Kavitha: రూ.100 కోట్ల చెల్లింపుల్లో కవితది కీలక పాత్ర.. ఈడీ సంచలన ప్రకటన! ఎమ్మెల్సీ కవిత అరెస్ట్ పై ఈడీ ప్రకటన విడుదల చేసింది. ఆప్ నేతలకు రూ.100 కోట్ల ముడుపుల చెల్లింపులో కవిత కీలక పాత్ర పోషించారని ఈడీ పేర్కొంది. అరెస్ట్ సమయంలో కవిత బంధువులు తమకు ఆటకం కల్పించారని ఈడీ వెల్లడించింది. By Nikhil 18 Mar 2024 in రాజకీయాలు తెలంగాణ New Update షేర్ చేయండి బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత (BRS MLC Kavitha) అరెస్ట్ పై ఈడీ (ED) అధికారంగా ప్రకటన విడుదల చేసింది. ఆప్ నేతలకు రూ.100 కోట్ల ముడుపుల చెల్లింపులో కవిత కీలక పాత్ర పోషించారని తెలిపింది. ఈ వ్యవహారంలో ఇప్పటి వరకు 245 ప్రాంతాల్లో సోదాలు చేశామని వెల్లడించింది. 5 సప్లిమెంటరీ ఛార్జిషీట్లు దాఖలు చేసినట్లు ఈడీ ప్రకటించింది. 128 కోట్ల ఆస్తులను గుర్తించి జప్తు చేశామని తెలిపింది. మనీష్ సిసోడియా, సంజయ్ సింగ్, విజయ్ నాయర్ తో కవితకు సత్సంబంధాలు ఉన్నాయని ఈడీ ప్రకటించింది. ఇది కూడా చదవండి: MLC Kavitha : ఆ రూ.100 కోట్లు ఎక్కడివి?.. కవితపై ఈడీ ప్రశ్నల వర్షం! ఈ కేసులో మనిష్ సిసోడియా, సంజయ్ సింగ్, విజయ్ నాయర్ తో పాటు 15 మందిని అరెస్ట్ చేసినట్లు ఈడీ తెలిపింది. కోర్టు అనుమతితోనే కవితను కస్టడీలోకి తీసుకుని విచారిస్తున్నట్లు తెలిపింది ఈడీ. కవితను అరెస్ట్ చేసే సమయంలో ఆమె బంధువులు ఆటకం కలిగించారని వెల్లడించింది. ఈ కేసుకు సంబంధించి కవిత భర్త అనిల్ కు కూడా ఈడీ నోటీసులు జారీ చేసింది. అయితే ఆయన రోజు కవితతో ములాఖత్ కు హాజరుకాలేదు. లిక్కర్ కేసులో ఈడీ విచారణకు కూడా అనిల్ హాజరుకాలేదు. విచారణకు రాలేనంటూ ఈడీకి అనిల్ లేఖ రాశారు. కవితతో కేటీఆర్, హరీష్‌రావు ములాఖత్ అయ్యారు. ఈ నెల 15న బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితను డిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో ఈడీ అరెస్ట్ చేసింది. ఆ రోజు ఉదయం నుంచి కవిత నివాసంలో సోదాలు నిర్వహించిన అధికారులు సాయంత్రం ఆమెను అరెస్ట్ చేసి ఢిల్లీ తరలించారు. ఈ నెల 23 వరకు కవితను ఈడీ కస్డడీకి కోర్టు అనుమతించింది. ఈ మేరకు ఈ రోజు రెండో రోజు విచారణ సాగుతోంది. #delhi #brs-mlc-kavitha #enforcement-directorate మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి