Telangana: పెళ్ళి చేయలేనన్న భయంతో కూతురిని చంపేసిన తండ్రి మెదక్ జిల్లాతో ఘోరం చోటు చేసుకుంది. తన కూతురికి ఎక్కడ పెళ్ళి చేయాల్సి వస్తుందోనన్న భయంతో కన్న తండ్రే ఆమెను చంపేశాడు. కూల్ డ్రింక్‌లో పురుగుల మందు కలిపి హత్య చేశాడు. మే31న జరిగిన ఈ సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. By Manogna alamuru 16 Aug 2024 in క్రైం తెలంగాణ New Update షేర్ చేయండి Medak: ఈరోజుల్లో మనుషుల మధ్య రిలేషన్స్ తగ్గిపోతున్నాయి. స్వంత వాళ్ళను కూడా బాధపెడుతున్నారు, చంపేస్తున్నారు. దాంతో పాటూ పెరుగుతున్న ధరలు..విపరీతమైన ఖర్చులతో పిల్లలను పోషించడం భారంగా మారుతోంది. దానికి తోడు ఆడపిల్లలను పెంచడం అంటే తల్లిదండ్రుల్లో భయం ఉంది. వాళ్ళను పెద్దచేసి పెళ్ళి చేయాలనే ఆలోచనలతో తల్లిదండ్రులు బెంబేలెత్తిపోతారు. తెలంగాణలోని మెదక్ జిల్లాలో కూడా ఓతండ్రి ఇలానే ఆలోచించాడు. తన కూతురిని పెద్దదాన్ని చేసి పెళ్ళి చేయలేనేమో అన్న భయంతో ఏకంగా ఆమె ప్రాణాలనే తీశాడు. కూల్ డ్రింక్‌లో పురుగుల మందు కలిపి ఇచ్చి తాగిపించాడు. మెదక్ జిల్లా వెల్దుర్తి సమీపంలోని శేరీలలో శ్రీశైలం, సౌందర్య దంపతులకు ఇద్దరు పిల్లలున్నారు. వీరు చాల రోజుల నుంచీ డబ్బులు లేక ఇబ్బందులు పడుతున్నారు. ఈ విషయంలో భార్యాభర్తలు ఇద్దరూ తరుచూ గొడవలు పడుతూ ఉండేవారు కూడా. ఇలా అయితే బిడ్డలను పెంచేది ఎలా..? వాళ్లను ప్రయోజకులను చేసేది ఎలా అంటూ భార్య భర్తను కోప్పడేది. ఈ క్రమంలో కుమార్తె నిఖితకు తొమ్మిదేళ్ళు వచ్చాయి. దీంతో శ్రీశైలానికి కంగారు పట్టుకుంది బిడ్డకు తిండే సరిగ్గా పెట్టలేకపోతున్నాను. ఇక పెళ్ళి ఎలా చేయాలనే ఆందోళన మొదలైంది. ఈ ఆలోచనలో కూతురు చావుకు దారి తీశాయి. తాను ఎప్పటికీ ఆమెకు పెళ్ళి చేయలేనని నిర్ధారణకు వచ్చిన శ్రీశైలం విచక్షణ మరిచి పోయి కూతురిని చంపేశాడు. ఆ తర్వాత కూతురికి కూల్ డ్రింక్‌లో పురుగుల మందు కలిపి ఇచ్చి తాగిపించాడు. మే 31న జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. తీవ్ర అస్వస్థతకు గురైన చిన్నారి నిఖితను కుటుంబ సభ్యులు హైదరాబాద్‌లోని నీలోఫర్ ఆస్పత్రికి తరలించి చికిత్స అందించారు. నాలుగు రోజుల పాటు మృత్యువుతో పోరాడిన నిఖిత..జూన్ 3న చనిపోయింది. దీంతో తల్లి సౌందర్య భర్త మీద పోలీసులకు ఫిర్యాదు చేసింది. శ్రీశైలాన్ని పోలీసులు అరెస్ట్ చేశారు. కోర్టు అతడికి రిమాండ్ విధించింది. Also Read: Harish Rao: రేవంత్ రెడ్డి పచ్చి మోసగాడు..అబద్ధాలా కోరు-హరీష్ రావు #murder #telangana #father #medak #girl-child మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి