Exil Polls: రేపే ఎగ్జిట్ పోల్స్.. కేంద్ర ఎన్నికల సంఘం కీలక ఆదేశాలు

జూన్ 1న (శనివారం) లోక్‌సభ తుది దశ ఎన్నికలు ముగిశాక పలు ప్రైవేటు, మీడియా సంస్థలు ఎగ్జిట్‌ పోల్స్‌విడుదల చేయనున్నాయి. ఈ నేపథ్యంలో సాయంత్రం 6.30 గంటల తర్వాతే వీటిని విడుదల చేయాలని కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశించింది.

New Update
EC: వాటికి ప్రస్తుతానికి విశ్రాంతినిచ్చి...వచ్చే సారికి మొదలు పెట్టండి...ఈవీఎంల గురించి ఈసీ సెటైర్లు!

జూన్ 1న (శనివారం) లోక్‌సభ తుది దశ ఎన్నికలు జరగనున్న సంగతి తెలిసిందే. ఈ ఎన్నికలు ముగిశాక పలు ప్రైవేటు, మీడియా సంస్థలు విడుదల చేయబోయే ఎగ్జిట్‌ పోల్స్‌పై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. ఇప్పటికే దేశ ప్రజలు వీటి కోసం పడిగాపులు కాస్తున్నారు. ఈ నేపథ్యంలో కేంద్ర ఎన్నికల సంఘం.. ఎగ్జిట్ పోల్స్ విడుదల చేయబోయే సంస్థలకు కీలక ఆదేశాలు జారీ చేసింది.

Also Read: ఎగ్జిట్‌ పోల్స్‌పై ఉత్కంఠ.. 2019 ఎన్నికల ఫలితాల అంచనాలు ఇవే!

రేపు సాయంత్రం 6.30 PM గంటల తర్వాతే ఎగ్జిట్‌ పోల్స్‌ను విడుదల చేయాలని సూచించింది. ప్రజాప్రాతినిథ్య చట్టం 126 ఏ(1) ప్రకారం నిబంధనలు పాటించాలని స్పష్టం చేసింది. రేపు లోక్‌సభ ఎన్నికల ఎగ్జిట్‌ పోల్స్‌తో పాటు.. ఆంధ్రప్రదేశ్‌ అసెంబ్లీ ఎన్నికల ఎగ్జిట్ పోల్స్‌ విడుదల కానున్నాయి.

Also Read: 7 సంవత్సరాల ముందుగానే బ్లడ్‌ క్యాన్సర్‌ను గుర్తించవచ్చా?

Advertisment
Advertisment
తాజా కథనాలు