Elections 2024: మొరాయిస్తున్న ఈవీఎంలు..చాలాచోట్ల ఓటింగ్ ప్రక్రియ ఆలస్యం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ వ్యాప్తంగా ఉదయం ఏడు గంటలకే పోలింగ్ మొదలైంది. అయితే చాలా చోట్ల ఈవీఎంలు సరిగ్గా పని చేయక మొరాయిస్తున్నాయి. దీంతో ఓటింగ్ ప్రక్రియ ఆలస్యంగా మొదలవ్వడం, కొన్ని చోట్ల మధ్యలో ఆగిపోవడం లాంటివి జరుగుతున్నాయి. By Manogna alamuru 13 May 2024 in ఆంధ్రప్రదేశ్ తెలంగాణ New Update షేర్ చేయండి EVMs not working :ఆంధ్రప్రదేశ్, తెలంగాణల్‌లో ఓటింగ్ ప్రక్రియ చురుగ్గా సాగుతోంది. ఉదయం ఏడు గంటల నుంచే జనాలు ఓట్లు వేయడానికి క్యూలు కడుతున్నారు. రాజకీయ నాయకులు కూడా తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. అయితే చాలా చోట్ల ఈవీఎంలు పని చేయక మొరాయిస్తున్నాయి. కొన్ని ప్రాంతాల్లో ప్రారంభం నుంచి పని చేయకుండా ఉంటే..మరి కొన్ని ప్రాంతాల్లో మధ్యలో ఆగిపోవడం లాంటివి జరుగుతున్నాయి. దీంతో జనాలు గంటల తరబడి క్యూల్లో వెయిట్ చేయాల్సి వస్తోంది. నందిగామ అనాసాగరంలో ఈవీఎం మొరాయించింది. దీంతో అక్కడి ZPహైస్కూల్ 106వ పోలింగ్ బూత్ లో పోలింగ్ ఇంకా పోలింగ్ ప్రారంభం కాలేదు. బాపట్ల జిల్లా కొరిశపాడు మండలం కుర్రవానిపాలెంలో ఓటింగ్ ఆలస్యం అవుతోంది. ఖమ్మం సత్తుపల్లి 220బూత్ లో ఈవీఎం సరిగ్గా పని చేయలేదు. గుంటూరు జిల్లాలో పలు చోట్ల -- బొల్లాపల్లి మండలం వడ్డెంగుంటలో 59వ పోలింగ్ బూత్ లో పని చేయని EVM...వినుకొండలో 198,219 పోలింగ్ బూత్ లలో ఈవీఎంలు పని చేయడం లేదు. దాచేపల్లి జడ్పీ హై స్కూల్ లో 122 పోలింగ్ బూత్ లో, దాచేపల్లి మండలం భట్రుపాలెం 105 వ పోలింగ్ బూత్ లో, అచ్చంపేట 59వ పోలింగ్ బూత్..అమృతలూరులో 76వ పోలింగ్ బూత్ లో..తెనాలి గంగానమ్మ పేటలో 137వ పోలింగ్ బూత్ లో ఈవీఎంలు మొరాయించాయి. జెండ్ల మండలం మృత్యుంజయపురంలో 217వ పోలింగ్ బూత్ లో..ఉండవల్లిలో 15వ పోలింగ్ బూత్ లో ఈవీఎంలు పని చేయక ఆలస్యంగా ఓటింగ్ ప్రక్రియ గంట ఆలస్యంగా మొదలైంది. పత్తిపాడు మండలం,యనమదలలో 167వ పోలింగ్ బూత్ లో ఇప్పటివరకు ఈవీఎం పని చేయకపోవడంతో ఇప్పటి వరకు పోలింగ్ మొదలు కాలేదు. కాకినాడలోనూ ఇదే పరిస్థితి.. మరోవైపు కాకినాడ జిల్లా జగ్గంపేటలో కూడా ఈవీఎం మొరాయించింది. జగ్గంపేట జూనియర్ కాలేజ్ 158వ బూత్‌లో.. EVMలు మొరాయించడంతో ఓటర్ల ఇబ్బందులు పడుతున్నారు. పోలింగ్ మొదలై గంట దాటుతున్నా.. ఇప్పటికీ అక్కడి ఈవీఎంలు అందుబాటులోకి రావడం లేదు. దీంతో క్యూ లైన్‌లో నిల్చోలేక వృద్ధులు ఇంటికి వెళ్ళిపోతున్నారు. ఇక పిఠాపురంలో చాలాసేపు ఈవీఎంలలో అభ్యర్థుల ఫోటోలు కనిపించక గందరగోళం ఏర్పడింది. Also Read:Andhra Pradesh: కేంద్ర బలగాలను రప్పించండి..పల్నాడులో ఈసీ ఆదేశాలు #telangana #elections #andra-pradesh #poling మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి