్ల మేర ట్రాఫిక్ నిలిచిపోయింది. జూబ్లీహిల్స్‌ చెక్‌పోస్టు నుంచి ఫిల్మ్‌నగర్‌, ఒమేగా ఆసుపత్రి నుంచి నందగిరి హిల్స్‌ వరకు గంటలపాటూ ట్రాఫిక్‌కు అంతరాయం ఏర్పడింది. అగ్నిమాపక సిబ్బంది వచ్చేసరికే కారు పూర్తిగా కాలిపోయింది. అయితే మంటలు చెలరేగి ఇతర కార్లకు, చుట్టుపక్కల ప్రాంతాలకు వ్యాపించకుండా అగ్నిమాపక సిబ్బంది మంటలను వెంటనే ఆర్పేశారు. ఈలోగా ట్రాఫిక్ పోలీసులు ట్రాఫిక్‌సు కంట్రోల్ చేశారు.

Also Read:Telangana: వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల కీలక ఆదేశాలు!

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

USA: 90 రోజులు టారీఫ్ లకు బ్రేక్..అంతా ఒట్టిదే..వైట్ హౌస్

ట్రంప్ టారీఫ్ ల దెబ్బకు ప్రపంచ మార్కెట్లు అతలాకుతలం అవుతున్నాయి. దీంతో అమెరికా అధ్యక్షుడు సుంకాలను ఆపేస్తారనే వార్తలు వచ్చాయి. అయితే వాటిని వైట్ హౌస్ కొట్టిపడేసింది. టారీఫ్ లను ఆపే ప్రసక్తే లేదని తేల్చి చెప్పింది. 

New Update
us

White House

 ప్రతీకార సుంకాలను ఆపేది లేదని తేల్చి చెప్పారు అమెరికా అధ్యక్షుడు ట్రంప్, వైట్ హౌస్. ఏది ఏమైనా టారీఫ్ లను కొనసాగిస్తామని చెప్పారు. మా విధానంలో ఎటువంటి మార్పూ ఉండదు అన్నారు. అయితే ఏ దేశమైనా టారీఫ్ ల మీద చర్చకు వస్తే తాము సుముఖంగా ఉన్నామని ట్రంప్ స్పష్టం చేశారు. మరోవైపు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కొత్త సుంకాలను 90 రోజుల పాటు నిలిపివేయాలని ఆలోచిస్తున్నారనే వార్తలను వైట్ హౌస్ ఖండించింది. దానిపై వస్తున్న వార్తలన్నీ నకిలీవి అని వైట్ హౌస్ ప్రెస్ సెక్రటరీ కరోలిన్ లీవిట్ అన్నారు. 

 

ఒక్క పోస్ట్ తో అంతా తారుమారు..

నిన్న ఎక్స్ లో వాల్టర్ బ్లూమ్ బెర్గ్, నేషనల్ ఎకనామిక్ కౌన్సిల్ డైరెక్టర్ కెవిన్ హాసెట్,  అమెరికా అధ్యక్షుడు ట్రంప్ చైనా మినహా అన్ని దేశాలకు 90 రోజుల సస్పెన్షన్ గురించి ఆలోచిస్తున్నారని పోస్ట్ లు వచ్చాయి. దీంతో మార్కెట్లో గందరగోళం మొదలైంది.  ఈ ఒక్క పోస్ట్ తో స్టాక్ మార్కెట్ హెచ్ థగ్గులకు గురైంది. దీని గురించే ఈరోజు వైట్ హౌస్  మాట్లాడింది. హాసెట్ చెప్పినదాన్ని జనాలు తప్పుగా అర్ధం చేసుకున్నారని వైట్ హౌస్ ప్రెస్ సెక్రటరీ కరోలిన్ లీవిట్ అన్నారు. ట్రంప్ కు అలాంటి ఆలోచన లేదని స్పష్టం చేశారు. అయితే అసలు ఈ చర్చ అంతా బిలియనీర్ హెడ్జ్ ఫండ్ పెట్టుబడిదారుడు, ట్రంప్ మద్దతుదారుడు అయిన బిల్ అక్మాన్ ఆదివారం ట్రంప్ అసమాన సుంకాల ఏర్పాట్లను పరిష్కరించడానికి, దేశానికి గణనీయమైన పెట్టుబడులను ఆకర్షించడానికి "90 రోజుల గడువు" అమలు చేయాలని సూచించిన తర్వాత చర్చ ప్రారంభమైంది.

 today-latest-news-in-telugu | usa | donald trump tariffs | white-house

Also Read: RCB VS MI: ముంబయ్ గెలుస్తుంది అనుకుంటే...బెంగళూరు తన్నుకుపోయింది

Advertisment
Advertisment
Advertisment