Guavas: జామపండ్లు తిన్నాక వీటిని తింటే ఇక అంతే సంగతులు

జామపండులో విటమిన్ సి అధికంగా ఉంటుంది. జామపండు తిన్న తర్వాత ఏదైనా పాల ఉత్పత్తులు శరీరానికి హానికరం. నీరు, అరటి, పాలు, పెరుగు, మజ్జిగ జామ తర్వాత పెరుగు తీసుకుంటే కడుపులో ఇబ్బంది, వాంతులు, కడుపు నొప్పి, కడుపు సంబంధిత సమస్యలు వస్తాయని వైద్యులు చెబుతున్నారు.

New Update
Guavas: జామపండ్లు తిన్నాక వీటిని తింటే ఇక అంతే సంగతులు

Guavas: మనం తరచుగా సీజన్‌ను బట్టి రకరకాల పండ్లను తింటుంటాం. ఈ పండ్లలో జామ కూడా ఒకటి. జామ ఆరోగ్యానికి మేలు చేస్తుందని మనందరికీ తెలుసు. కానీ జామపండ్లు తిన్న వెంటనే కొన్ని పదార్థాలు తింటే హానికరమని వైద్యులు చెబుతున్నారు. జామపండులో విటమిన్ సి అధికంగా ఉంటుంది. జామపండు తిన్న తర్వాత ఏదైనా పాల ఉత్పత్తులను తీసుకుంటే శరీరానికి హానికరం. జామపండ్లు తిన్న తరువాత ఎలాంటి పండ్లు తినకూడాదో ఇప్పుడు కొన్ని విషయాలు తెలుసుకుందాం.

నీరు:

  • జామపండు తిన్న తర్వాత నీరు తాగడం వల్ల వాత, పిత్త, కఫం అసమతుల్యత చెందుతాయి. ఈ కారణంగా జలుబు, దగ్గు సమస్యలు వస్తాయని నిపుణులు అంటున్నారు. అంతేకాకుండా జీర్ణ ఎంజైమ్‌లకు కూడా హాని కలిగిస్తుందని చెబుతున్నారు.

అరటి:

  • జామపండు తిన్నాక అరటిపండు తినడం వల్ల అనేక జీర్ణ సమస్యలు వస్తాయి. ఎందుకంటే జామ అనేది ఆమ్ల pH కలిగిన పండు. అరటి పండు తీపి పండు. ఈ రెండింటినీ కలిపి తింటే గ్యాస్, తలనొప్పితో పాటు కడుపు సంబంధిత సమస్యలు వస్తాయని నిపుణులు అంటున్నారు.

పాలు:

  • జామపండు తిన్న తర్వాత పాలు తాగడం వల్ల శరీరంలో అనేక సమస్యలు వస్తాయి. ముందుగా ఇది విటమిన్ సితో చర్య జరిపి జీర్ణక్రియ ప్రక్రియను నెమ్మదిస్తుంది. దీని వల్ల కడుపు నొప్పి, మలబద్ధకం వస్తాయని వైద్యులు అంటున్నారు.

పెరుగు:

  • జామ తర్వాత పెరుగు తినకూడదు. ఇలా చేయడం వల్ల కడుపులో ఇబ్బంది కలుగుతుందని, వాంతులు కూడా అయ్యే అవకాశం ఉంటుంది.

మజ్జిగ:

  • జామపండు తిన్న తర్వాత మజ్జిగ తీసుకోకూడదు. ఇది దీర్ఘకాలంలో అసిడిటీని కలిగిస్తుంది. కడుపు నొప్పికి కూడా కారణమవుతుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

ఇది కూడా చదవండి:  ప్రాసెస్‌ చేసిన ఆహారంతో చర్మానికి కూడా ప్రమాదమా..?

గమనిక: ఈ కథనం ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇచ్చినది. RTV దీనిని ధృవీకరించడంలేదు. ఆరోగ్య సమస్యల నివారణకు సంబంధిత వైద్య నిపుణుడిని సంప్రదించడం ఉత్తమం.

Advertisment
Advertisment
తాజా కథనాలు