Sai Pallavi: అందుకే అలాంటి బట్టలు వేసుకోను.. ఆ సంఘటనే దానికి కారణం..? నటి సాయి పల్లవి తాను పొట్టి దుస్తులు ఎందుకు ధరించదో తెలిపింది. జార్జియాలో టాంగో డాన్స్ కోసం ఆమె స్లిట్ డ్రెస్ ధరించిందట. ఆ తర్వాత ఆ డాన్స్ వీడియో వైరల్ కావడంతో ఆమె డ్రెస్ పై కామెంట్స్ చేశారట. దాంతో అసౌకర్యానికి గురైన ఆమె అప్పటి నుంచి పొట్టి బట్టలు వేసుకోనని తెలిపింది. By Archana 07 Jul 2024 in సినిమా టాప్ స్టోరీస్ New Update షేర్ చేయండి Sai Pallavi : టాలీవుడ్ (Tollywood) స్టార్ హీరోయిన్ సాయి పల్లవి (Sai Pallavi) ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉంది. బాలీవుడ్ డైరెక్టర్ నితీష్ తివారి దర్శకత్వంలో రాబోతున్న రామాయణంలో సాయి పల్లవి సీత పాత్రలో కనిపించనుంది. రణబీర్ కపూర్ రాముడిగా నటిస్తున్నాడు. స్టార్ కాస్ట్ లారా దత్తా, యష్ , అరుణ్ గోవిల్ తదితరులు కీలక పాత్రల్లో కనిపించనున్నారు. 2025 లో ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానున్నట్లు సమాచారం. అందుకే పొట్టి దుస్తులు వేసుకోను ఇది ఇలా ఉంటే ఇటీవలే ఓ ఇంటర్వ్యూ లో పాల్గొన్న సాయి పల్లవి తాను సినిమాల్లోపొట్టి దుస్తులు (Short Dresses) ధరించకపోవడానికి కారణం తెలిపింది. ఆమెకు జరిగిన ఒక సంఘటన గురించి పంచుకుంది. సాయి పల్లవి మాట్లాడుతూ... "నేను జార్జియాలో చదువుతున్నప్పుడు టాంగో డాన్స్ (Tango Dance) నేర్చుకున్నాను. ఆ సమయంలో ఒక ప్రదర్శన కోసం స్లిట్ డ్రెస్ వేసుకోవాల్సి వచ్చింది. దాని కోసం మా పేరెంట్స్ అనుమతి కూడా తీసుకున్నాను. వాళ్ళు కూడా దానికి ఒప్పుకున్నారు. ఆ తర్వాత కొద్దీ రోజులకు నా ఫస్ట్ మూవీ ప్రేమమ్ రిలీజయ్యింది. ఆ సినిమాలో నా నటనకు చాలా అభినందనలు కూడా వచ్చాయి. ఇక అదే సమయంలో నేను జార్జియాలో చేసిన డాన్స్ వీడియో సోషల్ మీడియా (Social Media) లో బాగా వైరలైంది. అది చూసి చాలా మంది రకరకాలుగా కామెంట్స్ చేశారు. దాంతో నేను చాలా అసౌకర్యానికి గురయ్యాను. నేను వేసుకునే దుస్తులు నా వ్యక్తిత్వాన్ని ప్రతిబింబించనవసరం లేదని అనుకున్నాను. ఆ సంఘటన తర్వాత నాకు అసౌకర్యాన్ని కలిగించేది చేయకూడదని నిర్ణయించుకున్నాను. అందుకే పొట్టి దుస్తులు ధరించడానికి ఇష్టపడను అని తెలిపింది. " Also Read: Ambani Wedding : సంగీత్ లో అంబానీ డాన్స్ మామూలుగా లేదుగా.. ఫ్యామిలీతో సందడే సందడి..! - Rtvlive.com #tollywood #sai-pallavi #short-dresses #tango-dance మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి