G.O.A.T : సుడిగాలి సుదీర్ 'G.O.A. T'... మూవీ నుంచి మరో సాంగ్

జబర్దస్త్ ఫేమ్ సుడిగాలి సుధీర్ హీరోగా నటిస్తున్న లేటెస్ట్ మూవీ 'G.O.A.T'. తాజాగా ఈ చిత్రం నుంచి హీరో ఇంట్రడక్షన్‌ సాంగ్‌ రిలీజ్ చేశారు. ‘బాసే హే నీలా వుండే లక్కు మాకే లేదురా" అంటూ సాగిన ఈ పాట సినిమాలో హీరో క్యారెక్టర్ ను తెలియజేసేలా ఉంది.

New Update
G.O.A.T : సుడిగాలి సుదీర్ 'G.O.A. T'... మూవీ నుంచి మరో సాంగ్

G.O.A.T :  నరేష్ కుప్పిలి దర్శకత్వంలో జబర్దస్త్ ఫేమ్ సుడిగాలి సుదీర్ (Sudigali Sudheer) హీరోగా నటిస్తున్న తాజా చిత్రం G.O.A.T (Greatest of All Times). ఈ చిత్రాన్ని మహాతేజ క్రియేషన్స్ బ్యానర్ పై మొగుళ్ల చంద్రశేఖర్ రెడ్డి నిర్మిస్తున్నారు. యంగ్ బ్యూటీ దివ్య భారతి ఫీమేల్ లీడ్ గా నటిస్తోంది. ఇప్పటికే మూవీ నుంచి విడుదలైన ఫస్ట్ సింగిల్ 'అయ్యో పాపం సారూ'... మంచి రెస్పాన్స్ సొంతం చేసుకోగా.. తాజాగా మరో పాటను రిలీజ్ చేశారు మేకర్స్.

హీరో ఇంట్రో సాంగ్

హీరో ఇంట్రడక్షన్‌ సాంగ్ ను రిలీజ్ చేశారు. ‘బాసే హే నీలా వుండే లక్కు మాకే లేదురా.. అంటూ సాగిన ఈ పాట సినిమాలో హీరో క్యారెక్టర్ ను తెలియజేసేలా ఉంది. ఈ పాటకు లియోన్ జేమ్స్ (Leon James) సంగీతం అందించగా.. కాసర్ల శ్యామ్‌ లిరిక్స్ రాశారు. పుష్ప 2 టైటిల్ సాంగ్ ఫేమ్ దీపక్‌ బ్లూ ఈ పాటను పాడడం విశేషం. కొరియోగ్రఫీ జీతు మాస్టర్ అందించారు. ఇప్పటికే ఎనభై శాతం షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం త్వరలో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇంకా కొన్ని యాక్షన్‌ ఏపిసోడ్స్‌, రెండు పాటల చిత్రీకరణ బ్యాలెన్స్ ఉన్నట్లుగా మూవీ టీమ్ చెబుతోంది.

Also Read: Demonte Colony 2 : తెలుగులో తమిళ్ హారర్ థ్రిల్లర్ ... 'డీమాంటే కాలనీ 2' రిలీజ్ - Rtvlive.com

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

హ్యాట్సాఫ్ అనన్య.. ఇది కూడా దేశభక్తే.. మెచ్చుకోకుండా ఉండలేం!

నటి అనన్య నాగళ్ళ మరోసారి తన మానవత్వాన్ని చాటుకుంది. పహల్గామ్ ఉగ్రదాడిలో మృతిచెందిన నెల్లూరు వాసి మధుసూదన్ భౌతికకాయానికి స్వయంగా వెళ్లి నివాళులు అర్పించారు. అతడి కుటుంబ సభ్యులకు సానుభూతి తెలియజేశారు. దీంతో ఆమెపై ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. 

New Update
actress Ananya nagalla condolences to pahalgam attack families

actress Ananya nagalla condolences to pahalgam attack families

Pahalgam Attack నటి అనన్య నాగళ్ళ మరోసారి తన మానవత్వాన్ని చాటుకుంది. పహల్గామ్ ఉగ్రదాడిలో మృతిచెందిన నెల్లూరు వాసి మధుసూదన్ భౌతికకాయానికి స్వయంగా వెళ్లి నివాళులు అర్పించారు. అతడి కుటుంబ సభ్యులకు సానుభూతి తెలియజేశారు. దీంతో ఆమెపై ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. 

Advertisment
Advertisment
Advertisment