AP : ఏపీలో ఈ-ఆఫీస్ అప్‌గ్రేడ్ ప్రక్రియ వాయిదా!

ఈ-ఆఫీస్ అప్‌గ్రేడ్‌పై ఎన్ఐసీ ప్రతినిధులతో ఏపీ ఎన్నికల ప్రధాన అధికారి ముకేశ్‌ కుమార్‌ మీనా మాట్లాడారు. విపక్షాల అభ్యంతరాలతో ఈ-ఆఫీస్ అప్‌గ్రేడ్ కార్యక్రమాన్ని నిలిపివేయాలని ఎన్ఐసీకి సూచించారు.

New Update
By Polls : దేశంలో మోగిన మరో ఎన్నికల నగారా.. ఆ 7 రాష్ట్రాల్లో ఎలక్షన్స్!

E-Office Upgrade : ఏపీ(AP) లోని గవర్నమెంట్‌ ఆఫీసుల్లో..ఈ-ఆఫీస్‌ సాఫ్ట్వేర్(E-Office Software) ను అప్‌ గ్రేడ్‌ చేసేందుకు నేషనల్‌ ఇన్ఫర్మాటిక్‌ సెంటర్‌(NIC) ఈ నెల 18 నుంచి 25 వరకు షెడ్యూల్‌ విడుదల చేసిన సంగతి తెలిసిందే. అయితే ఈ టైంలో ఈ-ఆఫీస్ అప్‌గ్రేడ్ సరికాదంటూ తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు(Chandrababu Naidu) గురువారం రాష్ట్ర గవర్నర్‌కు, రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారికి లేఖ రాశారు.

గవర్నమెంట్‌ డిపార్ట్‌మెంట్లలోని ఫైళ్ల భద్రతపై చంద్రబాబు ఆందోళన వ్యక్తం చేశారు. ఈ క్రమంలో ఎలక్షన్‌ కమిషన్‌ ఓ కీలక నిర్ణయం తీసుకుంది. ఆంధ్రప్రదేశ్‌లో ఈ-ఆఫీస్ అప్‌గ్రేడ్‌ కార్యక్రమాన్ని వాయిదా వేసింది. ఈ-ఆఫీస్ అప్‌గ్రేడ్‌పై ఎన్ఐసీ ప్రతినిధులతో ఏపీ ఎన్నికల ప్రధాన అధికారి ముకేశ్‌ కుమార్‌ మీనా మాట్లాడారు. విపక్షాల అభ్యంతరాలతో ఈ-ఆఫీస్ అప్‌గ్రేడ్ కార్యక్రమాన్ని నిలిపివేయాలని ఎన్ఐసీకి సూచించారు.

టెక్నికల్‌ ప్రాబ్లమ్స్‌ కారణంగా ఏపీలో ఈ-ఆఫీస్ అప్ గ్రేడేషన్‌ను వాయిదా వేస్తున్నట్టు ఎన్ఐసీ వెల్లడించింది. సాఫ్ట్ వేర్ అప్ గ్రేడేషన్ షెడ్యూల్ మరికొన్ని రోజుల తర్వాత విడుదల చేస్తామని ఎన్ఐసీ ప్రభుత్వ శాఖలకు సమాచారం ఇచ్చింది. ప్రస్తుతం ఉన్న ఈ-ఆఫీస్ పాత వెర్షన్ తోనే విధులు నిర్వహించాలని ప్రభుత్వ శాఖలకు తెలియజేసింది.

Also read: గ్రూప్‌-4 అభ్యర్థులకు అలర్ట్.. !

Advertisment
Advertisment
తాజా కథనాలు