NEET: నీట్‌ పరీక్షలో అవతకవతకలు.. కేంద్ర విద్యాశాఖ కీలక నిర్ణయం

నీట్‌ పరీక్షలో 67 మందికి ప్రథమ ర్యాంకు రావడంపై నిరసనలు జరుగుతున్న వేళ యూపీఎస్సీ మాజీ ఛైర్మన్ నేతృత్వంలో నలుగురు సభ్యులతో కూడిన కమిటీ వేశారు. 1500 మందికి పైగా విద్యార్థులకు ఇచ్చిన గ్రేస్ మార్కుల్ని ఈ కమిటీ సమీక్షిస్తుందని ఎన్టీఏ డీజీ సుభోధ్‌కుమార్‌ సింగ్ తెలిపారు.

New Update
NEET: నీట్‌ పరీక్షలో అవతకవతకలు.. కేంద్ర విద్యాశాఖ కీలక నిర్ణయం

నీట్‌ పరీక్షలో అవతకవతకలు జరగడం, 67 మందికి ప్రథమ ర్యాంకు రావడంపై నిరసనలు జరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో కేంద్రవిద్యాశాఖ కీలక నిర్ణయం తీసుకుంది. యూపీఎస్సీ మాజీ ఛైర్మన్ నేతృత్వంలో నలుగురు సభ్యులతో కూడిన కమిటీని నియమించింది. ఈ కమిటీ వారం రోజుల్లో ఈ వ్యవహారంపై నివేదిక ఇస్తుందని ఎన్టీఏ డీజీ సుభోధ్‌కుమార్‌ సింగ్ తెలిపారు. 1500 మందికి పైగా విద్యార్థులకు ఇచ్చిన గ్రేస్ మార్కుల్ని కమిటీ సమీక్షిస్తుందని పేర్కొన్నారు. ఆ తర్వాత వారి ఫలితాలను మార్చే అవకాశం ఉంటుందని స్పష్టం చేశారు.

Also Read: నీట్ పరీక్షలో గోల్ మాల్.. ప్రూఫ్స్ చూపిస్తూ కేంద్రంపై కేటీఆర్ ప్రశ్నల వర్షం!

గ్రేస్ మార్కులు ఇస్తే పరీక్ష అర్హతా ప్రమాణాలపై ఎలాంటి ప్రభావం ఉండని.. అలాగే అభ్యర్థుల రిలజ్ట్‌ను సమీక్షించడం వల్ల అడ్మిషన్‌ ప్రక్రియపై కూడా ఎలాంటి ప్రభావం ఉండదని సుబోధ్‌ కుమర్ అన్నారు. అయితే నీట్‌ పరీక్షలో అవతతవకలు జరిగాయన్న ఆరోణలను మాత్రం ఆయన ఖండించారు. పేపర్‌ లీక్ కాలేదని.. ఎలాంటి అవకతవకలు జరగలేదని క్లారిటీ ఇచ్చారు. ఎన్సీఈఆర్టీ పాఠ్యపుస్తకాల్లో మార్పులు, పరీక్ష కేంద్రాల వద్ద సమయం కోల్పోవడం వల్ల ఇచ్చిన గ్రేస్ మార్కుల వల్లే ఆ విద్యార్థులు ఎక్కువ మార్కులు సాధించడానికి కారణాలయ్యాయని పేర్కొన్నారు. అయితే విద్యార్థులకు మళ్లీ పరీక్ష నిర్వహిస్తారా ? లేదా అనే అంశంపై కమిటీ సిఫారసులను బట్టి నిర్ణయం ఉంటుందని స్పష్టం చేశారు.

Also Read: రెండు స్థానాల్లో గెలిచిన రాహుల్‌.. వదులుకోబోయే సీటు ఇదే

Advertisment
Advertisment
తాజా కథనాలు