Children Tips: పిల్లలకు ఉప్పు-పంచదారతో అన్నం పెడుతున్నారా? శిశువుకు 6 నెలల వరకు మాత్రమే తల్లి పాల నుంచి పూర్తి పోషకాహారం లభిస్తుంది. 6 నెలల తర్వాత, బిడ్డకు కొద్దికొద్దిగా ఘనమైన ఆహారాన్ని అందించాలని నిపుణులు చెబుతున్నారు. రుచి కోసం శిశువుకు ఉప్పు లేదా చక్కెరతో ఆహారం ఇస్తే కిడ్నీలపై భారం పడుతుంది. By Vijaya Nimma 30 Jan 2024 in Latest News In Telugu లైఫ్ స్టైల్ New Update షేర్ చేయండి Children Tips: శిశువుకు 6 నెలల వరకు మాత్రమే తల్లి పాల నుంచి పూర్తి పోషకాహారం లభిస్తుంది. 6 నెలల తర్వాత, బిడ్డకు కొద్దికొద్దిగా ఘనమైన ఆహారాన్ని అందించాలి. కానీ చాలా సందర్భాల్లో మనం శిశువుకు ఉప్పు లేదా చక్కెర కలిపి ఆహారం అందిస్తుంటాం. ఇది రుచిగా ఉంటుంది కాబట్టి పిల్లలు కూడా తింటారు. కానీ శిశువుకు ఉప్పు లేదా చక్కెరతో ఆహారం ఇవ్వడం ప్రమాదకరమని వైద్యులు అంటున్నారు. ఒక సంవత్సరం లోపు పిల్లలకు ఉప్పు, పంచదార ఇవ్వకూడదు. ఎందుకంటే ఇవి శిశువు మూత్రపిండాలు, జీర్ణవ్యవస్థ, గుండెపై తీవ్రమైన ప్రభావాలను చూపుతాయని హెచ్చరిస్తున్నారు. పోషకాలు ఉన్న ఆహారం పెట్టాలి: పిల్లలు 6 నెలల వరకు తల్లి పాలు మాత్రమే తాగాలి. తర్వాత ఉడికించిన పండ్లు, కూరగాయలు తినిపించవచ్చు. ఇంట్లో తయారు చేసిన మిల్లెట్ స్లర్రీ వంటి ఆహారాన్ని కూడా ఇవ్వవచ్చు. గంజి, కిచ్డీ, ఓట్స్ వంటి రుచికరమైన, పోషకాలు ఉన్న ఆహారం ఇవ్వాలి. అది కూడా ఉప్పు లేదా చక్కెర లేకుండా ఇస్తే బెటర్. ఒక సంవత్సరం తర్వాత ఉప్పును క్రమంగా శిశువు ఆహారంలో చేర్చవచ్చు. కానీ ఉప్పు తక్కువగా అలవాటు చేస్తేనే మంచిదని నిపుణులు అంటున్నారు. ఒక సంవత్సరం వరకు పిల్లల మూత్రపిండాలు చాలా చిన్నగా, బలహీనంగా ఉంటాయి. ఈ టైమ్‌లో వారికి ఉప్పు ఇస్తే కిడ్నీలపై భారం పడుతుంది. కిడ్నీలపై ఉప్పు ఎక్కువ ఒత్తిడిని కలిగిస్తుంది. చక్కెర తింటే రక్తనాళాల పనితీరు తగ్గుతుంది: పిల్లలు పెద్ద మొత్తంలో చక్కెరను తీసుకుంటే వారి శరీరం ప్రోటీన్‌ను సరిగ్గా జీర్ణం చేసుకోలేదు. మన శరీరానికి ప్రోటీన్ చాలా ముఖ్యం. ఇది మన ఎముకలు, కండరాలు, చర్మాన్ని బలంగా ఉంచుతుంది. ప్రోటీన్లు సరిగా జీర్ణం కానప్పుడు ఎముకలు, కండరాలు బలహీనపడతాయి. ఎక్కువ చక్కెర తినడం వల్ల చర్మం, రక్తనాళాల పనితీరు తగ్గుతుంది. అంతేకాకుండా పిల్లల దంతాలు పాడవుతాయి. కళ్లు బలహీనంగా మారవచ్చు. కాబట్టి పిల్లలకు పంచదార ఇవ్వకూడదు. చెరుకు రసం లేదా తేనె ఇవ్వాలని వైద్యులు అంటున్నారు. ఇది కూడా చదవండి: నైట్ మేకప్ వల్ల ముఖంపై నల్లటి మచ్చలు వస్తాయా? గమనిక: ఈ కథనం ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇచ్చినది. RTV దీనిని ధృవీకరించడంలేదు. ఆరోగ్య సమస్యల నివారణకు సంబంధిత వైద్య నిపుణుడిని సంప్రదించడం ఉత్తమం. #children #health-benefits మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి