Kannappa: కన్నప్ప అప్డేట్.. కోయదొర పాత్రలో శరత్ కుమార్.. పోస్టర్ వైరల్..!

మంచు విష్ణు నటిస్తున్న లేటెస్ట్ మూవీ కన్నప్ప. తాజాగా ఈ మూవీకి సంబంధించి మరో క్రేజీ అప్డేట్ ఇచ్చారు మేకర్స్. 'కన్నప్ప' నుంచి తమిళ స్టార్ శరత్ కుమార్ ఫస్ట్ లుక్ రిలీజ్ చేశారు. ఇందులో శరత్ కుమార్ నాథనాధుడు అనే కోయ దొర పాత్ర‌లో క‌నిపించ‌బోతున్న‌ట్లు పోస్టర్ విడుదల చేశారు.

New Update
Kannappa: కన్నప్ప అప్డేట్.. కోయదొర పాత్రలో శరత్ కుమార్.. పోస్టర్ వైరల్..!

Kannappa Movie: టాలీవుడ్ హీరో మంచు విష్ణు (Manchu Vishnu) నటిస్తున్న ప్రధాన పాత్రలో నటిస్తున్న తాజా చిత్రం 'కన్నప్ప'. భారీ ఊహాగానాలతో రూపొందుతున్న ఈ చిత్రానికి ముఖేష్‌కుమార్‌ సింగ్‌ దర్శకత్వం వహించగా.. మోహన్ బాబు నిర్మిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన ఈ మూవీ టీజర్ మంచి రెస్పాన్స్ సొంతం చేసుకోగా.. తాజాగా మూవీ నుంచి మరో క్రేజీ అప్డేట్ ఇచ్చారు మేకర్స్.

శరత్ కుమార్ ఫస్ట్ లుక్ పోస్టర్

పాన్ ఇండియా స్థాయిలో తెరకెక్కతున్న ఈ సినిమాలో స్టార్ కాస్ట్ మోహన్ బాబు, మోహన్ లాల్, ప్రభాస్ (Prabhas), ప్రీతి ముకుందన్, అక్షయ్ కుమార్, శరత్ కుమార్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. అయితే తాజాగా మూవీ నుంచి తమిళ్ స్టార్ యాక్టర్ శరత్ కుమార్ (Sarath Kumar) ఫస్ట్ లుక్ రిలీజ్ చేసింది చిత్రబృందం. ఈ సినిమాలో శరత్ కుమార్ 'నాథనాధుడు' అనే కోయ దొర పాత్ర‌లో క‌నిపించ‌బోతున్న‌ట్లు పోస్టర్ విడుదల చేశారు. "భీమ సేనా , హిడింబి వారసుల నాయకుడు. వీరి ఆయుధాలు విల్లు, బాణాలు అంటూ పోస్టర్ షేర్ చేశారు.

Also Read: Janhvi Kapoor: జాన్వీ గురించి అలా మాట్లాడలేదు.. క్లారిటీ ఇచ్చిన హీరో గుల్షన్..! - Rtvlive.com

Advertisment
Advertisment
తాజా కథనాలు