ED on Paytm: పేటీఎం కు భారీ ఊరట.. ఆ విషయంలో ED క్లీన్ చిట్! 

కష్టాల మధ్యలో పేటీఎంకు భారీ ఊరట లభించింది. ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ED) విదేశీ లావాదేవీల విషయంలో పేటీఎం పేమెంట్స్ బ్యాంక్ కు క్లీన్ చిట్ ఇచ్చింది. FEMA యాక్ట్ విషయంలో పేటీఎం ఎలాంటి ఉల్లంఘనలకు పాల్పడలేదని ED తేల్చింది.

New Update
ED on Paytm: పేటీఎం కు భారీ ఊరట.. ఆ విషయంలో ED క్లీన్ చిట్! 

ED on Paytm: ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ED) Paytm పేమెంట్స్ బ్యాంక్ లిమిటెడ్ (PPBL) లావాదేవీలపై జరిపిన విచారణలో ఫారిన్ ఎక్స్ఛేంజ్ మేనేజ్‌మెంట్ యాక్ట్ (FEMA) కింద ఎటువంటి ఉల్లంఘనను కనుగొనలేదని తెలుస్తోంది. జాతీయ వెబ్సైట్ 'ది హిందూ' రిపోర్ట్ ప్రకారం పేటీఎం కు ఈడీ క్లీన్ చిట్ ఇచ్చింది.  రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) కొన్ని ఇతర నిబంధనలను పాటించని కారణంగా కంపెనీపై చర్య తీసుకోవచ్చని ఈ రిపోర్ట్ పేర్కొంది. ఈ వారం ప్రారంభంలో పేటీఎం పేమెంట్స్ బ్యాంక్‌పై ఈడీ ప్రాథమిక దర్యాప్తు ప్రారంభించింది.

RBI Paytm బ్యాంక్ గడువును మార్చి 15 వరకు పొడిగించింది.. 
ఫిబ్రవరి 29 నుండి కొత్త డిపాజిట్లను స్వీకరించకుండా Paytm అనుబంధ కంపెనీని RBI నిషేధించిన కొద్ది రోజుల తర్వాత ED నుంచి ఈ విధమైన సానుకూల స్పందన పేటీఎంకు వచ్చింది. అయితే, ఇప్పుడు RBI Paytm పేమెంట్ బ్యాంక్‌లో డిపాజిట్లు- ఇతర లావాదేవీల గడువును మార్చి 15 వరకు పొడిగించింది. జనవరి 31న జారీ చేసిన సర్క్యులర్‌లో, ఫిబ్రవరి 29 తర్వాత, పేటీఎం పేమెంట్ బ్యాంక్ ఖాతాలో డబ్బు జమ చేయలేమని ఆర్‌బీఐ చెప్పిన విషయం తెలిసిందే.  ఈ బ్యాంక్ ద్వారా వాలెట్, ప్రీపెయిడ్ సేవలు, ఫాస్టాగ్, ఇతర సర్వీసులలో డబ్బు జమ చేయడం కుదరదు. 

Also Read : తగ్గినట్టే తగ్గి షాకిచ్చిన బంగారం.. ఎంత పెరిగిందంటే.. 

పేటీఎం సీనియర్ అధికారులను విచారించిన ఈడీ..
ఆర్బీఐ కంపెనీ ఆర్థిక లావాదేవీలపై దర్యాప్తు చేసే బాధ్యతను ఈడీకి అప్పగించింది. ఫెమా-ప్రివెన్షన్ ఆఫ్ మనీ లాండరింగ్ యాక్ట్ (PMLA) కింద ఉల్లంఘనలు లేదా నేరాలను ED దర్యాప్తు చేస్తుంది. ఇంతకుముందు, పేటీఎం పేమెంట్స్ బ్యాంక్‌పై ఆర్‌బీఐ చర్య తీసుకున్న తర్వాత పేటీఎం సీనియర్ అధికారులను ఈడీ విచారించి వారి నుంచి సంబంధిత డాక్యుమెంట్స్ సేకరించింది. 

PPBL కేసులో ఎటువంటి PMLA షెడ్యూల్ నేరం ప్రమేయం లేదు
PPBL కేసులో PMLA షెడ్యూల్ నేరం ప్రమేయం లేదని నివేదిక మూలాలను ఉటంకిస్తూ పేర్కొంది. అందువల్ల మనీలాండరింగ్‌పై దర్యాప్తు చేయడం సాధ్యం కాదు. ఒక ప్రభుత్వ అధికారి మాట్లాడుతూ, 'ఏ నేరం జరగకపోతే, 'నేరం ద్వారా వచ్చిన ఆదాయం' ఉండదు. కాబట్టి, PMLA వర్తించదు. అందుకే ఫెమా నిబంధనల ప్రకారం ఏవైనా ఉల్లంఘనలు జరిగాయో లేదో తెలుసుకోవడానికి ఈడీ లావాదేవీలను పరిశీలించింది అని వివరించారు. 

Watch this Interesting Video:

Advertisment
Advertisment
తాజా కథనాలు