కేంద్ర ఎన్నికల కమిషనర్‌కు తప్పిన ప్రమాదం.. హెలికాప్టర్ అత్యవసర ల్యాండింగ్!

కేంద్ర ఎన్నికల సంఘం ప్రధానాధికారి రాజీవ్‌కుమార్‌కు పెను ప్రమాదం తప్పింది. ఆయన ప్రయాణిస్తున్న హెలీకాప్టర్ ఉత్తరాఖండ్‌లోని పితోరాగర్ జిల్లాలో ర్యాలం అనే గ్రామంలో అత్యవసరంగా ల్యాండ్ అయ్యింది. ప్రతికూల వాతావరణ కారణంగానే ఈ సంఘటన చోటుచేసుకుంది.

New Update
rajiv sharma

కేంద్ర ఎన్నికల సంఘం ప్రధానాధికారి రాజీవ్‌కుమార్‌కు పెను ప్రమాదం తప్పింది. ఆయన ప్రయాణిస్తున్న హెలీకాప్టర్ ఉత్తరాఖండ్‌లోని పితోరాగర్ జిల్లాలో ర్యాలం అనే గ్రామంలో అత్యవసరంగా ల్యాండ్ అయ్యింది. ప్రతికూల వాతావరణ కారణంగానే ఈ సంఘటన చోటుచేసుకుంది. రాజీకుమార్ ప్రయాణిస్తున్న హెలికాప్టర్ ఆది కైలేశ్ వైపు వెళ్తోంది. ఉత్తరాఖండ్ డిప్యూటీ చీఫ్ ఎలక్టోరల్ ఆఫీసర్ విజయ్ కుమార్ జోగ్దాండే కూడా ఆయన వెంటే ఉన్నారు. ప్రతికూల వాతావరణం ఏర్పడటంతో హెలికాప్టర్‌ను మున్సియారిలో అత్యవసర ల్యాండింగ్ చేయాల్సి వచ్చింది. 

Also Read: హర్యానా సీఎంగా మరోసారి నాయబ్ సింగ్ సైనీ.. ప్రమాణస్వీకారం ఎప్పుడంటే ?

ఇదిలాఉండగా ఈసీ చీఫ్ రాజీవ్ కుమార్ అక్టోబర్ 15న మహారాష్ట్ర, జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్‌ను విడుదల చేసిన సంగతి తెలిసిందే. న్యూఢిల్లీలో జరిగిన మీడియా సమావేశంలో ఈ వివరాలు వెల్లడించారు. మహారాష్ట్రలో ఒకేదశలో నవంబర్ 20న ఎన్నికలు జరగనున్నాయి. అలాగే జార్ఖండ్‌లో నవంబర్ 13, 20న రెండు దశల్లో ఎన్నికలు నిర్వహించనున్నారు. ఇక నవంబర్ 23న ఓట్ల లెక్కింపు ఉంటుంది.  

Also Read: దీపావళికి బంపర్‌ బోనాంజా.. 53 శాతానికి డీఏ? 3 నెలల బకాయిలు కూడా!

2022  మే15న రాజీవ్ కుమార్ 25వ కేంద్ర ఎన్నికల ప్రధానాధికారిగా బాధ్యతలు స్వీకరించారు. 2025 ఫిబ్రవరి 18 వరకు ఆయన ఈ పదవిలో కొనసాగనున్నారు. రాజ్యాంగం ప్రకారం.. ఈసీ చీఫ్‌ పదవీకాలం ఆరు సంవత్సరాలు ఉంటుంది. అది కూడా 65 ఏళ్లలోపు వయసు ఉన్నవారికే. అయితే 2025 ఫిబ్రవరి 19న రాజీవ్ కుమార్‌కు తన 65వ ఏటా అడుగుపెట్టనున్నారు. 

Also Read: ఖగోళ అద్భుతం.. మరో 80 వేల ఏళ్ల వరకు రాదు!

1984 ఐఏఎస్ బ్యాచ్‌కు చెందిన రాజీవ్ కుమార్ తన జీవితంలో పలు ముఖ్యమైన బాధ్యతలను నిర్వహించారు. కేంద్రంలో, అలాగే బీహార్‌, జార్ఖండ్ రాష్ట్ర కేడర్‌లో వివిధ మంత్రిత్వ శాఖల్లో పనిచేశాడు. B.Sc., L.L.B, PGDM, M.A లలో అకడమిక్ డిగ్రీలు పొందారు. రాజీవ్ కుమార్‌కు పర్యావరణం, అడవులు, మానవ వనరులు, ఫైనాల్స్, బ్యాంకింగ్ రంగాల్లో కూడా పనిచేసిన అనుభవం ఉంది. 

Also Read: ముఖ్యమంత్రిగా ఒమర్‌ అబ్దుల్లా ప్రమాణస్వీకారం

Advertisment
Advertisment
తాజా కథనాలు