EVM Tampering: ఈవీఎం ట్యాంపరింగ్ జరిగింది.. 'ది క్వింట్' కథనంలో సంచలన విషయాలు..

లోక్‌సభ ఎన్నికల్లో ఈవీఎం ట్యాంపరింగ్ జరిగినట్లు ఆరోపణలు వస్తుండగా.. సరిగ్గా ఇదే సమయంలో EVM డేటాతో పోలైన ఓట్లు మ్యాచ్‌ అవ్వలేదని ప్రముఖ న్యూస్‌ వెబ్‌సైట్‌ 'ది క్వింట్‌' తన కథనంలో పేర్కొంది. ఈ ఆర్టికల్‌లో పూర్తి వివరాలు తెలుసుకోండి.

New Update
EVM Tampering: ఈవీఎం ట్యాంపరింగ్ జరిగింది.. 'ది క్వింట్' కథనంలో సంచలన విషయాలు..

EVM.. ఈ ఒక్క పదం గురించి భిన్నరకాల వాదనలు.. ఎన్నికల ఫలితాలు విడుదలై రోజులు గడుస్తున్నా ఇప్పటికీ ఈవీఎంల పనితీరు అనేక సందేహాలు వ్యక్తమవుతూనే ఉన్నాయి. సరిగ్గా ఇదే సమయంలో EVM డేటాతో పోలైన ఓట్లు మ్యాచ్‌ అవ్వలేదని ప్రముఖ న్యూస్‌ వెబ్‌సైట్‌ 'ది క్వింట్‌' ప్రచురించిన ఓ కథనం సంచలనానికి తెర తీసింది. ఈవీఎం డేటా కంటే ఓట్లు ఎక్కడ ఎక్కువగా వచ్చాయి.. ఎక్కడ తక్కువగా వచ్చాయన్నదానిపై స్పష్టమైన నంబర్లతో సహా 'ది క్వింట్‌' ఓ ఆర్టికల్‌ను పబ్లిష్‌ చేసింది. ఇందులో ఏపీకి సంబంధించిన ప్రాంతాలు కూడా ఉన్నాయి. ఇంతకీ 'ది క్వింట్‌' కథనం ప్రకారం ఎన్ని ఓట్లు గల్లంతయ్యాయి? దీనికి ఎన్నికల కమిషన్‌ ఎలాంటి సమాధానం చెప్పింది? ఇప్పుడు తెలుసుకుందాం!

పోలైనవాటికంటే ఎక్కువ ఓట్లు

2024 లోక్‌సభ ఎన్నికల ఫలితాల్లో మొత్తం 362 నియోజకవర్గాల్లో ఈవీఎం డేటా పోలైన ఓట్లతో సరిపోలలేదని 'ది క్వింట్‌' చెబుతోంది. ఎలక్ట్రానిక్ ఓటింగ్ మెషీన్ ద్వారా పోల్ అయిన 5,54,598 ఓట్లు గల్లంతైనట్టుగా తెలుస్తోంది. అదనంగా 176 నియోజకవర్గాల్లో 35,093 EVM ఓట్ల సర్‌ప్లస్‌ను నమోదు చేసింది. అంటే పోలైన ఓట్ల కంటే ఎక్కవగా నమోదైన ఓట్లు అన్నమాట. మొత్తం రెండు దశల్లో 'ది క్వింట్‌' ఇన్‌వెస్టిగేషన్‌ చేసింది. మొదట పోలింగ్‌ రోజు ఎన్ని ఓట్లు పోల్ అయ్యాయో తెలుసుకుంది. ఇక ఫలితాల తర్వాత లెక్కించిన ఓట్లను మ్యాచ్‌ చేసింది. ఇలా మొత్తం 542 లోక్‌సభ నియోజకవర్గాల్లో మొత్తం 538 స్థానాల్లో డేటా మ్యాచ్‌ అవ్వలేని 'ది క్వింట్‌' చెబుతోంది.

Also Read: కొత్తగా కొలువుదీరిన కేంద్ర మంత్రుల్లో 99 శాతం మంది కోటీశ్వరులే

ఏపీ, తెలంగాణలో కూాడా 

అంటే ఈ నియోజకవర్గాల్లో ఈవీఎంలపై పోలైన ఓట్లకు, ఫలితాల రోజున లెక్కించిన ఓట్ల సంఖ్యకు సరిపోలడం లేదు. కనీసం 267 నియోజకవర్గాల్లో ఈ తేడా 500 ఓట్లకు పైగా నమోదైంది. ఇందులో ఏపీ నుంచి ఒంగోలు, గుంటూరు లోక్‌సభ నియోజకవర్గాలనూ ఉదహరించింది. ఒంగోలులో 13 లక్షల 99 వేల 707 ఓట్లు పోల్‌ అవ్వగా.. 14 లక్షల ఒక్క వెయ్యి 174 ఓట్లను లెక్కించారు. అంటే అదనంగా 14 వందల 67 ఓట్లు లెక్కలోకి వచ్చాయి. అటు ఏపీలోని మిగిలిన స్థానాల్లోనూ పోలైన ఓట్లకు, లెక్కించిన ఓట్లకు భారీగా తేడా ఉన్నట్టు ' ది క్వింట్‌ ' నంబర్లతో సహా పబ్లిష్‌ చేసింది. గుంటూరులో పోలైన ఓట్లకు, లెక్కించిన ఓట్లకు 7 వేల 928 ఓట్లు తేడా వచ్చిందని 'ది క్వింట్‌' ప్రచురించింది. కర్నూలు 6,389, నంద్యాల 2,360, కడప 4,109, అనంతపూర్ 2,751, హిందూపుర్‌ 6,572, తిరుపతి 3,004, చిత్తూరు 6,858, మచిలీపట్నం 1,878, విజయవాడ 4,968 ఓట్ల తేడాను 'ది క్వింట్' గుర్తించింది.

Also read: భారీ అగ్ని ప్రమాదం.. 41 మంది సజీవ దహనం

ఇలా కేవలం ఆంధ్రలోనే కాదు.. తెలంగాణతో పాటు దాదాపు అన్ని రాష్ట్రాల్లోని నియోజవర్గాల్లో ఇలాంటి తేడానే నివేదించింది. దీంతో ఎన్నికల నిర్వాహణలో ఈసీ మరింత ట్రాన్స్‌పేరెంట్‌గా పనిచేయాల్సిన అవసరం ఉందన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. పోల్ అయిన ఓట్ల సంఖ్యతో లెక్కించిన ఓట్ల సంఖ్య డేటాలో ఇలాంటి తేడా ఉండడం ఏ మాత్రం మంచిది కాదు. ఇది ప్రజల మనస్సులలో అనేక సందేహాలను సృష్టించడం ఖాయం. అటు తన ఇన్‌వెస్టిగేషన్‌ డేటాపై ప్రతిస్పందన కోసం 'క్వింట్' భారత ఎన్నికల కమిషన్‌ను సంప్రదించింది. ఇప్పటివరకు ఈసీ నుంచి ఎలాంటి సమాధానం రాలేదు.

Advertisment
Advertisment
తాజా కథనాలు