AP : ఏపీ అల్లర్లపై ఈసీ సంచలన నిర్ణయం.. సిట్‌ దర్యాప్తుకు ఆదేశం!

ఎన్నికల వేళ ఏపీలో కొనసాగుతున్న అల్లర్లపై ఈసీ సీరియస్ యాక్షన్ తీసుకోనుంది. ఎన్నికల ముందు, తర్వాత జరిగిన హింసపై ఏపీ ప్రభుత్వం ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని ఏర్పాటు చేయాలని, రెండు రోజుల్లో పూర్తి నివేదిక సమర్పించాలని ఆదేశించింది.

New Update
AP : ఏపీ అల్లర్లపై ఈసీ సంచలన నిర్ణయం.. సిట్‌ దర్యాప్తుకు ఆదేశం!

EC Serious Action On AP Issues : ఏపీలో ఎన్నికల(AP Elections) వేళ కొనసాగుతున్న అల్లర్లపై కేంద్ర ఎన్నికల సంఘం(Election Commission) సంచలన నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో ఎన్నికల ముందు, తర్వాత జరిగిన హింసపై ఈసీ ఆదేశాల మేరకు ఏపీ ప్రభుత్వం ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని (SIT) ఏర్పాటు చేయనుంది. మొత్తం రాష్ట్రవ్యాప్తంగా జరిగిన ప్రతి హింసాత్మక ఘటనపైనా సిట్ నివేదిక ఇవ్వనుంది.

ఈ మేరకు ఏపీలోని పల్నాడు, మాచర్ల(Macherla), నరసరావుపేట, తిరుపతి, చంద్రగిరి, తాడిపత్రి ఘటనలపై సిట్‌ విచారణ జరపనుంది. విశాఖలో జరిగిన ఘటననూ సిట్‌ పరిధిలోకి తెచ్చేందుకు అధికారులు ఆలోచిస్తున్నారు. తాడిపత్రి ఘటనలో చైతన్య తన పరిధి దాటి వ్యవహరించారని పోలీసు ఉన్నతాధికారులు భావిస్తున్నారు. ఈ కోణంలో సిట్‌ దర్యాప్తుతోపాటు ప్రతి ఘటనపై పోలీసులు ఎఫ్ఐఆర్‌ నమోదు చేయనున్నట్లు తెలుస్తోంది. అంతేకాదు ఇందుకు సంబంధించి రెండు రోజుల్లో నివేదిక సమర్పించాలని ఈసీ ఆదేశించింది.

Also Read : ఏ పార్టీ గెలిచినా పవర్ సెంటర్ పిఠాపురమే! ఎందుకో తెలుసా..

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

Jethwani case: జెత్వానీ కేసులో బిగ్ ట్విస్ట్.. IPS ఆఫీసర్ అరెస్ట్!

ముంబై నటి జెత్వానీ కేసులో బిగ్ ట్విస్ట్ చోటుచేసుకుంది. ఏపీ ఇంటెలిజెన్స్‌ మాజీ చీఫ్‌ పీఎస్‌ఆర్‌ ఆంజనేయులును పోలీసులు అరెస్ట్‌ చేశారు. ఏపీ సీఐడీ అధికారులు అతన్ని హైదరాబాద్‌లో అదుపులోకి తీసుకున్నారు. వైసీపీ ప్రభుత్వంలో ఆయన ఇంటెలిజెన్స్‌ చీఫ్‌గా పనిచేశారు.

New Update
jatwani

AP IPS officer Anjaneyulu arrest

Jethwani case: ముంబై నటి జెత్వానీ కేసులో బిగ్ ట్విస్ట్ చోటుచేసుకుంది. ఏపీ ఇంటెలిజెన్స్‌ మాజీ చీఫ్‌ పీఎస్‌ఆర్‌ ఆంజనేయులును పోలీసులు అరెస్ట్‌ చేశారు. ఏపీ సీఐడీ అధికారులు అతన్ని హైదరాబాద్‌లో అదుపులోకి తీసుకున్నారు. అతన్ని విజయవాడ తరలించనున్నట్లు తెలుస్తోంది. ఇక వైసీపీ ప్రభుత్వంలో ఆంజనేయులు ఇంటెలిజెన్స్‌ చీఫ్‌గా పనిచేశారు. 

