Elon Musk : ఇప్పుడు రావడం లేదు.. భారత్‌లో ఎలాన్ మస్క్ పర్యటన వాయిదా

టెస్లా, ఎక్స్ అధిపతి ఎలాన్ మస్క్ ఇండియాలో పర్యటిస్తారని అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్న విషయం తెలిసిందే. అయితే ఈ పర్యటన వాయిదా పడింది. ఈ విషయాన్ని ఎక్స్‌లో అనౌన్స్ చేశారు. ఆయన ఇండియా పర్యటన ఈ ఏడాది చివరకు వాయిదా పడింది.

New Update
Elon Musk : ఇప్పుడు రావడం లేదు.. భారత్‌లో ఎలాన్ మస్క్ పర్యటన వాయిదా

Elon Musk India Tour : భారత్‌(India) లో టెస్లా(Tesla) అధినేత ఎలాన్ మస్క్(Elon Musk) పర్యటన వాయిదా పడింది. టెస్లా కార్ల తయారీ సంస్థకు చెందిన ముఖ్యమైన పనులు ఉండడం వల్లనే మస్క్ భారత్‌లో తన పర్యటన వాయిదా వేసుకున్నారని ఎక్స్‌లో వేదికగా వెల్లడించారు. మామూలుగా అయితే ఈనెల 21, 22 తేదీల్లో ఆయన ఇండియాకు రావాల్సి ఉంది. మన దేశంలో విద్యుత్ కార్ల(Electric Cars) తయారీకి సంబంధించి కీలక నిర్ణయాలు తీసుకునేందుకు యమస్క్ ఈ పర్యటనను పెట్టుకున్నారు. రెండు రోజుల పాటూ మస్క్ భారత్‌లో పర్యటించాలని అనుకున్నారు. ఇందులో ప్రధాని మోదీ(PM Modi) తో భేటీ కూడా ఉంది. దీని గురించి ప్రధాని మోదీ చెబుతూ.. మస్క్ భారత్‌కు మద్దతుదారు అని, పెట్టుబడులు పెట్టడానికి స్వాగతం పలుకుతున్నామని, భారత యువతకు ఉపాధి అవకాశాలను కల్పించాలని కోరారు.

టెస్లా కంపెనీ పనుల వల్లే..

అయితే ఇప్పుడు ఈ ప్లాన్ మొత్తం మారిపోయింది. టెస్లా మొదటి త్రైమాసిక పని తీరు గురించిన ప్రశ్నలకు సమాధానం ఇవ్వడానికి ఏప్రిల్ 23వ తేదీన యునైటెడ్ స్టేట్స్‌లో జరిగే కీలకమైన కాన్ఫరెన్స్ కాల్‌కు ఎలాన్ మస్క్ హాజరు కావాల్సి ఉండటం వల్ల భారత దేశ పర్యటనను రద్దు చేసుకున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. భారత్‌లోకి టెస్లా రాక గురించి కొన్నేళ్లుగా చర్చ జరుగుతోంది. ఈ క్రమంలోనే ఇక్కడ తయారీ కేంద్రం ఏర్పాటుకు అవసరమైన స్థలం కోసం టెస్లా వివిధ రాష్ట్ర ప్రభుత్వాలను సంప్రదించినట్లు కూడా వార్తలు వచ్చాయి. మహారాష్ట్ర, గుజరాత్‌లలో కాకుండా తెలంగానలో కూడా తయారీ కేంద్రాలు ఏర్పాటు చేసే దిశగా ప్రతిపాదనలు వెళ్ళాలని చెప్పారు. దాదాపు 2-3 బిలియన్‌ డాలర్ల వరకు పెట్టుబడి పెట్టొచ్చని సమాచారం. ఈ నేపథ్యంలో ఎలాన్ మస్క్ ఇండియాకు చాలా సపోర్ట్ చేస్తున్నారు. యూఎన్‌ఎస్సీలో భారత్‌కు శాశ్వత సభ్యత్వం లేకపోవడం అసంబద్ధమని అని కూడా అన్నారు.

Also Read:Iran Vs Israel: ఇరాన్‌పై ఇజ్రాయెల్ డ్రోన్ల దాడి..ఆవి బాంబులు కాదు ఆటబొమ్మలన్న ఇరాన్

Advertisment
Advertisment
తాజా కథనాలు