Konda Surekha: మంత్రి కొండా సురేఖకు షాక్.. ఈసీ నోటీసులు

TG: మంత్రి కొండా సురేఖకు కేంద్ర ఎన్నికల సంఘం హెచ్చరిక జారీ చేసింది. ఇటీవల వరంగల్ సభలో కేటీఆర్‌పై సురేఖ చేసిన వ్యాఖ్యలపై ఈసీకి బీఆర్ఎస్ ఫిర్యాదు చేసింది. స్టార్ క్యాంపెయినర్‌గా, మంత్రిగా ఉన్న నేపథ్యంలో మరింత బాధ్యతగా ఉండాలని ఆమెకు నోటీసులు జారీ చేసింది.

New Update
Konda Surekha: మంత్రి కొండా సురేఖకు షాక్.. ఈసీ నోటీసులు

EC Notices to Minister Konda Surekha: మంత్రి కొండా సురేఖకు కేంద్ర ఎన్నికల సంఘం హెచ్చరిక జారీ చేసింది. ఇటీవల వరంగల్ సభలో కేటీఆర్‌పై (KTR) సురేఖ చేసిన వ్యాఖ్యలపై ఈసీకి బీఆర్ఎస్ (BRS) ఫిర్యాదు చేసింది. బీఆర్ఎస్ ఇచ్చిన ఫిర్యాదును పరిశీలించిన ఈసీ సురేఖకు నోటీసులు జారీ చేసింది.  స్టార్ క్యాంపెయినర్‌గా, మంత్రిగా ఉన్న నేపథ్యంలో మరింత బాధ్యతగా ఉండాలని నోటీసులు జారీ చేసింది. మాజీ మంత్రి కేటీఆర్ పై కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలను తప్పు బట్టింది. కాంగ్రెస్ పార్టీ స్టార్ క్యాంపెయినర్‌గా, మంత్రి పదవిలో  ఉన్న నేపథ్యంలో మరింత బాధ్యతగా ఉండాలని నోటీసుల్లో పేర్కొంది.

గతంలో కూడా కేటీఆర్ పై ఆరోపణలు..

బీఆర్‌ఎస్‌ వర్కింగ్ ప్రెసిడెంట్‌, మాజీ మంత్రి కేటీఆర్‌ ఫోన్‌ ట్యాపింగ్‌ కేసులో జైలుకు వెళ్లడం ఖాయామని రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ అన్నారు. కేటీఆర్ ​ఫోన్‍ ట్యాపింగ్‍లతో ఎంతోమంది హీరోయిన్లను బ్లాక్‍ మెయిల్‍ చేశాడన్నారు. ఎంతో మంది అధికారులను బలిచేసి వారు ఉద్యోగాలు కోల్పోయి జైలుకు వెళ్లేలా చేశాడన్నారు. ఎన్నికలు దగ్గరకు వస్తున్నాయి కాబట్టే కేసీఆర్‌ ఫాంహౌస్‌ నుంచి బయటకు వచ్చాడే తప్ప.. రాష్ట్రం సర్వనాశనం అయిపోతున్న ఏనాడు బయటకు రాలేదని ఆమె విమర్శించారు.

అధికారం లేకనే కేసీఆర్‌, కేటీఆర్‌  కొత్త డ్రామాలకు తెర తీశారని విమర్శించారు. కాంగ్రెస్‌ పార్టీని విమర్శించే హక్కు కేసీఆర్‌ కు లేదన్నారు. కేసీఆర్‌ పాలనలో ధనిక రాష్ట్రాన్ని తీసుకెళ్లి అప్పుల పాలు చేశారని విమర్శించారు. కవిత మద్యం కేసు లో జైలులో ఉందనే విషయాన్ని వారు మరిచిపోయినట్లున్నారని కొండా ఎద్దేవా చేశారు.

Also Read: పని మనిషికి వేధింపులు.. ‘సింగం’ నిర్మాతపై కేసు నమోదు!

Advertisment
Advertisment
తాజా కథనాలు