ICMR : ఇంట్లో ఈ వంటలు చేస్తున్నారా అయితే డేంజరే అంటున్న ఐసీఎంఆర్! ఆరోగ్యకరమైన ఆహారంపై తాజాగా పలు మార్గదర్శకాలు జారీ చేసిన ఐసీఎమ్ఆర్.. అధిక కొవ్వులు ఉండే ఆహారం విషయంలో అప్రమత్తంగా ఉండాలని వివరించింది. వీటితో పోషకాల లేమి ఏర్పడి చివరకు దీర్ఘకాలిక వ్యాధుల బారిన పడాల్సి వస్తుందని హెచ్చరికలు జారీ చేసింది. By Bhavana 16 May 2024 in Latest News In Telugu నేషనల్ New Update షేర్ చేయండి Food Items : చాలా మంది ఇళ్లలో వంట చేసే సమయంలో బాగా నూనె(Oil), నెయ్యి(Ghee) వంటి వాటిని ఎక్కువగా వాడుతుంటారు. ఇంట్లో చేసుకునే వంటలే కాదా పెద్దగా ప్రమాదం ఏమి ఉండదని అనుకుంటుంటారు. కానీ ఆ విధానం తప్పు అంటుంది... భారత వైద్య పరిశోధన మండలి. ఆరోగ్యకరమైన ఆహారం(Healthy Food) పై తాజాగా పలు మార్గదర్శకాలు జారీ చేసిన ఐసీఎమ్ఆర్(ICMR).. అధిక కొవ్వులు ఉండే ఆహారం విషయంలో అప్రమత్తంగా ఉండాలని వివరించింది. వీటితో పోషకాల లేమి ఏర్పడి చివరకు దీర్ఘకాలిక వ్యాధుల బారిన పడాల్సి వస్తుందని హెచ్చరికలు జారీ చేసింది. ఐసీఎమ్ఆర్ ప్రకటన ప్రకారం, కొవ్వులు, ఉప్పు అధికంగా ఉన్న ఆహారంతో ప్రజలు ఊబకాయం బారినపడతారు. ‘‘ఇలాంటి ఫుడ్స్ ద్వారా శరీరానికి కావాల్సిన అమైనో యాసిడ్స్, ఫ్యాట్స్, ఫైబర్ వంటి మాక్రోన్యూట్రియంట్స్, విటమిన్లు, మినరల్స్ వంటి ఫైటోన్యూట్రియంట్స్ తగిన మోతాదుల్లో అందవు. మైక్రో, మాక్రో పోషకాలలేమి కారణంగా రక్తహీనత, మెదడు సామర్థ్యం తగ్గడం, కొత్త విషయాలు నేర్చుకోవడంలో ఇబ్బందులు, డయాబెటిస్, ఊబకాయం వంటి వ్యాధులు సంభవిస్తాయి. కొవ్వులు, ఉప్పు అధికంగా ఉండే ఆహారంతో పేగుల్లోని మంచి చేసే బ్యాక్టీరియాపై ప్రతికూల ప్రభావం పడుతుంది. ఉప్పు ఎక్కువగా తింటే బీపీ పెరుగుతుంది. ఇది కిడ్నీలపై ప్రభావం చూపిస్తుంది ’’ అని ఐసీఎమ్ఆర్ పేర్కొంది. కొవ్వులు, ఉప్పు అధికంగా ఉన్న ఆహారాల్లో కేలరీలు ఎక్కువగా, పోషకాలు తక్కువగా ఉంటాయని పేర్కొంది. నెయ్యి, నూనె, బటర్, పామ్ ఆయిల్, వనస్పతిల్లో సంతృప్త కొవ్వులు ఎక్కువగా ఉంటాయని, ఇవి పలు అనారోగ్య సమస్యలకు దారి తీస్తాయని పేర్కొంది. ఐసీఎమ్ఆర్ మార్గదర్శకాల ప్రకారం, రోజుకు 10 గ్రాములకు మించి సంతృప్తకర కొవ్వులు తీసుకోవడం అనారోగ్యకారకం. ఉప్పును కూడా రోజుకు 5 గ్రాములకు మించి తినకూడదు. ఇక చక్కెర కూడా రోజుకు 25 గ్రాములకు మించి తినకూడదు. కేలరీలకు విటమిన్లు, మినరల్స్, పీచు పదార్థం తోడైనప్పుడే అది ఆరోగ్యకరమైన ఆహారంగా మారుతుందని ఐసీఎమ్ఆర్ తెలిపింది. Also read: తిరుమలలో మరోసారి చిరుత కలకలం #health #food #icmr #cooking మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి