Parvathipuram: ఆ ప్రాంతంలో వింత ఆచారం.. నాలుకతో నైవేద్యం సేకరిస్తే అలా జరుగుతుందట!!

శ్రీకాకుళం లోని పార్వతీపురం మన్యం జిల్లా సాలూరు మండలం కూర్మరాజుపేట గ్రామానికి చెందిన రైతులు.. వర్షాలు పడాలని వినూత్నంగా ప్రత్యేకమైన పూజలతో పాటు, ఆచార వ్యవహారాలు పాటిస్తారు. గ్రామ సమీపంలోని నాలుగు కిలో మీటర్ల దూరంలోని కొండపై ఉన్న అమ్మవారి ఆలయానికి డప్పు వాయిద్యాలతో వెళ్తారు. అక్కడ అమ్మవారికి కోడి లేదా మేకను బలి ఇస్తారు. ఆ తర్వాత తమ వెంట తెచ్చుకున్న సరుకులతో అక్కడే 'వరద పాయసం' తయారు చేసుకుంటారు. దాన్ని అక్కడ కొండపైనే నేలపై వేసుకుని.. నాలుకతో ఆ వరద పాయసాన్ని స్వీకరిస్తారు రైతులు. ఇలా చేస్తే వర్షాలు బాగా కురిసి.. పంటల బాగా పండుతాయని వారి నమ్మిక.

New Update
Parvathipuram: ఆ ప్రాంతంలో వింత ఆచారం.. నాలుకతో నైవేద్యం సేకరిస్తే అలా జరుగుతుందట!!

సాధారణంగా గ్రామీణ ప్రాంతాల్లోని మూఢనమ్మకాలను ప్రజలు ఎక్కువగా నమ్ముతూంటారు. అవే పాటిస్తారు కూడా. ముఖ్యంగా వర్షాల కోసం ఒక్కో గ్రామంలో ఒక్కో ఆచారం పాటిస్తారు. ప్రత్యేమైన పూజలు కూడా చేస్తూంటారు. కొంతమంది జంతువులను బలి ఇస్తారు.. మరికొంత మంది నీళ్లతో అభిషేకిస్తారు. ఇలా రకరకాల ఆచార వ్యవహారాలను చేస్తూంటారు.

అలాగే వర్షం కురవాలని కప్పలకు పెళ్లిళ్లు చేయడం, ఊరంతా ఊరేగించడం వంటివి మనం తరచుగా వింటుంటాం. వర్షాలు కురవాలని కప్పలకు పెళ్లి చేసే ఆచారం ఇప్పటికీ గ్రామాల్లో కొనసాగుతోంది. వర్షం కోసం దేవాలయాల్లో పూజలు, హోమాలు చేయడం మనం చూస్తుంటాం. అయితే ఈ గ్రామంలో మాత్రం రైతులు వినూత్న రీతిలో వర్షాల కోసం పూజలు చేస్తూంటారు.

శ్రీకాకుళం లోని పార్వతీపురం మన్యం జిల్లా సాలూరు మండలం కూర్మరాజుపేట గ్రామానికి చెందిన రైతులు.. వర్షాలు పడాలని వినూత్నంగా ప్రత్యేకమైన పూజలతో పాటు, ఆచార వ్యవహారాలు పాటిస్తారు. గ్రామ సమీపంలోని నాలుగు కిలో మీటర్ల దూరంలోని కొండపై ఉన్న అమ్మవారి ఆలయానికి డప్పు వాయిద్యాలతో వెళ్తారు. అక్కడ అమ్మవారికి కోడి లేదా మేకను బలి ఇస్తారు. ఆ తర్వాత తమ వెంట తెచ్చుకున్న సరుకులతో అక్కడే 'వరద పాయసం' తయారు చేసుకుంటారు. దాన్ని అక్కడ కొండపైనే నేలపై వేసుకుని.. నాలుకతో ఆ వరద పాయసాన్ని స్వీకరిస్తారు రైతులు.

ఇలా చేస్తే వర్షాలు బాగా కురిసి.. పంటల బాగా పండుతాయని వారి నమ్మిక. పూజలు నిర్వహించి ఒకటి, రెండు రోజుల్లోనే వర్షాలు కురుస్తాయని రైతులు నమ్ముతారు. వర్షాల కోసం ప్రతి ఏటా ఇలా చేస్తారట. గత 20 రోజుల నుంచి గ్రామంలోని ప్రజలు తమ పొలాల్లో వరి నాట్లు వేశారు. అయితే ఇది చూడటానికి ఇతర గ్రామాల ప్రజలు కూడా భారీగా కూర్మరాజు పేట గ్రామానికి చేరుకుంటారు. కాగా ప్రతి సంవత్సరం ఈ నెలలో వర్షాభావ పరిస్థితులు ఏర్పడతాయి. అందుకే ప్రతి సంవత్సరం ఈ మాసంలో విచిత్రమైన పూజలు జరుగుతాయి. ప్రస్తుతం ఈ వింత ఆచారం స్థానిక గ్రామాల్లో చర్చనీయాంశంగా మారింది.

Advertisment
Advertisment
తాజా కథనాలు