Andhra Pradesh: బీసీ, ఈబీసీ, కాపు యువతకు ఏపీ ప్రభుత్వం గుడ్‌న్యూస్..

ఔత్సాహిక పారిశ్రామికవేత్తలుగా ఎదగాలనే వారి కోసం ఏపీ ప్రభుత్వం 'ఎంటర్‌ప్రెన్యూర్‌ డెవలప్‌మెంట్‌ ప్రోగ్రాం' అనే కొత్త కార్యక్రమాన్ని తీసుకురానుంది. బీసీ, ఈబీసీ, కాపు యువతకు ఈ అవకాశం ఇవ్వనుంది. ఇందుకోసం హైదరాబాద్‌లోని ఓ జాతీయ ఎమ్‌ఎస్‌ఎంఈ సంస్థతో ఒప్పందం చేసుకోనుంది.

New Update
Andhra Pradesh: బీసీ, ఈబీసీ, కాపు యువతకు ఏపీ ప్రభుత్వం గుడ్‌న్యూస్..

ఔత్సాహిక పారిశ్రామికవేత్తలుగా ఎదగాలనే వారి కోసం ఏపీ ప్రభుత్వం ఈడీపీ (ఎంటర్‌ప్రెన్యూర్‌ డెవలప్‌మెంట్‌ ప్రోగ్రాం) అనే కొత్త కార్యక్రమాన్ని తీసుకురానుంది. ఇందుకోసం ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. బీసీ, ఆర్థికంగా వెనకబడిన తరగతులు, అలాగే కాపు యువతను ఔత్సాహిక పారిశ్రామికవేత్తలుగా తయారు చేసేందుకు హైదరాబాద్‌లోని జాతీయ సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమల సంస్థ (MSME)తో ఒప్పందం చేసుకోనుంది. ఇప్పటికే ఆ సంస్థతో ఆయా శాఖల అధికారుల చర్చలు ప్రారంభించారు. అక్కడి పరిశ్రమల సిలబస్‌కు అనుగుణంగా 4 లేదా 6 వారాల పాటు శిక్షణ ఇవ్వనున్నారు. ఒక్కో అభ్యర్థి కోసం.. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నిధులు ఖర్చు చేయనున్నారు.

Also Read:  ఫేక్ బ్యాంక్‌ గ్యారెంటీల స్కామ్‌పై స్పందించని పొంగులేటి.. కారణమేంటి?

ప్రతీ ఏడాది 2 వేల మందిని ఔత్సాహిక పారిశ్రామికవేత్తలుగా తయారుచేసేలా అధికారులు ప్రతిపాదనలు రెడీ చేశారు. ఇందులో చూసుకుంటే వెయ్యి మంది బీసీలు, ఆర్థికంగా వెనుకబడిన తరగతులకు చెందిన 500 మంది, అలాగే కాపు సామాజిక వర్గం నుంచి 500 మంది అభ్యర్థులు ఉండనున్నారు. ఈ వర్గాల నుంచి బ్యాచ్‌కు 30 మంది చొప్పున ఎంపిక చేసి ట్రైనింగ్ ఇస్తారు. ఏడాది పాటు ఈ కార్యక్రమం కొనసాగేలా కార్యచరణను సిద్ధం చేశారు. ఇక శిక్షణ కోసం అభ్యర్థుల్ని ఎంపిక చేసేందుకు ప్రత్యేక విధానం, ప్రశ్నావళిని అనుసరించనున్నారు.

మొత్తంగా చూసుకుంటే ఐదేళ్లలో 9 వేల మందిని తయారు చేసేలా రోడ్‌మ్యాప్‌ను సిద్ధం చేశారు. ఈ శిక్షణ అనంతరం అభ్యర్థుల ఆసక్తికి అనుగుణంగా పరిశ్రమల ఏర్పాటు చేసేందుకు రాష్ట్ర సర్కార్ సాయం చేయనుంది. శిక్షణ పూర్తి చేసుకున్న అభ్యర్థులు.. తమ ఆలోచనలను ఆ సంస్థతో నిరంతరం పంచుకనే ఛాన్స్ ఉంటుంది.

Also Read: నేలకూలిన శివాజీ మహారాజ్ విగ్రహం.. కారణం ఏంటంటే ?

Advertisment
Advertisment
తాజా కథనాలు