FilmFare 2024: ఫిల్మ్‌ఫేర్ నామినేషన్స్ లిస్ట్ ప్రకటన...19 కేటగిరీల్లో యానిమల్ మూవీ

2023 ఫిల్మఫేర్ అవార్డులకు నామినేషన్స్‌లో ఉన్న సినిమాల లిస్ట్‌ ను ప్రకటించారు. దీనిలో అన్నిటికంటే అత్ధికంగా మన తెలుగు డైరెక్టర్ తీసిన యానిమల్ సినిమా 19 కేటగిరీల్లో పోటీకి సిద్ధమయ్యింది.

New Update
FilmFare 2024: ఫిల్మ్‌ఫేర్ నామినేషన్స్ లిస్ట్ ప్రకటన...19 కేటగిరీల్లో యానిమల్ మూవీ

69th Filmfare Awards: 69వ ఫిల్మ్‌ఫేర్ అవార్డులకు రంగం సిద్ధమయ్యింది. జనవరి 27,28లో గుజరాత్‌లోని గాంధీనగర్‌లో ఈ అవార్డుల వేడుక జరగనుంది. 2023 ఏడాదికి గానూ ఇస్తున్న అ అవార్డుల నామినేషన్స్ లిస్ట్ ను ప్రకటించారు. ఈసారి ఫిల్మ్‌ఫేర్ (Filmfare Awards) అవార్డుకోసం బాలీవుడ్‌లో గట్టిపోటీనే నెలకొంది. బాలీవుడ్ బాద్షా (Shah Rukh Khan) సినిమాలకు, యానిమల్ కు టఫ్‌ ఫైట్ జరిగే అవకాశం కనిపిస్తోంది. షారుఖ్ ఖాన్.. రెండు సినిమాలతో బెస్ట్ యాక్టర్ రేసులో నిలబడగా... రణబీర్ కపూర్ (Ranbir Kapoor) నటించిన ‘యానిమల్’  ఏకంగా 19 కేటగిరిల్లో అవార్డ్స్ కోసం పోటీపడుతోంది.

Also read:నాల్గవ జాబితా మీద వైసీపీ కసరత్తులు…ఇవాళో, రేపో విడుదల

యానిమల్‌దే హవా అంతా...

బాలీవుడ్‌లో ఇప్పుడు యానిమల్ (Animal Movie) హవా నడుస్తోంది. సూపర్ డూపర్ హిట్ అయి టాక్ ఆఫ్ ద ఇండస్ట్రీ గా నిలిచిన ఈ మూవీ ఇప్పుడు ఎక్కువ కేటగిరీల్లో పోటీ పడుతున్న మూవీగా కూడా రికార్డ్ సృష్టిస్తోంది. ఇక ఈ మధ్య కాలంలో అందరినీ ఏడిపించి...శభాష్ అనిపించుకున్న 12త్ ఫెయిల్ కూడా బెస్ట్ ఫిల్మ్‌ఫేర్ కోసం పోటీపడుతోంది. అయితే యానిమల్ సినిమాలో తన సూపర్ నటనతో అందరినీ ఆకట్టుకున్ రష్మిక మందన్నా పేరు మాత్రం నామినేట్ కాలేదు. తెలుగు మీరోయిన్ అవ్వడం వల్లనే రష్మికా పేరును నామినేట్ చెయ్యలేదా అన్న ప్రశ్న వినిపిస్తోంది.

బెస్ట్ ఫిల్మ్ (పాపులర్)
12త్ ఫెయిల్
జవాన్
ఓఎమ్‌జీ2
పఠాన్
రాకీ ఔర్ రాణీకి ప్రేమ్ కహానీ

బెస్ట్ ఫిల్మ్ (క్రిటిక్స్)
12th ఫెయిల్
భీడ్
ఫరాజ్
జొరం
సామ్ బహదూర్
థ్రీ ఆఫ్ అజ్
జ్విగాటో

బెస్ట్ డైరెక్టర్
అమీర్ రాయ్ (ఓఎమ్‌జీ 2)
అట్లీ (జవాన్)
కరణ్ జోహార్ (రాకీ ఔర్ రాణీ కి ప్రేమ్ కహానీ)
సందీప్ రెడ్డి వంగా (యానిమల్)
సిద్ధార్థ్ ఆనంద్ (పఠాన్)
విధు వినోద్ చోప్రా (12త్ ఫెయిల్)

బెస్ట్ యాక్టర్ (మేల్)
రణబీర్ కపూర్ (యానిమల్)
రణవీర్ సింగ్ (రాకీ ఔర్ రాణీ కి ప్రేమ్ కహానీ)
షారుఖ్ ఖాన్ (డంకీ)
షారుఖ్ ఖాన్ (జవాన్)
సన్నీ డియోల్ (గదర్ 2)

బెస్ట్ యాక్టర్ (క్రిటిక్స్)
అభిషేక్ బచ్చన్ (ఘూమర్)
జైదీప్ అహ్లావత్ (థ్రీ ఆఫ్ అజ్)
మనోజ్ బాజ్‌పాయ్ (జొరం)
పంకజ్ త్రిపాఠి (ఓఎమ్‌జీ 2)
రాజ్‌కుమార్ రావు (భీడ్)
విక్కీ కౌశల్ (సామ్ బహదూర్)
విక్రాంత్ మాస్సే (12త్ ఫెయిల్)

బెస్ట్ యాక్టర్ (ఫీమేల్)
ఆలియా భట్ (రాకీ ఔర్ రాణీ కి ప్రేమ్ కహానీ)
భూమి పెడ్నేకర్ (థాంక్యూ ఫర్ కమింగ్)
దీపికా పదుకొనె (పఠాన్)
కియారా అద్వానీ (సత్యప్రేమ్ కీ కథ)
రాణీ ముఖర్జీ (మిసెస్ ఛాటర్జీ వర్సెస్ నార్వే)
తాప్సీ పన్ను (డంకీ)

బెస్ట్ యాక్ట్రెస్ (క్రిటిక్స్)
దీప్తి నావల్ (గోల్డ్‌ఫిష్)
ఫాతిమా సనా షేక్ (ధక్ ధక్)
రాణీ ముఖర్జీ (మిసెస్ ఛాటర్జీ వర్సెస్ నార్వే)
సయ్యమీ ఖేర్ (ఘూమర్)
షహానా గోస్వామి (జ్విగాటో)
షెఫాలీ షా (థ్రీ ఆఫ్ అజ్)

బెస్ట్ యాక్టర్ (సపోర్టింగ్ రోల్ - మేల్)
ఆదిత్య రావల్ (ఫరాజ్)
అనిల్ కపూర్ (యానిమల్)
బాబీ డియోల్ (యానిమల్)
ఇమ్రాన్ హష్మీ (టైగర్ 3)
తోతా రాయ్ చౌదరీ (రాకీ ఔర్ రాణీ కి ప్రేమ్ కహానీ)
విక్కీ కౌశల్ (డంకీ)

బెస్ట్ యాక్ట్రెస్ (సపోర్టింగ్ రోల్)
జయా బచ్చన్ (రాకీ ఔర్ రాణీ కి ప్రేమ్ కహానీ)
రత్నా పఠాక్ షా (ధక్ ధక్)
షబానా అజ్మీ (ఘూమర్)
షబానా అజ్మీ (రాకీ ఔర్ రాణీ కి ప్రేమ్ కహానీ)
తృప్తి దిమ్రీ (యానిమల్)
యామీ గౌతమ్ (ఓఎమ్‌జీ 2)

బెస్ట్ మ్యూజిక్ ఆల్బమ్
యానిమల్ (ప్రీతమ్, విశాల్ మిశ్రా, మనన్ భరద్వాజ్, శ్రేయాస్ పురానిక్, జానీ, భూపందర్ బాబ్బల్, ఆషీమ్ కెమ్సన్, హర్ష్‌వర్ధన్ రామేశ్వర్, గురిందర్ సేగల్)
డంకీ (ప్రీతమ్)
జవాన్ (అనిరుధ్ రవిచందర్)
పఠాన్ (విశాల్, శేఖర్)
రాకీ ఔర్ రాణీ కి ప్రేమ్ కహానీ (ప్రీతమ్)
తూ ఝూఠీ మే మక్కార్ (ప్రీతమ్)
జరా హట్కే జరా బచ్కే (సచిన్, జిగర్)

బెస్ట్ ప్లేబ్యాక్ సింగర్ (మేల్)
అర్జిత్ సింగ్ (లుట్ పుట్ గయా - డంకీ)
అర్జిత్ సింగ్ (సత్రాంగా - యానిమల్)
భూపిందర్ బబ్బాల్ (అర్జన్ వాలీ - యానిమల్)
షాహిద్ మాల్యా (కుద్మయీ - రాకీ ఔర్ రాణీ కి ప్రేమ్ కహానీ)
సోనూ నిగమ్ (నిక్లె థే కబీ హమ్ ఘర్ సే - డంకీ)
వరుణ్ జైన్, సచిన్ - జిగర్, షాదాబ్ ఫరీది, అల్తామాష్ ఫరీది (తేరే వాస్తే ఫలక్ - జరా హట్కే జరా బచ్కే)

బెస్ట్ ప్లేబ్యాక్ సింగర్ (ఫీమేల్)
దీప్తి సురేశ్ (ఆరారీ రారో - జవాన్)
జోనితా గాంధీ (హే ఫికర్ - 8 ఏఎమ్ మెట్రో)
శిల్పా రావు (బేషరమ్ రంగ్ - పఠాన్)
శిల్పా రావు (చలేయా - జవాన్)
శ్రేయా ఘోషల్ (తుమ్ క్యా మిలే - రాకీ ఔర్ రాణీ కి ప్రేమ్ కహానీ)
శ్రేయా ఘోషల్ (వే కమ్లేయా - రాకీ ఔర్ రాణీ కి ప్రేమ్ కహానీ)

Advertisment
Advertisment
తాజా కథనాలు