Fire Accident: షాపింగ్‌మాల్‌లో భారీ అగ్నిప్రమదం.. కోట్లాది రూపాయల ఆస్తి నష్టం..

కామారెడ్డి జిల్లా కేంద్రంలో అయ్యప్ప షాపింగ్‌ మాల్‌లో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. బుధవారం రాత్రి 11.30 గంటలకు మంటలు చెలరేగడంతో షాపింగ్ మాల్ నాలుగంతస్తుల వరకు మంటలు వ్యాపించాయి. ప్రస్తుతం అగ్నిమాపక సిబ్బంది మంటలు ఆర్పుతున్నారు.

New Update
Fire Accident: షాపింగ్‌మాల్‌లో భారీ అగ్నిప్రమదం.. కోట్లాది రూపాయల ఆస్తి నష్టం..

Fire Accident in Ayyappa Shopping Mall: కామారెడ్డిలో (Kamareddy) జిల్లా కేంద్రంలోని అయ్యప్ప షాపింగ్‌ మాల్‌లో భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. బుధవారం అర్థరాత్రి 11.30 గంటలకు ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. దీంతో క్రమంగా షాపింగ్ మాల్‌ నాలుగంతస్తుల వరకు మంటలు వ్యాపించాయి. ఈ ప్రమాదంలో షాపింగ్‌ మాల్‌లో ఉన్న సామాగ్రి కాలిపోయింది. అక్కడి స్థానికుల సమాచారం మేరకు అగ్నిమాపక సిబ్బంది హుటాహుటీనా ఘటనాస్థలానికి చేరుకున్నారు. మంటలను అదుపు చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. ఉదయం 7 గంటల వరకి రెండు అంతస్తుల్లో ఉన్న మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. కానీ మరో రెండతస్తుల్లో మంటలు ఇంకా అదుపులోకి రాలేదు. దీంతో చుట్టుపక్కల పరిసర ప్రాంతాలు భయాందోళనకు గురవుతున్నారు. ఈ ప్రమాదంలో కోట్లాది రూపాయల ఆస్తి నష్టం జరిగి ఉండొచ్చని అధికారులు అంచనా వేస్తున్నారు. అయితే ఈ అగ్నిప్రమాదం ఎలా జరిగింది అనే దానిపై ఇంకా స్పష్టత లేదు. ప్రస్తుతం దీనిపై పోలీసులు విచారణ చేస్తున్నారు. షాపింగ్ మాల్‌లో ఎవరూ లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది.

Also Read: మేడిగడ్డ బ్యారేజ్‌ను మళ్లీ పరిశీలించాల్సిన అవసరం ఉంది: జాతీయ డ్యాం సేఫ్టీ అథార్టీ

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

SRH VS PBKS: ఉప్పల్‌లో కొడితే తుప్పల్లో పడింది భయ్యా.. సన్‌రైజర్స్ ముందు భారీ టార్గెట్

సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో పంజాబ్ కింగ్స్ జట్టు చెలరేగిపోయింది. తొలి ఇన్నింగ్స్ చేసి కింగ్స్ జట్టు నిర్దేశించిన 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 245 పరుగులు సాధించింది. దీంతో SRH ముందు 246 భారీ టార్గెట్ ఉంది.

New Update
Punjab Kings batsman Shreyas Iyer scored 82 runs in the match against Sunrisers