Stock Market: ఎలక్షన్ రిజల్ట్స్ ఎఫెక్ట్.. ఇన్వెస్టర్ల సంపద 21 లక్షల కోట్లు ఢమాల్!

14 ఏళ్లలో మొదటిసారి ఒక్కరోజు మదుపర్ల సంపద 21 లక్షల కోట్ల రూపాయలు ఆవిరి అయిపోయాయి. ప్రస్తుతం స్టాక్ మార్కెట్ మరింత కిందికి దిగజారే అవకాశం ఉందని నిపుణులు అంచనా వేస్తున్నారు.

New Update
Stock Market: ఎలక్షన్ రిజల్ట్స్ ఎఫెక్ట్.. ఇన్వెస్టర్ల సంపద 21 లక్షల కోట్లు ఢమాల్!

సార్వత్రిక ఎన్నికల ఫలితాల సరళి స్టాక్ మార్కెట్ పై తీవ్ర ప్రభావం చూపించింది. నిన్న ఎగ్జిట్ పోల్స్ ఫలితాల నేపథ్యంలో పైకెగసిన స్టాక్ మార్కెట్ ఈరోజు దారుణంగా దిగజారింది. 14 సంవత్సరాల తరువాత ఒక్కరోజులో భారీగా నష్టపోయింది. ఈరోజు 11 గంటల సమయానికి 

సెన్సెక్స్ 4,400 పాయింట్లకు పైగా క్షీణించింది. , నిఫ్టీ 22,000 దిగువన ట్రేడవుతోంది. మొత్తం  21 లక్షల కోట్ల పెట్టుబడిదారుల సంపద తుడిచిపెట్టుకుపోయింది

ఎన్డీఏ కూటమి అరకొర మెజార్టీతో గెలుపొందుతున్న పరిస్థితిలో స్టాక్ మార్కెట్ తీవ్రంగా నష్టపోయింది. ఇండియా కూటమి మంచి ఫలితాలు సాధించే అవకాశం ఉండడం.. యూపీలో బీజేపీ దారుణంగా దెబ్బతినడం మార్కెట్ సెంటిమెంట్ ను దెబ్బ తీశాయి. 

అప్ డేట్ అవుతోంది..

Advertisment
Advertisment
తాజా కథనాలు