National: ఏడోసారి బడ్జెట్‌తో చరిత్ర సృష్టించనున్న నిర్మలా సీతారామన్ ఈ నెల 22 నుంచి వర్షాకాల పార్లమెంట్ సమావేశాలు మొదలవనున్నాయి. ఇందులో ఆర్ధిక మంత్రి నిరమలా సీతారామన్ తన ఏడవ కేంద్ర బడ్జెట్‌ను ప్రవేశపెట్టనున్నారు. ఈమె కన్నా ముందు మాజీ ప్రధాని మొరార్జీ దేశాయ్ ఆరుసార్లు బడ్జెట్‌ను సమర్పించారు. ఈ రికార్డ్‌ను నిర్మలమ్మ బద్దలు కొట్టనున్నారు. By Manogna alamuru 21 Jul 2024 in Latest News In Telugu నేషనల్ New Update షేర్ చేయండి Nirmala Sita Raman: ఆర్ధిక మంత్రి నిర్మలా సీతారామన్ చరిత్ర సృష్టించనున్నారు. ఏడుసార్లు కేంద్ర బడ్జెట్‌ను ప్రవేశపెట్టిన ఆర్ధిక మంత్రిగా రికార్డులకెక్కనున్నారు. ఆరు బడ్జెట్లు సమర్పించిన మొరార్జీ దేశాయ్ రికార్డును ఆమె బద్దలు కొట్టనున్నారు.ఇప్పటివరకు నిర్మలా సీతారామన్ ఆరు బడ్జెట్లు సమర్పించారు. వాటిలో ఐదు పూర్తి బడ్జెట్లు మరియు ఒకటి మధ్యంతర బడ్జెట్. మధ్యంతర కేంద్ర బడ్జెట్ 1 ఫిబ్రవరి 2024న సమర్పించబడింది. ఇక 1959 నుంచి 1964 వరకు దేశ ఆర్థిక మంత్రిగా పనిచేసిన దేశాయ్ కూడా ఆరుసార్లు బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు. వర్షాకాల పార్లమెంట్ సమావేశాలు రేపటి నుంచి ప్రారంభం కానున్నాయి. బడ్జెట్ సన్నాహాల్లో భాగంగా.. ఆర్థిక మంత్రిత్వ శాఖ ఆర్థిక వ్యవస్థలోని వివిధ వాటాదారులతో అనేక రౌండ్ల సంప్రదింపులను పూర్తి చేశారు. ఈ సమావేశాలు జూన్ 20న ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా సీతారామన్ ట్రేడ్ యూనియన్‌లు, విద్య మరియు ఆరోగ్య రంగం, ఉపాధి మరియు నైపుణ్యాలు,ఎంఎస్ఎమ్ఈ, వాణిజ్యం,సేవలు, పరిశ్రమలు, ఆర్థికవేత్తలు, ఆర్థిక రంగం, క్యాపిటల్ మార్కెట్‌ల ప్రతినిధులతో పాటు మౌలిక సదుపాయాలు, ఇంధనం, పట్టణ రంగాల ప్రతినిధులతో సమావేశమయ్యారు. ప్రధాని మోదీ కూడా పలు అధికారులతో సంప్రదింపులు జరిపారు. రానున్న బడ్జెట్‌లో ఉపాధి కల్పనతో పాటు ఆర్థిక లోటును తగ్గించడంపై దృష్టి సారించాలని ఆర్థికవేత్తల బృందం మంత్రిత్వ శాఖకు సూచించింది. దాంతో పాటూ మూలధన వ్యయాన్ని పెంచాల్సిన అవసరాన్ని ఆర్థికవేత్తలు కూడా చెప్పారు. ఈసారి పార్లమెంటు సమావేశాల్లో మోదీ ప్రభుత్వం ఆరు బిల్లులను ప్రవేశెట్టనుంది. వీటిలో ఎయిర్‌క్రాఫ్ట్ చట్టం, జమ్మూ కాశ్మీర్ బడ్జెట్‌కు పార్లమెంటు ఆమోదం ముఖ్యమైనవి. 23వ తేదీన ఆర్ధిక మంత్రి నిర్మలా సీతారామన్ బడ్జెట్ ప్రవేశపెట్టనున్నారు. Also Read:Bangladesh: రిజర్వేషన్ల కోటాను తగ్గించండి-బంగ్లాదేశ్ సుప్రీంకోర్టు తీర్పు #parliament #budget #nirmala-sita-raman మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి