Fire Accidents: గుజరాత్ నుంచి ఢిల్లీ వరకూ 24 గంటల్లో మూడు అగ్నిప్రమాదాలు.. బూడిదైన 42 ప్రాణాలు.. 

24 గంటలు..మూడు అగ్ని ప్రమాదాలు..42 మంది ఆహుతి అయిపోయారు. గుజరాత్, ఢిల్లీలో ఈ ప్రమాదాలు జరిగాయి. ఈ ప్రమాదాల్లో మరణించిన వారిలో 12 మంది చిన్నారులు ఉన్నారు. దేశవ్యాప్తంగా ఈ ఘటనలు కలకలం రేపుతున్నాయి 

New Update
Fire Accidents: గుజరాత్ నుంచి ఢిల్లీ వరకూ 24 గంటల్లో మూడు అగ్నిప్రమాదాలు.. బూడిదైన 42 ప్రాణాలు.. 

Fire Accidents: అగ్నిప్రమాదాలు.. ప్రాణాలను తీసేస్తున్నాయి. గత 24 గంటల్లోనే  గుజరాత్‌ నుంచి ఢిల్లీ వరకు జరిగిన మూడు భారీ అగ్నిప్రమాదాల్లో 19 మంది చిన్నారులు సహా 42 మంది చనిపోయారు. శనివారం రాత్రి 11:30 గంటలకు వివేక్ విహార్‌లోని న్యూ బోర్న్ బేబీ కేర్ సెంటర్‌లో జరిగిన అగ్నిప్రమాదంలో ఏడుగురు అమాయక పిల్లలు మరణించగా, కృష్ణానగర్‌లోని ఓ ఇంట్లో జరిగిన అగ్నిప్రమాదంలో ముగ్గురు వ్యక్తులు మరణించారు. అదే సమయంలో, రాజ్‌కోట్ అగ్నిప్రమాదంలో 12 మంది చిన్నారులు సహా 33 మంది మరణించారు. 

రాజ్‌కోట్ లో.. 
గుజరాత్‌లోని రాజ్‌కోట్‌లోని గేమింగ్ జోన్‌లో శనివారం సాయంత్రం జరిగిన అగ్ని ప్రమాదం(Fire Accidents)లో కనీసం 12 మంది చిన్నారులు సహా 24 మంది వ్యక్తులు మరణించారని తొలుత వార్తలు వచ్చాయి. ఆదివారం ఉదయానికి మృతుల సంఖ్య 33కు చేరుకుంది. ఈ గేమింగ్ సెంటర్ లో మరమ్మత్తులు జరుగుతుండడం ప్రమాదానికి కారణంగా ప్రాథమికంగా నిర్ధారించారు. అక్కడ ఒక వెల్డింగ్ మిషన్ నుంచి వెలువడిన నిప్పురవ్వలు భారీ ప్రమాదాన్ని తీసుకువచ్చినట్టు భావిస్తున్నారు. శనివారం కావడంతో ఎక్కువ మంది పిల్లలు గేమింగ్ జోన్ లో ఉన్నారు. వారి తల్లిదండ్రులు కూడా అక్కడే ఉన్నారు. మంటలు ఒక్కసారిగా రావడంతో తప్పించుకోవడానికి కూడా అవకాశం లేక ఎక్కువమంది ఆహుతి అయిపోయినట్టు తెలుస్తోంది. చాలామంది పూర్తిగా కాలిపోవడంతో ఎవరనేది గుర్తించే పని కూడా కష్టంగా ఉందని పోలీసులు చెబుతున్నారు. ఈ ఆర్టికల్ సమయానికి ఇంకా అక్కడ సహాయక చర్యలు.. వెతుకులాట జరుగుతూ ఉంది. మృతుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉందని అధికారులు భావిస్తున్నారు. 

ఢిల్లీలో.. అపార్ట్మెంట్ లో..
ఢిల్లీలో శనివారం ఉదయం కృష్ణానగర్ ప్రాంతంలోని నివాస భవనంలో మంటలు చెలరేగడంతో ముగ్గురు వ్యక్తులు మరణించారు. తెల్లవారుజామున 2.30 గంటల ప్రాంతంలో అగ్నిమాపక సిబ్బందికి కాల్ వచ్చిందని, ఐదు అగ్నిమాపక యంత్రాలు సంఘటనా స్థలానికి చేరుకున్నాయని అధికారులు తెలిపారు. అగ్నిమాపక అధికారులు చెబుతున్నదాని ప్రకారం మొత్తం 13 మందిని రక్షించారు.  ముగ్గురు మరణించినట్లు ప్రకటించారు. మొదటగా భవనంలోని పార్కింగ్ స్థలంలో మంటలు చెలరేగాయి. అగ్నిప్రమాదానికి గల కారణాలు ఇంకా తెలియరాలేదు.

చిన్నపిల్లల సంరక్షణా కేంద్రంలో 
తూర్పు ఢిల్లీలోని వివేక్ విహార్‌లోని పిల్లల సంరక్షణ కేంద్రంలో శనివారం (మే 25) రాత్రి 11.32 గంటలకు మంటలు(Fire Accidents) చెలరేగాయని, వెంటనే 9 అగ్నిమాపక దళాలను సంఘటనా స్థలానికి పంపించామని అగ్నిమాపక శాఖ సమాచారం అందించింది. ఈ ఘటనలో 12 మంది నవజాత శిశువులను భవనంపై నుంచి బయటకు తీశారని, అయితే చికిత్స పొందుతూ ఆరుగురు మరణించారని అధికారులు తెలిపారు. ఆరుగురు శిశువులు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు.

దేశవ్యాప్తంగా ఆవేదన.. 
దేశవ్యాప్తంగా ఈ వరుస అగ్నిప్రమాదాలు సంచలనం సృష్టించాయనే చేప్పాలి. 12 మంది చిన్నారులు అందులోనూ ఆరుగురు నవజాత శిశువులు మరణించారని తెలిసిన ప్రజలు ఆవేదన చెందుతున్నారు. ఈ మూడు ప్రమాదాల్లోనూ నిర్లక్ష్య ధోరణే ఎక్కువ కనబడుతోంది. గుజరాత్ లో జరిగిన ప్రమాదంలో ఒక పక్క గేమింగ్ సెంటర్ రెన్నోవేట్ చేస్తూనే.. మరోపక్క నడిపిస్తున్నారు. శనివారం వీకెండ్ కావడంతో పిల్లలు గారి తల్లిదండ్రులు చాలామంది అక్కడకు చేరుకున్నారు. అకస్మాత్తుగా మంటలు చెలరేగడంతో తప్పించుకునే అవకాశం కూడా లేకుండా అక్కడ ఉన్నవారు మరణించారు. రిపేర్లు చేస్తూనే గేమింగ్ సెంటర్ నడిపించడం తప్పు. పైగా.. పిల్లలు ఆదుకునే ప్రాంతంలోనే వెల్డింగ్ వంటి పనులు నిర్వహిస్తూ ఉండడం ఈ అతిపెద్ద ప్రమాదానికి కారణంగా మారింది. 

ఇక ఢిల్లీలోని శిశు సంరక్షణ కేంద్రంలో కూడా ప్రమాదానికి కారణం పూర్తిగా తెలియకపోయినా.. మానవ తప్పిదాలే ఇందుకు కారణం కావచ్చని అగ్నిమాపక దళ అధికారులు భావిస్తున్నారు. అక్కడ ఉన్న ఆక్సిజన్ సిలెండర్లు ఒకదాని తరువాత ఒకటి వరుసగా 6 పేలాయని ప్రత్యక్ష సాక్షులు చెప్పారు. ఈ ప్రమాదంలో 13 మంది చిక్కుకున్నారు. వారిలో 12 మంది నవజాత శిశువులు. వీరందరినీ బయటకు తీసుకువచ్చినా.. అప్పటికే కాలిపోయి గాయాలైన ఆరుగురు చిన్నారులు ఆసుపత్రిలో మరణించారు. 

అలాగే,  ఢిల్లీ నివాస ప్రాంతంలో జరిగిన సంఘటనకు కారణం కూడా మానవ తప్పిదమే కావచ్చని అంచనా. పార్కింగ్ ప్రాంతంలో మంటలు చెలరేగాయి. ఈ ప్రమాదంలో ముగ్గురు మరణించారు. 

ఇది కూడా చదవండి: ఆస్పత్రిలో ఘోర అగ్ని ప్రమాదం.. ఏడుగురు శిశువులు మృతి

వేసవిలో అగ్ని ప్రమాదాలు ఎక్కువ..
ఢిల్లీలో  వేసవి కాలం పెరిగేకొద్దీ, అగ్నిప్రమాదాలు ఎక్కువ జరుగుతాయి.  ఢిల్లీలో గత 15 సంవత్సరాల రికార్డుల ప్రకారం, ప్రతి రోజు 170 ఫైర్ కాల్స్ వస్తాయి.  అయితే, శీతాకాలంలో ఇది తక్కువగా ఉంటుంది. ఆ సమయంలో ఫైర్ కాల్స్ 80 నుండి 90 వరకు ఉంటాయి. ఉష్ణోగ్రతలు  ఎక్కువగా ఉండడంతో ఏదైనా చిన్న స్పార్క్ వస్తే చాలు,  మంట చాలా వేగంగా వ్యాపిస్తుంది. వేసవిలో విద్యుత్ కు సంబంధించిన మంటలు ఎక్కువగా సంభవిస్తాయి. ACలో, ఎలక్ట్రిక్ మీటర్ లో అగ్ని వేగంగా సంభవిస్తుంది.  ఎందుకంటే అవి ఎక్కువ హీట్ ఎక్కే అవకాశం ఉంటుంది. అలాగే  విద్యుత్ డిమాండ్ కారణంగా లోడ్ ఉంటుంది. కృష్ణానగర్ అగ్నిప్రమాదంలో కూడా ఒక మీటర్ మంటలు చెలరేగడంతో మంటలు వ్యాపించాయి, పొగలు నిండి ముగ్గురు వ్యక్తులు మరణించారు.

అగ్ని ప్రమాదం జరిగినప్పుడు తప్పించుకునే మార్గం చాలా ముఖ్యం
అగ్నిప్రమాదం జరిగితే తప్పించుకునే మార్గం చాలా ముఖ్యమని అగ్నిమాపక అధికారులు చెబుతున్నారు. ముందుగా అగ్ని ప్రమాదం జరిగితే అగ్నిమాపక బృందానికి సమాచారం అందించాలి. పెద్ద మంటను మనకు మనమే ఆర్పలేము. అందువల్ల మనకు మనమే మంటలు ఆర్పాలని ప్రయత్నాలు చేస్తూ సమయాన్ని వృధా చేయకూడదు. వెంటనే ఫైర్ స్టేషన్ కు సమాచారం ఇవ్వాలి. అదే సమయంలో ప్రజలు గుంపుగా గుమిగూడకుండా, అగ్నిమాపక సిబ్బందికి దారి ఇవ్వాలి. ప్రజలు గుంపుగా ఉంటె అగ్నిమాపక బృందానికి మంటల ప్రాంతాలకు దగ్గరగా చేరుకోవడం కష్టం. అగ్నిమాపక బృందం ఎదుర్కొంటున్న అతి పెద్ద సమస్య ఏమిటంటే, సకాలంలో సమాచారం అందకపోవడం.  సమాచారం సరిగ్గా లేకపోవడం, ప్రజలు రోడ్డుపై గుమిగూడడం.. మన గోల్డెన్ టైమ్ 5 నుండి 8 నిమిషాల వృధా కావడానికి కారణంగా చెప్పవచ్చు. అందుకే.. అగ్నిప్రమాదం జరిగినపుడు అన్ని రకాలుగానూ జాగ్రత్తలు తీసుకోవాలి.. వీలైనంత వరకూ అగ్నిమాపక సిబ్బందికి సహకరించడం చాలా ముఖ్యం.

Advertisment
Advertisment
తాజా కథనాలు