అసలేం జరిగిందంటే..

నటి జత్వానీని వైసీపీ నేత విద్యాసాగర్ వేధింపులకు గురిచేసినట్లు ఆరోపణలున్నాయి. ఆయన ఫిర్యాదుతో ముంబై వెళ్లి జత్వానీతో సహా ఆమె కుటుంబాన్ని పోలీసులు అరెస్ట్ చేశారు. అయితే ఓ ప్రముఖ వ్యాపారవేత్తపై జత్వాని కేసు వేయడంతోనే ఆమెను అరెస్ట్ చేశారనే వాదనలు వినిపించాయి. దీంతో కేసు వాపస్ తీసుకోవాలని జత్వానీని ఒత్తిడికి గురిచేశారని, ఇందులో పీఎస్ఆర్ ఆంజనేయులు, సీపీ కాంతిరాణాటాటా, విశాల్ గున్నిల పాత్ర ఉందనే ఆరోపణలు వెల్లువెత్తాయి. ఇప్పటికే ఈ కేసులో ముగ్గురి పాత్ర ఉందని తెలియడంతో వారిపై సస్పెన్షన్ వేటు పడింది. ముగ్గురు ఐపీఎస్ అధికారులకు 2025 సెప్టెంబర్ 25వ తేదీ వరకు సస్పెన్షన్ పొడిగిస్తున్నట్లు ఏపీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె. విజయానంద్ ఆదేశాలు జారీ చేసిన విషయం తెలిసిందే. కాగా ఇప్పుడు రామాంజనేయులు అరెస్టుతో ఈ కేసు మరింత ఉత్కంఠగా మారింది. 
 

ఇది కూడా చూడండి: Horoscope: ఈ రాశుల వారికి ఈరోజు అంతగా బాగోలేదు..జాగ్రత్తగా ఉంటే బెటర్‌!

ఇదిలా ఉంటే.. జాత్వానీ కేసులో ఫిబ్రవరి 2న ఫిర్యాదు అందితే పోలీసులు కమిషనర్‌ కార్యాలయం నుంచి ముంబై వెళ్లడానికి 1వ తేదీన విమాన టికెట్లు బుక్‌ చేశారు. అలాగే స్పా సెంటర్ లో ఫిబ్రవరి 11న సోదాలు నిర్వహించి వ్యభిచారం జరుగుతున్నట్లుగా ప్రచారం చేసి 10వ తేదీన ఢిల్లీ విమాన టికెట్లు బుక్‌ చేసుకోవడం విశేషం. ఇక విద్యాసాగర్‌ ఇచ్చిన సమాచారం ప్రకారం పోలీసు బృందం ఢిల్లీ వెళ్లి.. అమిత్ కోసం వెతికింది. అతను దొరకకపోవడంతో ఆందోళన మొదలైంది. దీంతో ఇబ్రహీంపట్నంలో జెత్వానీపై నమోదు చేసిన తప్పుడు కేసులో ఐపీఎస్‌ అధికారులు సీతారామాంజనేయులు, కాంతిరాణా తాతా, విశాల్‌ గున్నీ, డీఎస్పీ హనుమంతరావు, ఇన్‌స్పెక్టర్‌ సత్యనారాయణను సస్పెండ్‌ చేశారు. వాళ్లందరినీ కాదంబరి ఫిర్యాదుతో నమోదు చేసిన కేసులో నిందితులుగా చేర్చారు. పటమటలో నమోదు చేసిన అమిత్‌సింగ్‌ వివరాలు వెలుగులోకి వచ్చాయి. 

ఇది కూడా చూడండి: Ind: వాణిజ్యం, టెక్నాలజీ..జేడీ వాన్స్ తో ప్రధాని మోదీ చర్చించిన అంశాలివే..

actress-jatwani | mumbai | ips | arrest | telugu-news | today telugu news

 

Advertisment
Advertisment
Advertisment