Boiled Egg-Omelette : గుడ్డు- ఆమ్లెట్ ఈ రెండింటిలో ఆరోగ్యానికి ఏది మంచిదంటే..? ఉడికించిన గుడ్లు, ఆమ్లెట్‌ల్లో ప్రత్యేకమైన ఆరోగ్యకరమైన పోషకాలు ఉంటాయి. ప్రోటీన్ ఎక్కువగా ఉండాలంటే ఉడికించిన గుడ్లు రోజూ తినాలి. వివిధ రకాల పోషకాలతో నింపిన అల్పాహారం కావాలనుకుంటే ఆమ్లెట్ బెస్ట్ అని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. By Vijaya Nimma 21 Nov 2023 in Latest News In Telugu లైఫ్ స్టైల్ New Update షేర్ చేయండి గుడ్డు బాగా ఇష్టపడే అల్పాహారం. రుచితో పాటు విటమిన్లు, ఖనిజాల, ప్రోటీన్ల ఎక్కువ. అయితే...కొందరికి ఆమ్లెట్ లేదా ఉడికించిన గుడ్డు వీటిలో ఆరోగ్యానికి ఏది మంచిదని ఒక సందేహం ఉంటుంది. గుడ్డుని ఎవరు తీసుకోవాలి..?, ఆమ్లెట్‌ను ఎవరు తినాలి?, ఏ సమయంలో వీటిని తీసుకుంటే బెటర్..? అనేక డౌట్లు వస్తాయి. ఆమ్లెట్ వల్ల ఎక్కువ ఆరోగ్య ప్రయోజనాలను పొందొచ్చని కొందరు అంటే, మరికొందరు ఉడికించిన గుడ్డు ఆరోగ్యకరమంటారు. అయితే.. ఈ రెండింటిలో ఏది ఆరోగ్యకరమైనదో ఇప్పుడు తెలుసుకుందాం. ఉడకబెట్టిన గుడ్లు: ఉడికించిన గుడ్డులో 6 శాతం విటమిన్-డి ఉంటుంది. కోలిన్: గుడ్లులో ఉండే కోలిన్ పోషకం మెదడు, నాడీ వ్యవస్థ పనితీరును పెంచుతుంది. లుటీన్, జియాక్సంతిన్గు: డ్డు సొనలో లుటీన్, జియాక్సంతిన్ రెండు శక్తివంతమైన యాంటీ ఆక్సిడెంట్లు. ఇవి కంటి ఆరోగ్యానికి చాలా మంచిది. కంటి చూపు పోకుండా వయస్సు-సంబంధిత మచ్చల క్షీణత నుంచి రక్షిస్తుంది. ప్రోటీన్: గుడ్లు ప్రోటీన్ పుష్కలం. ఉడికించిన గుడ్డులో 6 గ్రాముల అధిక-నాణ్యత ప్రోటీన్ ఉంటుంది. ఆమ్లెట్లు: ఫైబర్: ఆమ్లెట్లు ఫైబర్ ఎక్కువగా ఉంటుంది. ఆరోగ్యకరమైన జీర్ణవ్యవస్థ ఉండాలంటే ఫైబర్ అవసరం. కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గించడంలో ఇది ఎక్కువగా ఉపయోగపడుతుంది. ఐరన్: ఎర్ర రక్తకణాలను ఉత్పత్తి చేయడానికి, శరీరం అంతటా ఆక్సిజన్‌ను రవాణా చేయడానికి ఐరన్ అవసరం. బచ్చలికూరతో ఆమ్లెట్లు తింటే శరీరంలో ఐరన్ పెరుగుతుంది. ఆరోగ్యకరమైన కొవ్వులు: గుడ్లు గుండె ఆరోగ్యానికి ముఖ్యంగా పనిచేస్తుంది. ఆమ్లెట్‌లలో ఉండే ఈ ఆరోగ్యకరమైన కొవ్వులు గుండె జబ్బుల ప్రమాదాన్ని తగ్గిస్తుంది. విటమిన్-సీ: ఆమ్లెట్‌లు విటమిన్-సీ ఎక్కువగా ఉంటుంది. ఇది రోజూ తింటే రోగనిరోధక వ్యవస్థను పెంచుతుంది. ఇది కూడా చదవండి: ఇలాంటి విషయాలను పొరపాటున కాబోయే పార్ట్నర్‌తో చెప్పకండి..? గుడ్డులో విటమిన్లు, ఖనిజాలు, ప్రోటీన్ల అద్భుతంగా ఉంటాయి. ఆమ్లెట్ లేదా ఉడికించిన గుడ్డు రోజూ తింటే ఆరోగ్యానికి ఏది మంచిది అనేది చాలామందికి డౌట్‌గా ఉంటుంది. గుడ్డు గురించి చెప్పాలంటే అధిక పోషకాలు ఉన్న ఓ గని అంటారు. ఎందుకంటే ఇందులో అనేక రకాల పోషకాలు ఉంటాయి. అందుకే గుడ్డుని సమతుల ఆహారమని అంటారు పౌష్టికాహార నిపుణులు. శరీరంలో పౌష్టికాహార లోపం ఉన్నవారిని ఆహారం పదార్థాల్లో గుడ్డు తీసుకోమని డాక్టర్లు సూచిస్తారు. ప్రతిరోజూ గుడ్డు తింటే ఆరోగ్యానికి మేలుతో పాటు జీర్ణక్రియను మెరుగు పరుస్తుదని నిపుణులు చెబుతున్నారు. అంతేకాకుండా శరీరానికి శక్తిని ఇచ్చి రోగనిరోధక శక్తిని పెంచుతోంది. దీంతోపాటు శరీరానికి అవసరమైన ప్రోటీన్లు, పోషకాలు, మాంసకృత్తులను అందించి.. ఆరోగ్యవంతంగా ఉండేందుకు కృషి చేస్తుంది. అందుకే చిన్న పెద్దల వరకు రోజూ ఆహారంలో గుడ్డు తీసుకోవాలని పోషకాహార నిపుణలు సూచిస్తున్నారు. #health-benefits #tips #boiled-egg-omelette మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి