Farmer Protest: మరోసారి రోడ్డెక్కనున్న రైతు సంఘాలు.. చలో ఢిల్లీ తో పోలీసులు అలర్ట్‌.. ట్రాఫిక్‌ మళ్లింపు!

రైతులు ఢిల్లీకి చేరుకోవాలని రైతు సంఘాలు పిలుపునిచ్చాయి. ఈ నేపథ్యంలో నగరంలోని ముఖ్యమైన మార్గాల్లో బారికేడ్లు, బండరాళ్లును అధికారులు ఏర్పాటు చేశారు. ప్రజలు ట్రాఫిక్ కష్టాలను ఎదుర్కోవాల్సిన అవసరం లేదని పోలీసులు తెలిపారు.ముందుగానే ఏఏ మార్గాల్లో ప్రయాణించకూడదో అధికారులు తెలియజేశారు.

New Update
Delhi:రైతుల ధర్నా...మార్చి 12 వరకు ఢిల్లీలో 144 సెక్షన్

Delhi: ఢిల్లీ(Delhi) లో మరోసారి నిరసనకు రైతు సంఘాలు(Farmers)  సిద్ధమవుతున్నాయి. చలో ఢిల్లీ (Chalo Delhi)నినాదంతో రైతులు ఢిల్లీకి చేరుకోవాలని రైతు సంఘాలు పిలుపునిచ్చాయి. ఈ నేపథ్యంలో నగరంలోని ముఖ్యమైన మార్గాల్లో బారికేడ్లు, బండరాళ్లును అధికారులు ఏర్పాటు చేశారు. మరోవైపు ఢిల్లీ పోలీస్ కమిషనర్ సంజయ్ అరోరా ఘాజీపూర్ సరిహద్దుకు చేరుకుని భద్రతా ఏర్పాట్లను పరిశీలించారు. ఫిబ్రవరి 13న ఢిల్లీలో ర్యాలీకి రైతు సంఘాలు పిలుపునిచ్చాయని తెలియజేశారు. దీనికి ముందు, ఢిల్లీ ట్రాఫిక్ పోలీసులు ఫిబ్రవరి 11వ తేదీన ట్రాఫిక్ అడ్వయిజరీ జారీ చేశారు.

వాహనాల దారి మళ్లింపు..

నగరం అంతటా ప్రజలు ఎటువంటి సమస్యలను ఎదుర్కోకుండా, ట్రాఫిక్ కష్టాలను ఎదుర్కోవాల్సిన అవసరం లేదని పోలీసులు తెలిపారు. ముందుగానే ఏఏ మార్గాల్లో ప్రయాణించకూడదో ప్రయాణికులకు అధికారులు తెలియజేశారు. సోమవారం (ఫిబ్రవరి 12) నుంచే వాణిజ్య వాహనాల రాకపోకలను సరిహద్దుల్లో పూర్తిగా నిషేంధించనున్నారు.

మంగళవారం సింగు సరిహద్దును పూర్తిగా మూసివేస్తున్నట్లు అధికారులు వివరించారు. సింగు సరిహద్దు నుంచి ఎటువంటి వాహనాల రాకపోకలు ఉండవని అధికారులు వివరించారు. దీంతో ఢిల్లీ నుండి నోయిడా, ఘజియాబాద్‌కు వెళ్లే వారు కొన్ని సమస్యలు ఎదుర్కొవలసి వస్తుందని పోలీసులు తెలిపారు.

వాస్తవానికి, లోని బోర్డర్, ఘాజీపూర్ బోర్డర్, చిల్లా బోర్డర్, కలిదిన్ కుంజ్-డీఎన్‌డీ-నోయిడా బోర్డర్ వద్ద గట్టి భద్రతా ఏర్పాట్లు చేశారు. దీని వల్ల ప్రజలు కొన్ని ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. అలాగే, హర్యానా, పంజాబ్ నుండి ఇంటర్‌స్టేట్ బస్సుల ద్వారా వచ్చే ప్రజలు కూడా సమస్యలను ఎదుర్కొంటారు, ఎందుకంటే సింగు సరిహద్దును అధికారులు మూసివేశారు.

ఢిల్లీలో మళ్లింపు ఎక్కడ 
ఢిల్లీ ట్రాఫిక్ పోలీసుల సలహా ప్రకారం, ఢిల్లీ నుండి సోనిపట్‌, జాతీయ రహదారి 44 మీదుగా ప్రయాణాన్ని పూర్తి చేయడానికి, అంతర్రాష్ట్ర బస్సులు కాశ్మీర్ గేట్ బస్టాండ్ నుండి మజ్ను కా తిలా, సిగ్నేచర్ బ్రిడ్జ్, ఖజురీ చౌక్, లోని బోర్డర్ మీదుగా వెళ్లాలి. . అదే సమయంలో, భారీ వాణిజ్య వాహనాలు బవానా రోడ్ క్రాసింగ్ మీదుగా DSIIDC కట్ మీదుగా వెళ్లి, ఆచండీ బోర్డర్ నుండి సయీద్‌పూర్ చౌకీ మీదుగా KMP మీదుగా బవానా చౌక్ మీదుగా వెళ్లాలి.

రోహ్ తక్ వైపు వెళ్లే భారీ వాహనాలు ఔటర్ రింగ్ రోడ్డులోని ముకర్బా చౌక్ మీదుగా రిథాలా, యూఈఆర్ 2, కంఝవాలా, జౌంటీ సరిహద్దుల మీదుగా హర్యానాలోకి ప్రవేశించాలని అధికారులు ముందగానే సూచించారు.

Also read: పార్టీని స్థాపించిన వారి చేతిలో నుంచి లాగేసుకున్నారు..ఇలాంటి అన్యాయం ఎప్పుడూ చూడలేదు!

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

Zelensky: చెప్పుకోవడానికే కాల్పుల విరమణ..దాడులు మాత్రం ఆగడం లేదు!

ఈస్టర్ సందర్భంగా తాత్కాలిక కాల్పుల విరమరణ పాటిస్తామని ప్రకటించిన రష్యా ఆ మాటకు కట్టుబడి లేదని ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌ స్కీ ఆరోపించారు.ఈస్టర్‌ కాల్పుల విరమణను గౌరవిస్తున్నట్లు తప్పుడు వైఖరిని ఆ దేశం ప్రదర్శిస్తోందన్నారు.

New Update
Volodymyr Zelenskyy

Volodymyr Zelenskyy

ఈస్టర్ సందర్భంగా తాత్కాలిక కాల్పుల విరమరణ పాటిస్తామని ప్రకటించిన రష్యా ఆ మాటకు కట్టుబడి లేదని ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌ స్కీ ఆరోపించారు.ఈస్టర్‌ కాల్పుల విరమణను గౌరవిస్తున్నట్లు తప్పుడు వైఖరిని ఆ దేశం ప్రదర్శిస్తోందన్నారు. ఎప్పటి లాగే తమ పై దాడులు కొనసాగించిందని..పదుల కొద్ది డ్రోన్‌,బాంబు దాడుల ఘటనలు నమోదయ్యాయని తెలిపారు.

Also Read:Drunk Woman: ఎవరికైనా చూపించండ్రా బాబు.. ఫుల్‌గా తాగి నడిరోడ్డుపై యువతి రచ్చ రంబోలా (వీడియో చూశారా)

మరో వైపు ..కీవ్‌ బలగాలూ దాడులు కొనసాగిస్తున్నట్లు రష్యా ఆక్రమిత ఉక్రెయిన్‌ లోని అధికారులు ఆరోపించారు.''తాత్కాలిక కాల్పుల విరమణను గౌరవిస్తున్నటు రష్యా సైన్యం చెబుతోంది.కానీ ,యుద్ధ క్షేత్రంలో పైచేయి సాధించే, మా దేశానికి నష్టం కలిగించే ఏ అవకాశాన్నీ జారవిడుచుకోవడం లేదు. సుమారు 50కి పైగా బాంబు దాడులు,పదుల కొద్ది డ్రోన్‌ దాడులకు పాల్పడింది.

Also Read: Omar Abdullah: సీఎంకు ఢిల్లీ ఎయిర్‌పోర్ట్ షాక్.. మర్యాదగా మాట్లాడలేనంటూ ఒమర్ అబ్దుల్లా ఫైర్!

ఉదయం10 గంటల నుంచి తీవ్రత మరింత పెరిగింఇ.అయితే  వైమానిక దాడులకు సంబంధించి సైరన్‌ లు మోగకపోవడం కాస్త ఉపశమనం కలిగించే అంశం. క్షేత్రస్థాయి పరిస్థితులు పరిశీలిస్తుంటే..పుతిన్‌ కు తన సైన్యం పై పూర్తి నియంత్రణ లేదని..లేదా,యుద్ధాన్ని ముగించే ఉద్దేశం ఆ దేశానికి లేదనేది స్పష్టమవుతోంది అని జెలెన్‌ స్కీ ట్వీట్లు చేశారు.

కాల్పుల విరమణ షరతులకు పూర్తిగా కట్టుబడి ఉండాలని మాస్కోను డిమాండ్‌ చేశారు. ఆదివారం అర్థరాత్రి నుంచి 30 రోజుల పాటు కాల్పుల విరమణను పొడిగించాలనే ప్రతిపాదనను పునరుద్ఘాటించారు. ఇదిలా ఉండగా..రష్యా,ఉక్రెయిన్‌ ల మధ్య శాంతి ఒప్పందంలో భాగంగా క్రిమియా పై మాస్కో నియంత్రణను గుర్తించేందుకు అమెరికా సిద్ధంగా ఉన్నట్లు కథనాలు వచ్చిన విషయం తెలిసిందే.

ఈ శాంతి ప్రతిపాదన వల్ల రెండు దేశాల మధ్య తక్షణ కాల్పుల విరమణ అమల్లోకి వచ్చే అవకాశాలు కనపడుతున్నాయి. ఇందులో భాగంగా రూపొందించిన ఫ్రేమ్‌ వర్క్‌ ను ఉక్రెయిన్‌, ఐరోపా యంత్రాంగాలు పారిస్‌ లో పరిశీలించాయి. క్రిమియా పై రష్యా నియంత్రణ కొనసాగడానికి అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ అనుకూలంగా ఉన్నట్లు అధికారులు పేర్కొన్నారు. మరోవైపు ..కష్టమైనా చర్చలకు సిద్ధంగా ఉన్నామని రష్యా ప్రకటించింది.

Also Read:Nims fire Accident : చెత్త కుప్పగా వేసి..నిర్లక్ష్యంగా సిగరేట్ తాగి.. నిమ్స్‌లో అగ్నిప్రమాదం వెనుక సంచలన విషయాలు

Also Read:OpenAI: AI టెక్నాలజీలో గేమ్ చేంజర్స్.. బ్రెయిన్‌లా ఆలోచించే OpenAI కొత్త o3, o4-mini మోడల్స్ రిలీజ్!

zelensky | ukraine-zelenskyy | zelensky vs putin | putin vs zelensky | zelenskyy | gaza | latest-news | telugu-news | latest-telugu-news | latest telugu news updates | international-news | international news in telugu | international news telugu | latest-international-news

Advertisment
Advertisment
Advertisment