Relationship: మీ భాగస్వామి మీకు సరైందో కాదో ఇలా తెలుసుకోండి సంబంధాలలో ప్రతి ఒక్కరూ తమ భాగస్వామి తమ కలల పార్టనర్ గా ఉండాలని కోరుకుంటారు. ప్రేమలో ఏది మంచి, ఏది చెడు అనేది ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలని నిపుణులు అంటున్నారు. ఓ వ్యక్తి మీకు లైఫ్ పార్టనర్ గా సరిపోతారో లేదో తెలుసుకోవడానికి ఆర్టికల్ లోకి వెళ్ళండి. By Vijaya Nimma 20 Mar 2024 in Latest News In Telugu లైఫ్ స్టైల్ New Update షేర్ చేయండి Relationship: సంబంధాలలో ప్రతి ఒక్కరూ తమ భాగస్వామి తమ కలల భాగస్వామిగా ఉండాలని కోరుకుంటారు. కానీ సంబంధం సరైన దిశలో వెళ్తుందో లేదో తెలుసుకోవడం ఎలా అనే ప్రశ్న ప్రతి ఒక్కరిలో తలెత్తుతుంది. అందుకే ప్రేమలో ఏది మంచి, ఏది చెడు అనేది ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలని నిపుణులు అంటున్నారు. రెడ్ ఫ్లాగ్ అంటే? రెడ్ ఫ్లాగ్ అనేది సంబంధంలో సమస్యల గురించి చెప్పే హెచ్చరిక సంకేతం. ఇవి ఏదో తప్పు జరిగిందని, మీతో మీ భాగస్వామికి మధ్య ఉన్న అవగాహనను ప్రభావితం చేసే లక్షణాలు. ఉదాహరణకు మీ భాగస్వామి ఎక్కువ అసూయతో ఉన్నా లేదా ఎప్పుడూ మిమ్మల్ని అణచివేసేందుకు ప్రయత్నిస్తుంటే, మీతో సంభాషించేటప్పుడు గౌరవం ఇవ్వకపోతే అవి రెడ్ ఫ్లాగ్ చిహ్నమే అని గుర్తించాలి. ఇలాంటి సంకేతాలను ముందుగానే గుర్తించడం వల్ల తప్పులు సరిదిద్దుకుని జీవితాన్ని సాఫీగా సాగిపోతుందని అంటున్నారు. గ్రీన్ ఫ్లాగ్: ఆకుపచ్చ జెండాలు సంబంధం సరైన దిశలో కదులుతున్నాయని చూపించే సానుకూల సంకేతాలు. ఇవి మీ భాగస్వామి, మీ సంబంధం ఆరోగ్యంగా, దృఢంగా ఉందని చూపే అంశాలని నిపుణులు అంటున్నారు. మీ భాగస్వామి మీ మాట వింటుంటే, మిమ్మల్ని గౌరవిస్తే, మీ అభిప్రాయాలకు మద్దతుగా నిలిస్తే ఇవి పచ్చజెండాలు. ఇలా చేయడం వల్ల నమ్మకం, గౌరవం, నిజాయితీ పెరుగుతుందని నిపుణులు చెబుతున్నారు. ఒకరికొకరు సహకరించుకుంటూ ఉండటం వల్ల మంచి భవిష్యత్ ఉంటుందని నిపుణులు అంటున్నారు. ఇది కూడా చదవండి: డయాబెటిస్‌తో స్ట్రెస్‌కి ఉన్న సంబంధం ఏంటి? దాన్ని ఎలా కంట్రోల్ చేయాలో తెలుసుకోండి! గమనిక: ఈ కథనం ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇచ్చినది. RTV దీనిని ధృవీకరించడంలేదు. ఆరోగ్య సమస్యల నివారణకు సంబంధిత వైద్య నిపుణుడిని సంప్రదించడం ఉత్తమం. #relationship #lifestyle మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి