Road Accident : ఏపీలో ఘోర రోడ్డు ప్రమాదం.. రెండు బైకులు ఢీకొని!

ఏపీలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. విజయనగరం జిల్లా రామభద్రాపురం కొటక్కి వద్ద రెండు బైకులు ఢీ కొనడంతో అక్కడికక్కడే ముగ్గురు దుర్మరణం చెందారు. మరో ఇద్దరికి గాయాలయ్యాయి. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

New Update
Road Accident : ఏపీలో ఘోర రోడ్డు ప్రమాదం.. రెండు బైకులు ఢీకొని!

AP : ఏపీలో గురువారం సాయంత్రం ఘోర రోడ్డు ప్రమాదం(Road Accident)  జరిగింది. విజయనగరం(Vijayanagaram) జిల్లా రామభద్రాపురం కొటక్కి వద్ద రెండు బైకులు ఢీ కొనడంతో అక్కడికక్కడే ముగ్గురు దుర్మరణం చెందారు. మరో ఇద్దరికి గాయాలయ్యాయి. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలాన్ని పరిశీలించి సహాయక చర్యలు చేపట్టారు. మృతదేహాలను పోస్టుమార్టంకు, గాయపడ్డవారిని తరలించారు.

ఇది కూడా చదవండి: Pub Accident : పబ్‌లో విషాదం.. ముగ్గురు దుర్మరణం

అతివేగమే కారణం..
అయితే ఈ ప్రమాదానికి అతివేగమే(Over Speed) కారణమని పోలీసులు తెలిపారు. మృతుల కుటుంబాలకు సమాచారం అందించినట్లు తెలిపారు. ఇక వాహనదారులు డ్రైవింగ్(Driving) విషయంలో అప్రమత్తంగా ఉండాలని సూచించారు. అతివేగంగా వాహనాలు నడపొద్దని హెచ్చరించారు. కుటుంబ సభ్యులను దృష్టిలో ఉంచుకుని వాహనాలు నడపాలని కోరారు. రూల్స్ అతిక్రమిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని వార్నింగ్ ఇచ్చారు.

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

ఏపీ, తెలంగాణలో భారీ వర్ష సూచన.. ఆ జిల్లాల్లో పిడుగుల వర్షం

బంగాళాఖాతంలోని అల్పపీడనం ప్రభావం వల్ల ఏపీ, తెలంగాణలో మోస్తారు నుంచి భారీ వర్షాలు కురవనున్నట్లు వాతావరణ శాఖ తెలిపింది. 10, 11.12,13 తేదీల్లో కొన్ని చోట్ల పిడుగులతో కూడిన వర్షాలు కురుస్తాయి. ప్రజలు అందరూ కూడా అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ సూచించింది.

New Update
Rains

Rains

బంగాళాఖాతంలోని అల్పపీడనం ప్రభావం వల్ల ఏపీ, తెలంగాణలో భారీ వర్షాలు కురవనున్నట్లు వాతావరణ శాఖ తెలిపింది. గురు, శుక్రవారాల్లో ఉత్తరాంధ్ర జిల్లాల్లో పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురుస్తాయి. అయితే కొన్ని చోట్ల అకస్మాత్తుగా పిడుగులతో కూడిన వర్షం కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది. ఆగ్నేయ బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడింది. ఇది వాయువ్య దిశగా నైరుతి బంగాళాఖాతం వైపు వెళ్లడం వల్ల 10, 11.12,13 తేదీల్లో కొన్ని చోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. 

ఇది కూడా చూడండి: Today Gold Rate: కిక్కిచ్చిన బంగారం ధరలు.. ఇవాళ భారీగా తగ్గాయ్.. తులం ఎంతంటే?

ఈ జిల్లాల్లో మోస్తారు నుంచి భారీ వర్షాలు..

తెలంగాణలో జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, సూర్యపేట, మహబూబాబాద్, వరంగల్, హనుమకొండ జిల్లాలలో అక్కడక్కడ మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ఇక ఏపీ విషయానికొస్తే.. కొన్ని జిల్లాల్లో మోస్తారు వర్షాలు కురవనున్నాయి. 

ఇది కూడా చూడండి: Ap Aqua -Trump Effect: ఏపీ రైతులపై ట్రంప్ టారిఫ్ ఎఫెక్ట్.. చంద్రబాబు కీలక నిర్ణయాలు

 

ఇది కూడా చూడండి: Telangana: తెగ తాగేసిన మందు బాబులు..గతేడాది కంటే తెలంగాణలో భారీగా పెరిగిన మద్యం అమ్మకాలు!

Advertisment
Advertisment
Advertisment