Finger Millet: ఈ జావతో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు..ప్రతీరోజూ తాగి చూడండి

ఎన్నోఅద్భుతగుణాలు దాగి ఉన్న రాగి జావా ప్రతీరోజూ తాగితే ఆరోగ్యానికి చాలా మేలు జరుగుతుంది. ఎదిగే పిల్లలకు రాగి జావ తాగడం వల్ల మెదడు చురుగ్గా పనిచేస్తుంది. చిన్న పనిచేసి అలసిపోయే వారు ఉదయం దీనిని తాగితే రోజంతా ఉత్సాహంగా ఉంటారు.

New Update
Finger Millet: ఈ జావతో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు..ప్రతీరోజూ తాగి చూడండి

Finger Millet: రాగులు ఆరోగ్యానికి చాలా మేలు చేస్తాయి. ఇవి తక్కువ ధరలో అందరికీ సులభంగా లభించే ఈ రాగుల్లో ఎన్నో అద్భుతగుణాలు దాగి ఉన్నాయని ఆరోగ్య నిపుణులు అంటారు. అత్యధికంగా వినియోగంలో ఉన్న తృణధాన్యాల ఆహారంలో రాగులు కూడా ఒకటి. వీటిలో ఎక్కువగా కాల్షియం, పొటాషియం, కార్పోహైడ్రేట్లు, ఫైబర్, కొవ్వు పదార్థాలు ఉంటాయి. వీటితో పాటు బి విటమిన్లు, ఐరన్ లాంటివి సమృద్ధిగా ఉంటాయి. రాగులను ఎలా తీసుకున్న పలు రోగాలకు చెక్ పెట్టవచ్చని ఆరోగ్య నిపుణులు వెల్లడిస్తున్నారు. అంతే కాకుండా వీటిని కాలంతో సంబంధం లేకుండా ప్రతిఒక్కరూ వీటిని తాగొచ్చు. ప్రతి రోజూ రాగి జావ తాగితే శరీరానికి కలిగే ఆరోగ్యానికి ఎలాంటి ప్రయోజనాలున్నాయో ఇప్పుడు కొన్ని విషయాలు తెలుసుకుందాం.

రాగి జావ తాగితే కలిగే ప్రయోజనాలు:

  • చిన్న పనిచేసి అలసిపోయే వారికి రాగి జావ ఎంతో మంచిది. దీనిని ఉదయం తాగితే రోజంతా ఉత్సహంగా ఉంటారు.
  • రాగి జావ తాగితే రక్తస్రావం తగ్గి..వీర్యకణాల వృద్ధి జరుగుతుంది.
  • ఎదిగే పిల్లలకు రాగి జావ పెటిడే మెదడు చురుగ్గా పనిచేస్తుంది. చిన్న పిల్లలకు రాగి జావ తాగించవచ్చని నిపుణులు చెబుతున్నారు.
  • శరీరంలో అధిక వేడి ఉంటే రాగి జావ అద్భుతంగా పని చేస్తుంది. ఈ జావా ప్రతీరోజూ తాగడం వల్ల శరీరానికి చల్లదనాన్ని ఇస్తుంది.
  • ప్రతీరోజూ రాగి జావ తాగితే శారీరక దృఢత్వం పెరుగుతుందని వైద్యులు అంటున్నారు.
  • బీపీ, షుగర్ వంటి వ్యాధులతో బాధ పడుతున్నారు రాగి జావా తాగడం వల్ల వీటిని కంట్రోల్‌ అవుతుంది.

ఇది కూడా చదవండి: నల్ల యాలకులతో అనేక అనారోగ్య సమస్యలు పరార్

గమనిక: ఈ కథనం ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇచ్చినది. RTV దీనిని ధృవీకరించడంలేదు. ఆరోగ్య సమస్యల నివారణకు సంబంధిత వైద్య నిపుణుడిని సంప్రదించడం ఉత్తమం.

ఇది కూడా చదవండి: రోజుకు ఎన్ని బాదం పప్పులు తినాలి? నానబెట్టి తినాలా? నార్మల్‌గా తినాలా?

Advertisment
Advertisment
తాజా కథనాలు