Kerala: కూతురిపై తండ్రి అత్యాచారం కేసు.. కోర్టు సంచలన తీర్పు!

కన్న తండ్రి కూతురిపై లైంగిక దాడి చేసిన కేసులో కేరళ ఫాస్ట్ ట్రాక్ కోర్టు సంచలన తీర్పు ఇచ్చింది. నిందితుడికి 104 ఏళ్ల కఠిన కారాగార శిక్షతో పాటు లక్ష జరిమానా విధించింది. జరిమానా మొత్తాన్ని బాధితురాలికి అందివ్వాలని ఆదేశించింది.

New Update
Kerala: కూతురిపై తండ్రి అత్యాచారం కేసు.. కోర్టు సంచలన తీర్పు!

Rape case: కేరళలో ఇటీవల కన్న కూతురిపైనే తండ్రి లైంగిక దాడికి పాల్పడిన కేసులో కేరళ ఫాస్ట్ ట్రాక్ కోర్టు సంచలన తీర్పు ఇచ్చింది. 17 ఏళ్ల కూతురిని బలవంతంగా లొంగదీసుకుని దారుణానికి పాల్పడినందుకు నిందితుడికి 104 ఏళ్ల కఠిన కారాగార శిక్షతో పాటు లక్ష జరిమానా విధించింది. నిందితుడు చెల్లించే జరిమానా మొత్తాన్ని బాధితురాలికి ఇవ్వాలని ఆదేశించింది. నిందితుడిని తవనూరు సెంట్రల్ జైలుకు తరలించారు.

ఈ కేసు వివరాల్లోకి వెళితే.. కేరళలోని అరికోడ్ కి చెందిన ఓ వ్యక్తికి భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. 2006లో జన్మించిన తన కుమార్తెకు పదేళ్లు వచ్చినప్పటినుంచి తండ్రి నిత్యం లైంగిక వేధింపులకు పాల్పడుతున్నాడు. ఈ విషయం బయటకి చెప్తే చంపేస్తానని బెదిరించేవాడు. దీంతో ఆ బాలిక దారుణాన్ని బయటకు చెప్పలేదు. బాధితురాలు అనారోగ్యానికి గురి కావడంతో తండ్రి ఆసుపత్రి తీసుకెళ్లాడు. బాలికను పరీక్షించిన వైద్యులు కోజీకొడ్ లోని మెడికల్ కాలేజీకి రిఫర్ చేశారు. వైద్యుల సలహా మేరకు మెడికల్ కాలేజీలో ఆ బాలికకు అబార్షన్ చేశారు. ఆ తర్వాత ధైర్యం చేసిన బాలిక తండ్రి చేస్తున్న అకృత్యాలపై పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో నిందితుడిని అదుపులోకి తీసుకొన్న పోలీసులు కోర్టులో ప్రవేశపెట్టారు. అంతేగాక నిందుతుడికి బెయిల్ ఇస్తే బాలికకు ప్రమాదం తలపెట్టే అవకావం ఉందని కోరడంతో కోర్టు నిందుడికి బెయిల్ ఇవ్వలేదు.

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

Accident: దారుణం.. ఆర్టీసీ బస్సు కింద పడి వ్యక్తి మృతి

హైదరాబాద్‌లోని బాలానగర్‌లో ఆర్టీసీ బస్సు కింద పడి బైక్‌ వాహనాదారుడు మృతి చెందాడు.ట్రాఫిక్ పోలీసులు తనిఖీల్లో భాగంగా బైక్‌ను ఆపేందుకు యత్నించారు. బైక్ అదుపు తప్పడంతో అతడు కిందపడ్డాడు. దీంతో ఆర్టీసీ బస్సు అతని తలపై నుంచి వెళ్లింది.

New Update
Accident

Accident

హైదరాబాద్‌లో విషాదం చోటుచేసుకుంది. బాలానగర్‌లో ఆర్టీసీ బస్సు కింద పడి బైక్‌ వాహనాదారుడు మృతి చెందాడు. ఇక వివరాల్లోకి వెళ్తే.. ట్రాఫిక్ పోలీసులు తనిఖీల్లో భాగంగా బైక్‌ను ఆపేందుకు యత్నించారు. అయితే బైక్ అదుపు తప్పింది. దీంతో వాహనాదారుడు కిందపడ్డాడు. ఇదే సమయంలో వచ్చిన ఒక్కసారిగా వచ్చిన ఆర్టీసీ బస్సు అతడి తలపై నుంచి వెళ్లింది. 

Also Read: ఈ ఆడోళ్లు మహా డేంజర్.. జుట్టు పట్టుకుని ఎలా కొడుతుందో చూశారా?

దీంతో ఆ బైక్ వాహనాదారుడు అక్కడికక్కడే మృతి చెందాడు. ట్రాఫిక్ పోలీసుల నిర్లక్ష్యం వల్లే ఆ వ్యక్తి మృతి చెందాడని వాహనాదారులు ఆందోళనకు దిగారు. దీంతో జీడిమెట్ల నుంచి బాలానగర్‌ మార్గంలో భారీగా ట్రాఫిక్‌ జామ్ అయ్యింది. పెద్దఎత్తున వాహనాలు నిలిచిపోయాయి. రోడ్డుపై పలువురు వాగ్వాదానికి దిగారు. చివరికి పోలీసులు వాళ్లని చెదరగొట్టారు. ఆ తర్వాత ట్రాఫిక్‌ను క్లియర్‌ చేశారు.  

Also Read: అర్థరాత్రి ఆలయం తెరవాలంటూ.. పూజారి పై దాడి!

Advertisment
Advertisment
Advertisment