Elon Musk: ఐదేళ్ల వయసులో ఎలాన్ మస్క్ ఎలా ఉన్నారో చూడండి.. ఫొటో వైరల్ హలోవీన్ పండుగ నేపథ్యంలో టెస్లా అధినేత ఎలాన్ మస్క్ తనకు ఐదేళ్ల వయసున్నప్పుడు శాంటాక్లాజ్ ధరించిన ఫొటోను ఎక్స్ (ట్విట్టర్)లో షేర్ చేశారు. ప్రస్తుతం ఈ ఫొటో వైరలవుతోంది. అయితే వేడుకను అమెరికా, బ్రిటన్, ఫ్రాన్స్, ఐర్లాండ్‌తో పాటు పలు దేశాల్లో ఘనంగా జరుపుకుంటారు. By B Aravind 01 Nov 2023 in ఇంటర్నేషనల్ Latest News In Telugu New Update షేర్ చేయండి హాలోవీన్ పండుగకు ప్రపంచవ్యాప్తంగా మంచి క్రేజ్ ఉంది. ఒకప్పుడు ఇది కేవలం విదేశాలకు మాత్రమే పరిమితం అయి ఉండేది. కానీ ఇప్పుడు మనదేశంలో కూడా ఇది విస్తరించింది. అక్టోబర్ 31వ తేదిన రాత్రికి ప్రపంచవ్యాప్తంగా హలోవీన్ వేడుకలు ఎంతో ఉత్సాహంగా జరుపుకుంటారు. ఆరోజున దెయ్యాలు, రాక్షసుల్లాగా తయారయ్యి అందరినీ భయపెడుతుంటారు. అయితే ఈ వేడుక నేపథ్యంలో టెస్లా అధినేత ఎలాన్ మస్క్ కూడా ఈ వేడుకకు సంబంధించి ఓ క్యూట్ ఫొటోను ఎక్స్ (ట్విట్టర్) లో షేర్ చేశారు. తనకు ఐదేళ్ల వయసులో ఉన్నప్పుడు శాంటాక్లాజ్ డ్రెస్ ధరించిన ఫొటోను పోస్టు చేశారు. అందరికీ హలోవీన్ శుభాకాంక్షలు తెలిపిన ఎలాన్ మస్క్.. ఐదేళ్ల వయసులో తాను శాంటాక్లాజ్ ధరించానని రాసుకొచ్చారు. అయితే ప్రస్తుతం ఈ ఫొటో వైరల్ అవుతోంది. నెటీజన్లు విభిన్న రీతిలో తమ అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. Also read:హ్యాకింగ్ వ్యవహారంలో మరో ట్విస్టు.. తెలిస్తే షాక్ అవ్వాల్సిందే.. Also Read: రష్యాకు ఉత్తర కొరియా నుంచి ఆయుధాల సరఫరా.. ఎందుకంటే ఇదిలా ఉండగా.. ప్రపంచవ్యాప్తంగా హాలోవీన్ వేడుకలు ప్రతి సంవత్సరం అక్టోబర్ 31న జరుపుకుంటారు. అయితే ఈ వేడుకల్లో చిన్నారులు, యువత విచిత్రమైన దుస్తులు ధరిస్తారు. ముఖ్యంగా చాలామంది దెయ్యాలు, రాక్షసుల్లాగా రెడీ అయిపోయి ఈ వేడుకకు వచ్చినవారిని భయపెడుతుంటారు. అలాగే ఇరుగుపొరుగు వారందరూ కలిసి రాత్రి సమయంలో విందు వినోదాల్లో పాల్గొంటారు. ముఖ్యంగా అమెరికా, బ్రిటన్, ఫ్రాన్స్, ఐర్లాండ్‌తో పాటు పలు దేశాల్లో ఈ పండుగను ఎంతో ఘనంగా జరుపుకుంటారు. 👻🎃 Happy Halloween 🎃👻 pic.twitter.com/YEViI8G46D — Elon Musk (@elonmusk) October 31, 2023 Also Read: చెత్తను అమ్మి రూ.500 కోట్లు సంపాదించిన కేంద్రం Also read: ఎన్నికలకు ముందే అరెస్టులకు కుట్ర.. మమత బెనర్జీ సంచలన ఆరోపణలు #telugu-news #elon-musk మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి