Election Commission : ఎన్నికల తనిఖీల్లో రూ.8,839 కోట్ల విలువైన సొత్తు స్వాధీనం..

లోక్‌సభ ఎన్నికల వేళ.. దేశవ్యాప్తంగా వివిధ ప్రాంతాల్లో చేపట్టిన తనిఖీలు కొనసాగుతున్నాయి. ఇప్పటి వరకు ఈ తనిఖీల్లో రూ.8,839 కోట్ల విలువైన నగదు, డ్రగ్స్, ఇతర తాయిలాలను స్వాధీనం చేసుకున్నట్లు కేంద్ర ఎన్నికల సంఘం ప్రకటించింది.

New Update
EC: వాటికి ప్రస్తుతానికి విశ్రాంతినిచ్చి...వచ్చే సారికి మొదలు పెట్టండి...ఈవీఎంల గురించి ఈసీ సెటైర్లు!

Lok Sabha Elections 2024 : లోక్‌సభ ఎన్నికల వేళ ఓటర్ల (Voters) ను ఆకర్షించేందుకు రాజకీయ పార్టీలు (Political Parties) పెద్దఎత్తున డబ్బులు పంపిణీ చేస్తున్నాయి. అయితే ప్రస్తుతం దేశవ్యాప్తంగా వివిధ ప్రాంతాల్లో తనిఖీలు కొనసాగుతున్నాయి. ఇప్పటి వరకు ఈ తనిఖీల్లో రూ.8,839 కోట్ల విలువైన నగదు, డ్రగ్స్, ఇతర తాయిలాలను స్వాధీనం చేసుకున్నట్లు కేంద్ర ఎన్నికల సంఘం ప్రకటించింది. జప్తు చేసిన వాటిలో 45 శాతం మాదక ద్రవ్యాల వాటా ఉందని.. రూ.3,958 కోట్ల విలువైన డ్రగ్స్‌ను స్వాధీనం చేసుకున్నట్లు పేర్కొంది.

Also read: ఢిల్లీకి వెళ్లి పర్మిషన్ తీసుకుంటాం.. కేబినెట్ భేటీపై సీఎం రేవంత్

అయితే స్వాధీనం చేసుకున్న వాటిలో రూ.849.15 కోట్ల నగదు, రూ.814.85 కోట్ల మద్యం, రూ.3,958 కోట్ల డ్రగ్స్, రూ.1,260.33 కోట్ల బంగారం, వెండి వంటి ఆభరణాలు, రూ.2006.09 కోట్ల ఉచితాలు ఉన్నాయని ఎన్నికల సంఘం తెలిపింది. డ్రగ్స్, సైకోట్రోపిక్ పదార్థాల స్వాధీనంపై ఈసారి ప్రత్యేక దృష్టిసారించామని చెప్పింది. గుజరాత్‌ ఏటీఎస్, నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో, ఇండియన్ కోస్ట్ గార్టులు కలిసి సంయుక్తంగా చేపట్టిన ఆపరేషన్లలలో మూడు రోజుల్లోనే రూ.892 కోట్ల విలువైన మాదక ద్రవ్యాలు స్వాధీనం చేసుకున్నట్లు తెలిపింది

తనిఖీల్లో భాగంగా పట్టుబడిన సొత్తులో అత్యధికంగా గుజరాత్‌ (Gujarat) లో రూ.1,461.73 కోట్లు స్వాధీనం చేసుకున్నామని ఎన్నికల సంఘం తెలిపింది. ఇక రాజస్థాన్‌లో రూ.1133.82 కోట్లు, పంజాబ్ రూ.734.54 కోట్లు జప్తు చేశామని పేర్కొంది. ఇక తెలంగాణ (Telangana) లో రూ.333.55 కోట్లు, ఆంధ్రప్రదేశ్‌లో రూ.301.75 కోట్లు స్వాధీనం చేసుకున్నట్లు తెలిపింది.

Also read:  రేపు బీజేపీ కార్యాలయానికి వస్తున్నా.. కేజ్రీవాల్‌ సవాల్

Advertisment
Advertisment
తాజా కథనాలు