Noni Fruit Benefits: ఈ పండుతో ఉండే ఆరోగ్య ప్రయోజనాలు అన్నీఇన్నీ కావు.. తప్పక తెలుసుకోండి!

నోని పండుతో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి.ఇది రక్తంలో చక్కెర స్థాయిలను తగిస్తుంది. ఈ పండు తింటే కీళ్ల నొప్పుల సమస్య నుంచి ఉపశమనం లభిస్తుంది. ఈ పండులో విటమిన్ సి, బి3, ఎ, ఐరన్, మినరల్స్ అధికంగా ఉన్నాయి.

New Update
Noni Fruit Benefits: ఈ పండుతో ఉండే ఆరోగ్య ప్రయోజనాలు అన్నీఇన్నీ కావు.. తప్పక తెలుసుకోండి!

Noni Fruit Benefits: మనకు ప్రకృతిలో లభించే ఎన్నో రకాలైన పండ్లు, కాయలు అనేక రోగాలను దూరం చేస్తాయి. అందులో నోని పండు (noni fruit) ఒకటి. దీనినే తొగరు పండు అని కూడా పిలుస్తారు. బంగాళాదుంప ఆకారంలో పసుపు, లేత ఆకుపచ్చ రంగులో ఉండే ఈ పండు చూడగానే గుర్తు పడతారు.. కానీ.. చాలామందికి ఈ పండు గురించి పెద్దగా తెలియదు. అయితే.. ఈ పండు ఆరోగ్యానికి ఔషధ గని లాంటిదని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. బన ఆరోగ్యానికి నోని పండు ఎలాంటి ప్రయోజనాలు ఇస్తుందో ఇక్కడ తెలుసుకుందాం.

నోని పండు తింటే కలిగే ప్రయోజనాలు:

  • ఈ నోని పండులో విటమిన్ సి, బి3, ఎ, ఐరన్, మినరల్స్ అధికంగా ఉన్నాయి. దీని ఆకులు, బెరడు, వేర్లు కూడా పలు రకాల మందుల తయారీ చేస్తారు. ఈ నోని పండ్ల (noni fruit)తో తయారు చేసిన జ్యూస్ రోజు తాగితే శరీరంలో రోగ నిరోధక శక్తి పెరుగుతుంది.
  • ఈ నోని పండు తినడం వలన మలబద్ధకం, కడుపు ఉబ్బరం వంటి జీర్ణ సమస్యలు దూరం అవుతాయి.
  • నోని పండ్ల ఆకులలో ఔషధ గుణాలు ఎక్కువ. ఎరుపు, జీర్ణక్రియ, వాపు, దురద వంటి చర్మ సమస్యల నుంచి ఉపశమనం కలిగిస్తాయి.
  • నోని పండు రక్తంలో చక్కెర స్థాయిలను తగిస్తుంది. దీని ఆకులు కూడా మధుమేహానికి బాగా పని చేస్తాయి. రోజూ ఈ పండ్లు లేదా జ్యూస్ తీసుకుంటే షుగర్ వ్యాధిని కంట్రోల్ చేయవచ్చు.
  • ఈ నోని పండులోని యాంటీ ఇన్‌ఫ్లమేటరీ గుణాలు (Anti-inflammatory properties) ఎక్కువగా ఉన్నాయి. దీని వినియోగం ఎముకల రాపిడిని తగ్గిచి.. కీళ్ల నొప్పుల సమస్య నుంచి ఉపశమనం లభిస్తుంది.
    ఇందులో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు, మినరల్స్, విటమిన్-సి రోగనిరోధక శక్తిని పెంచి చర్మ సమస్యలను తొలగిస్తుంది.

ఇది కూడా చదవండి: ఇలా చేస్తే మీ దంతాలు ముత్యాల్లా మెరుస్తాయి.. ట్రై చేసి చూడండి!

Advertisment
Advertisment
తాజా కథనాలు