AP News: దమ్ముంటే ఇండిపెండెంట్‌గా పోటీ చేయండి..వైసీపీ మంత్రులకు భూమా అఖిలప్రియ సవాల్ వైసీపీ ప్రభుత్వంపై మరోసారి మాజీ మంత్రి భూమా అఖిలప్రియ సంచలన వ్యాఖ్యలు చేశారు. మహిళలతో ఏ విధంగా మాట్లాడాలో అనేది కూడా తెలియకుండా మాట్లాడుతున్నారని ఆమె ఫైర్ అయ్యారు. ముందు ఎలా మాట్లాడాలో తెలుసుకొండి అంటూ భూమా అఖిలప్రియ వార్నింగ్ ఇచ్చారు. By Vijaya Nimma 06 Nov 2023 in ఆంధ్రప్రదేశ్ కర్నూలు New Update షేర్ చేయండి కర్నూలులో మాజీ మంత్రి భూమా అఖిలప్రియ మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ..ఆళ్లగడ్డ నియోజకవర్గ ప్రజలకు ఏమి చేశారు..? ఎవరిని ఉద్ధరించడం కోసం బస్సు యాత్ర చేస్తున్నారని ప్రశ్నించారు. మొదట్లో బస్సు యాత్ర అంటే సీఎం తిరుగుతారని చెప్పారు.. మరి ఎందుకు ఇప్పుడు బస్సు యాత్ర మంత్రులచేత చేయిస్తున్నారని ఆమె నిలదీశారు. వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత దళితులపైన ఏవిధంగా దాడులు చేస్తున్నారో అందరూ గమనిస్తున్నారన్నారు. అంబేద్కర్ పేరు మార్చి జగనన్న విదేశీ విద్య అని పేరు మార్చారు.. అదేనా దళితులపైన వైసీసీ ప్రభుత్వానికి ఉన్న ప్రేమ అని ప్రశ్నించారు. దళితుల మనోభావాలు దెబ్బ తినేలా జగన్ ప్రభుత్వం చేస్తుందని ఆమె ఆరోపించారు. టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు చంద్రబాబు మైనార్టీ ఆడపిల్లలకు దుల్హన్ పథకం కింద ఆడపిల్లలకు పెళ్లిళ్లు చేశారు. మరి వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత మైనార్టీలకు దులహన్ పథకం ఎందుకు ఇవ్వలేకపోతున్నారని ప్రశ్నించారు. Your browser does not support the video tag. నీళ్లు తీసుకొచ్చి రైతులను ఆదుకున్నాం నిధులు లేక మంత్రులు ఏ పనులు చేయలేకపోతున్నారు.. ఇది రాష్ట్ర ప్రభుత్వం పనితీరని విమర్శించారు. లీడర్లకు, కార్యకర్తలకు టార్గెట్ ఇచ్చి బస్సు యాత్రకు జనాలను తీసుకురావాలని చెబుతున్నారు. ఈ బస్సు యాత్ర ఎవరికోసం, ఎందుకోసం చేస్తున్నారో చెప్పాలని భూమా అఖిలప్రియ డిమాండ్ చేశారు. కేసీ కెనాల్ రైతులకు సాగునీరు లేక ఇబ్బందులు పడుతుంటే.. రైతుల సాగునీరు కోసం కలెక్టర్‌ను కలవడానికి రైతులతో వెళ్ళాము కానీ.. ఐఐబీ మీటింగ్ మీరు ఎందుకు వెళ్లలేదో గంగుల ప్రభాకర్‌రెడ్డి సమాధానం చెప్పాలన్నారు. నేను మంత్రిగా ఉన్నప్పుడు కేసీ కాలువ వెంట తిరిగి రైతులకు నీరు అందించామన్నారు. భీమవరం నుంచి నేలంపాడు వరకు నీళ్లు తీసుకొచ్చి రైతులను ఆదుకున్నామన్నారు. మరి మీరు ఎందుకు చేయలేకపోతున్నారని ప్రశ్నించారు. Your browser does not support the video tag. పోటీకి నేను సిద్ధం..ఆ సత్తా మీకు ఉందా..? శోభా నాగిరెడ్డి చనిపోయిన తర్వాతే నేను రాజకీయాలకు వచ్చాను ప్రజలు నమ్మి ఓట్లు వేశారు. మరి మీకు ఆ సత్తా ఉంటే మీరు ఇండిపెండెంట్‌గా పోటీ చేయొచ్చు కదా అని సవాల్ చేశారు. మరి ఎందుకు పోటీ చేయలేకపోయారు ఓటమి భయంతోనే పోటీ చేయలేకపోయారని ధ్వజమెత్తారు. మా మీద ఢీకొట్టడానికి మీకు ఒక అర్హత ఉండాలని అందుకే మీకు జగన్ పదవులు ఇచ్చారు.. అంతే కానీ మీరు ఏదో చేస్తారని కాదు అది తెలుసుకోండి అంటూ ఎద్దేవా చేశారు. శోభా నాగిరెడ్డి చనిపోయిన తర్వాత 18 వేల ఓట్ల మెజార్టీతో ప్రజలు తీర్పునిచ్చారన్నారు. పార్టీలు పక్కనపెట్టి ఇండిపెండెంట్‌గా పోటీ చేయడానికి నేను సిద్ధం..!! పోటీ చేయడానికి మీరు సిద్ధమా..? ఆ సత్తా మీకు ఉందా..? ఉంటే ప్రజల్లోకి వెళ్దాం రండి ఎవరి సత్తా ఏమిటో చూద్దాం అంటూ భూమా అఖిలప్రియ ధ్వజమెత్తారు. Your browser does not support the video tag. ఇది కూడా చదవండి: బ్లాక్ సాల్ట్‌లో బోలెడు ఖనిజాలు..తింటే అద్భుత ప్రయోజనాలు #ap-news #kurnool #cm-jagan #media-conference #ex-minister-bhuma-akhilapriya మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి