Cyber Crime: రుణమాఫీ లబ్దిదారులకు బిగ్ అలర్ట్.. ఆ లింక్ క్లిక్ చేశారో గోవిందా! తెలంగాణలో రైతు రుణమాఫీ నేపథ్యంలో సైబర్ నేరగాళ్లు రెచ్చిపోయే అవకాశం ఉందని పోలీసులు హెచ్చరించారు. ఎవరూ APK లింక్స్ ఓపెన్ చేయొద్దని తెలిపారు. అనుమానం వస్తే 1930కు కాల్, లేదా www.cybercrime.gov.in లోనూ ఫిర్యాదు చేయాలని సూచించారు. By srinivas 18 Jul 2024 in క్రైం తెలంగాణ New Update షేర్ చేయండి Telangana: తెలంగాణ రైతు రుణమాఫీ లబ్దిదారులకు పోలీసులు కీలక సూచనలు చేశారు. ఈ మేరకు రేవంత్ సర్కార్ గురువారం సాయంత్రం 11 లక్షల మంది రైతులకు దాదాపు రూ. 6 వేల కోట్ల నిధులు విడుదల చేయనుండగా.. నేరుగా రైతుల ఖాతాల్లోనే ఈ నిధులు జమ కానున్నాయి. ఇందులో భాగంగా సాయంత్రం 4 తర్వాత అర్హులైన రైతుల ఫోన్లకు మాఫీ మెసేజ్‌లు వెళ్లనున్నాయి. ఈ నేపథ్యంలో తెలంగాణ పోలీసులు రైతులకు హెచ్చరికలు జారీ చేశారు. ఏపీకే ఫైల్స్ లింక్ క్లిక్ చేయొద్దు.. రుణమాఫీ నేపథ్యంలో సైబర్ నేరగాళ్లు రెచ్చిపోయే ప్రమాదం ఉందని హెచ్చరించారు. 'సైబర్ నేరగాళ్లు బ్యాంకు పేరిట వాట్సాప్ ప్రొఫైల్ బ్యాంకు పేరు, బ్యాంకు లోగోతో వాట్సాప్‌కు ఏపీకే ఫైల్స్ పంపిస్తున్నారు. ఈ ఫైల్స్ యాక్సెప్ట్ చేస్తే మన వాట్సాప్ సైబర్ నేరగాళ్ల కంట్రోల్‌లోకి వెళ్లిపోతుంది. అలా చేయటం వల్ల మన కాంటాక్స్ట్‌లో ఉన్న ప్రతి ఒక్కరికి మెసేజ్ వెళ్తుంది. దీని ద్వారా సైబర్ నేరస్థులు గూగుల్ పే, ఫోన్ పే, యూపీఐ అకౌంట్లను హ్యాక్ చేసి డబ్బులు దోచేస్తారు. కాబట్టి రైతులు అప్రమత్తంగా ఉండాలి. ఏపీకే ఫైల్స్ ఎట్టి పరిస్థితిలో ఓపెన్ చెయ్యకూడదు. వాట్సాప్ పనిచేయకుంటే వెంటనే రీఇన్‌స్టాల్ చేసి రిపోర్ట్ ఆప్షన్‌లో రిపోర్ట్ చేయాలి. ఎవరికైనా మోస పోయినట్లు అనుమానం వస్తే వెంటనే 1930కు కాల్ చేయండి. లేదా www.cybercrime.gov.in లోనూ ఫిర్యాదు చేయవచ్చు' అని పోలీసులు తెలిపారు. #telangana-police #cyber-crime #farmer-loan-waiver మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి