Warner : విమర్శకులను బ్యాట్‌తో బాదేసిన డేవిడ్‌ భాయ్‌.. ఫేర్‌వెల్‌ సిరీస్‌లో వార్నర్‌ ట్రేడ్‌మార్క్‌ సెలబ్రేషన్‌!

ఫేర్‌వెల్‌ టెస్టు సిరీస్‌ ఆడుతున్న ఆస్ట్రేలియా ఓపెనర్‌ వార్నర్‌ సెంచరీతో కదం తొక్కాడు. తనపై వస్తున్న విమర్శలకు బ్యాట్‌తోనే సమాధానం చెప్పాడు. పాక్‌పై 211 బంతుల్లో 164 రన్స్‌ చేసిన వార్నర్‌ వన్డే స్టైల్‌లో బ్యాటింగ్‌ చేసి విమర్శకుల మూతి మూయించాడు.

New Update
Warner : విమర్శకులను బ్యాట్‌తో బాదేసిన డేవిడ్‌ భాయ్‌.. ఫేర్‌వెల్‌ సిరీస్‌లో వార్నర్‌ ట్రేడ్‌మార్క్‌ సెలబ్రేషన్‌!

David Warner : క్రికెటర్లైనా.. సామాన్య ప్రజలైనా విమర్శల పాలవ్వాల్సిందే.. ఎవరో ఒకరు నిత్యం ఏదో ఒకటి అంటునే ఉంటారు. మనం ఎదుగుతుంటే చూసి తట్టుకోలేక ఏదో వాగుతుంటారు. కొంతమంది అసూయతో మాట్లాడుతుంటారు. ఆస్ట్రేలియా ఓపెనర్‌ డేవిడ్‌ వార్నర్‌(David Warner) గురించి క్రికెట్ ప్రేమికులకు ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. అందులోనూ ఇండియాలో వార్నర్‌ అంటే ఫ్యాన్స్‌కు ఎంతో ఇష్టం. డేవిడ్‌ భాయ్‌ అని ముద్దుగా పిలుచుకునే వార్నర్‌ ఐపీఎల్‌లో సన్‌రైజర్స్‌కు ట్రోఫీ అందించాడు. అయితే తర్వాత అతడిని ఫ్రాంచైజీ పక్కన పెట్టడం ఫ్యాన్స్‌ను ఎంతో బాధ పెట్టిండి. శాండ్‌పేపర్‌ స్కాండల్‌లో దోషిగా తేలిన వార్నర్‌ ఏడాదికిపైగా క్రికెట్‌కు దూరమైన విషయం తెలిసిందే. ఇక గత నెలలో ముగిసిన వరల్డ్‌కప్‌లోనూ వార్నర్ రాణించాడు. ఆస్ట్రేలియా(Australia)కు వరల్డ్‌కప్‌ తీసుకురావడంలో కీలక పాత్ర పోషించాడు. ఇక తాజాగా పాకిస్థాన్‌తో జరుగుతున్న టెస్టు సిరీస్‌ వార్నర్‌కు ఆఖరిది. ఫేర్‌వెల్‌ టేస్టు సిరీస్‌లో వార్నర్‌ దుమ్మురేపుతున్నాడు. సెంచరీతో అదరగొట్టాడు.


భలే జంప్‌ చేశావ్‌ భయ్యా:
వార్నర్‌కు ట్రేడ్‌మార్క్‌ సెలబ్రేషన్‌ ఉంది. సెంచరీ చేయగానే గాల్లోకి ఎగురుతాడు వార్నర్‌. చాలా ఎత్తుకు ఎగిరి సెలబ్రేట్‌ చేసుకునే వార్నర్‌ జంప్‌కు ప్రత్యేకంగా ఫ్యాన్స్‌ కూడా ఉన్నారు. పాకిస్థాన్‌పై జరుగుతున్న తొలి టెస్టులో వార్నర్‌ సెంచరీ చేశాడు. పెర్త్ స్టేడియంలో జరుగుతున్న మ్యాచ్‌లో టాస్ గెలిచిన ఆస్ట్రేలియా బ్యాటింగ్‌ ఎంచుకుంది. ఇదే తన చివరి టెస్టు సిరీస్ అని ఆసీస్ స్టార్ ముందుగానే ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే టెస్టుల్లో వార్నర్‌ అంత ఫామ్‌లో లేడు. దీంతో ఫామ్ లేని వార్నర్‌ని ఎలా ఎంపిక చేస్తారని విమర్శలు గుప్పించిన వాళ్లు చాలా మంది ఉన్నారు. వీరిలో మాజీలు ఎక్కువ. ఆస్ట్రేలియా మాజీ బౌలర్‌ మిచెల్ జాన్సన్‌ బహిరంగంగానే వార్నర్‌పై విమర్శలు గుప్పించాడు. క్రికెట్‌ చరిత్రలో అతి పెద్ద స్కామ్స్‌లో ఒకటైన్‌ 'శాండ్‌పేపర్‌' వివాదంలో వార్నర్‌ దోషి. ఇదే విషయాన్ని ప్రస్తావిస్తున్న మాజీలు.. ఇలాంటి ఆటగాడికి ఫేర్‌వెల్‌ సిరీస్‌ పెడతారా అని అసంతృప్తి వ్యక్తం చేశారు. అయితే ఇవేవీ పట్టించుకోని వార్నర్‌ తన సత్తా చూపించాడు. సెంచరీ తర్వాత ట్రేడ్‌ మార్క్‌ స్టైల్‌లో సెలబ్రేట్ చేసుకున్నాడు.


తొలి రోజు ఆట ముగిసే సమయానికి ఆస్ట్రేలియా 346 పరుగులకు 5 వికెట్లు కోల్పోయింది. క్రీజులో మిచెల్ మార్ష్‌, అలెక్స్‌ క్యారీ ఉన్నారు. ఓపెనర్‌ వార్నర్‌ 211 బంతుల్లో 164 రన్స్ చేశాడు. ఇందులో 16 ఫోర్లు, నాలుగు సిక్సర్లు ఉన్నాయి. మరో ఓపెనర్‌ ఉస్మన్‌ ఖవాజా 98 బంతుల్లో 41 రన్స్ చేశాడు. ఇక ట్రావిస్‌ హెడ్‌ 53 బంతుల్లో 40 రన్స్‌తో రాణించాడు. అటు పాకిస్థాన్‌ బౌలర్లు తేలిపోయారు. వన్డే తరహాలో పరుగులు సమర్పించుకున్నారు.

Also Read: మూతికి కుట్లు.. తీవ్రమైన నొప్పి.. అయినా జట్టుకోసం బరిలోకి..! తమిళనాడు క్రికెటర్‌కి క్రీడా లోకం సెల్యూట్!

WATCH:

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

Sharwa 38: భారీ పీరియాడిక్ యాక్షన్ డ్రామాగా శర్వా 38..

శర్వానంద్, సంపత్ నంది కాంబినేషన్‌లో రూపొందనున్న 'శర్వా 38' సినిమా ఏప్రిల్ 30, 2025న షూటింగ్ ప్రారంభం కానుంది. 1960ల నేపథ్యంలో రూపొందే ఈ పీరియాడిక్ యాక్షన్ డ్రామాలో శర్వా కొత్త అవతారంలో కనిపించనున్నాడు.

New Update
Sharwa 38

Sharwa 38

Sharwa 38: ఎంతో మంది ఫ్యామిలీ ఆడియన్స్ మనసులను గెలుచుకున్న శర్వానంద్ ప్రస్తుతం తన కెరీర్‌లో మరో ఆసక్తికరమైన మూవీ చేస్తున్నాడు. శర్వా హీరోగా రామ్ అబ్బరాజు దర్శకత్వం వహించిన "నారి నారి నడుమ మురారి" విడుదలకు సిద్ధమవుతున్న తరుణంలో,  ఆయన తదుపరి భారీ ప్రాజెక్ట్‌కు రంగం సిద్ధం చేసుకుంటున్నాడు.

శర్వానంద్ 38వ సినిమా ప్రస్తుతం ‘శర్వా 38’ పేరుతో ప్రీ ప్రొడక్షన్ దశలో ఉంది. ఈ చిత్రానికి సక్సెస్‌ఫుల్ డైరెక్టర్ సంపత్ నంది మెగాఫోన్ పట్టనున్నాడు, త్వరలో విడుదల కానున్న ఓదెల 2 సినిమాకు కూడా ఆయన క్రియేటివ్ గైడెన్స్ అందించారు. ఓదెల 2 ప్రెస్‌మీట్‌లో పాల్గొన్న సంపత్, శర్వా 38 సినిమా ఏప్రిల్ 30, 2025న అధికారికంగా షూటింగ్ ప్రారంభం కానుందని తెలిపారు.

Also Read: నరరూప రాక్షసుడిని చూస్తారు.. మే 1న థియేటర్లలో కలుద్దాం: నాని

ఈ చిత్రం 1960ల చివరలో జరిగే వాస్తవ సంఘటనల ఆధారంగా రూపొందే పీరియాడికల్ యాక్షన్ డ్రామాగా రూపొందనుంది. భారీ స్థాయిలో రూపొందనున్న ఈ మూవీలో శర్వానంద్ అభిమానులకు పూర్తిగా భిన్నమైన అవతారంలో దర్శనమివ్వనున్నాడు. ఈ పాత్రలో  ఆయన నటన మరో మైలురాయి చేరనుందని దర్శకుడు ధీమాగా చెబుతున్నారు.

Also Read: ఒక్క మాటతో ప్రభాస్ 'స్పిరిట్'ని ఆకాశానికి ఎత్తేసిన రాజమౌళి..

శ్రీ సత్యసాయి ఆర్ట్స్ బ్యానర్‌పై కె.కె. రాధామోహన్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. సంగీతం భీమ్స్ సిసిరోలియో అందించగా, సినిమాటోగ్రఫీ బాధ్యతలు సౌందర్ రాజన్ చేపట్టనున్నారు. టైటిల్, క్యాస్ట్, ఫస్ట్ లుక్ టీజర్‌లకు సంబంధించిన సమాచారం త్వరలో అధికారికంగా వెల్లడికానుంది. ఇప్పటికే మంచి బజ్‌ను సొంతం చేసుకున్న ఈ పాన్-ఇండియా లెవెల్ ప్రాజెక్ట్‌పై మరిన్ని తాజా వివరాల కోసం మా వెబ్‌సైట్‌ను ఫాలో అవ్వండి!

Also Read: వీకెండ్ కలెక్షన్స్ లో దుమ్ము దులిపేసిన ‘జాట్’..

Advertisment
Advertisment
Advertisment