Trisha: అలాంటివారిని చూస్తుంటే అసహ్యం వేస్తోంది...!! అటెన్షన్ కోసం ఏ స్థాయికైనా దిగజారిపోయే వారిని చూస్తుంటే అసహ్యంగా ఉందంటూ అసహనం వ్యక్తం చేశారు ప్రముఖ నటి త్రిష. అలాంటి వ్యక్తులపై కఠిన చర్యలు తీసుకుంటామని...తాను ఇచ్చే సమాధానం లీగల్ డిపార్ట్ మెంట్ నుంచే వస్తుందని హెచ్చరించారు. తన అసహనానికి కారణమేంటో మాత్రం చెప్పలేదు. By Bhoomi 20 Feb 2024 in సినిమా టాప్ స్టోరీస్ New Update షేర్ చేయండి Trisha: ప్రముఖ నటి త్రిష కామెంట్స్ చర్చనీయాంశమయ్యాయి. అటెన్షన్ కోసం ఏ స్థాయికైనా దిగజారిపోయే వారిని చూస్తుంటే అసహ్యంగా ఉందంటూ అసహనం వ్యక్తం చేశారు. అలాంటి వ్యక్తులపై కఠిన చర్యలు తీసుకుంటామని...తాను ఇచ్చే సమాధానం లీగల్ డిపార్ట్ మెంట్ నుంచే వస్తుందని హెచ్చరించారు.ఈ మేరకు సోషల్ మీడియా ట్విట్టర్ వేదికగా ఈ పోస్టు పెట్టారు. కానీ తన తన అసహనానికి కారణమేంటో వెల్లడించలేదు. తమిళనాడుకు చెందిన ఏఐఏడీఎంకే పార్టీ మాజీ లీడర్ ఏవీ రాజు చేసిన ఆరోపణలపైనే త్రిష స్పందించారని సమాచారం. ఎమ్మెల్యే జి. వెంకటాచలాన్ని లక్ష్యంగా చేసుకుని మాట్లాడిన రాజు , త్రిష వ్యక్తిగత జీవితంపైన కూడా వ్యాఖ్యలు చేశారు. సదరు వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. దీనిపై స్పందించిన త్రిష ఫ్యాన్స్, నెటిజన్లు ఇలాంటివారిపై వెంటనే చర్యలు తీసుకోవాలని కామెంట్స్ చేశారు. త్రిష మీకు మేమున్నాం అంటూ పలువురు సినీతారలు కూడా మద్దతు పలికారు. ఈ క్రమంలోనే త్రిష స్పందించినట్లు సమాచారం. ఇంతకుముందు నటుడు మన్సూర్ అలీఖాన్, త్రిషపై అనుచిత కామెంట్స్ చేసిన విషయం తెలిసిందే. కెరీర్ ప్రారంభించి 20 ఏళ్లకుపైనే అయినా కూడా స్టార్ హీరోయిన్ గా త్రిష రాణిస్తున్నారు. గత ఏడాది మూడు సినిమాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఇప్పుడు ఐదు సినిమాల్లో నటిస్తూ చాలా బిజీగా ఉన్నారు. వాటిలో ఒకటి చిరంజీవి హీరోగా తెరకెక్కుతును్న విశ్వంభర, సోషియే ఫాంటసీ నేపథ్యంలో దర్శకుడు వశిష్ట ఈ మూవీని తెరకెక్కిస్తున్నారు. వచ్చే ఏడాది జనవరి 10న ఈ మూవీ రిలీజ్ కానుంది. ఇది కూడా చదవండి: జనరల్ ప్యాసింజర్లకు ఇక్కట్లు..రెగ్యూలర్ సర్వీసులను తగ్గించిన టీఎస్ఆర్టీసీ..!! #twitter #trisha #rumours #heroine-trisha మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి