Guava Benefits: తక్కువ ధరతో ఎక్కువ లాభాలు.. జామకాయ చేసే మేలేంటో తెలుసా..?

విటమిన్-సి పుష్కలంగా ఉండే సీజనల్‌ ఫ్రూట్స్‌లో జామకాయ ఉపయోగం వేరు. రుచితో పాటు ఆరోగ్యాన్ని దరి చేరనివ్వకుండా చేస్తుంది. ఎన్నో ఔషధ గుణాలతో కూడుకున్న జామకాయ వ్యాధినిరోధక శక్తి పెంచుతుంది. కావున ఇన్ఫెక్షన్లు, జలుబు, దగ్గు వంటి అనార్యోగ సమస్యలు రావు.

New Update
Health Tips: డయాబెటిస్‌లో జామ ఆకులను ఎలా తినాలో తెలుసా!

Guava Benefits: రుచితో పాటు ఆరోగ్యాన్నీ ఇచ్చే జామ ఉపయోగమే వేరు. సీజనల్‌ ఫ్రూట్స్‌లో విటమిన్‌-సి పుష్కలంగా ఉంటుంది. అందువల్ల జలుబు, ఇన్ఫెక్షన్లు, దగ్గుల్లాంటి సమస్యలు దరిచేరవు. జామ తినటం వల్లన శరీరంలో వ్యాధినిరోధక శక్తి ఎక్కువగా పెరుగుతోంది. అంతేకాదు డయాబెటిస్‌తో బాధపడేవారూ దీనిని తినొచ్చు. జామలో విటమిన్‌-ఎ ఉండటం వల్ల కంటి ఆరోగ్యానికి మంచిదని వైద్యులు చెబుతున్నారు. రోజు జామ తింటే ఎన్ని ప్రయోజనాలు ఉన్నాయో ఇప్పుడు చూద్దాం.

జామకాయ తినటం వల్ల కలిగే ఉపయోగాలు

  • రోజు జామ పండు తింటే శక్తి ఎక్కువగా వస్తుంది. కిడ్నీలో రాళ్లు వచ్చే అవకాశాలు చాలా తక్కువగా ఉన్నాయి.
  • ముఖ్యంగా ముఖం మీద ఉండే నల్లటి మచ్చలు తగ్గిపోతాయి. జుట్టు పెరుగుతోంది, నొప్పులు ఏమైనా ఉంటే తగ్గుతాయి.
  • జామపండు తింటే కండరాలకు విశ్రాంతి కలిగి ఒత్తిడి నుంచి బయటపడుతారు.
  • జామ ఆకులు కూడా హెల్త్‌కి ఎంతో మేలు చేస్తాయి. జామాకులు నమిలితే నోటిలో ఉండే క్రిములు నశించి నోరు శుభ్రంగా ఉంటుంది. ఇది టూత్‌పేస్ట్‌లా పని చేస్తుంది.
  • ఈ పండు తినటం వల్ల హైపర్‌టెన్షన్‌కు గురికాకుండా బ్లడ్‌ ప్రెషర్‌ను నియంత్రిస్తుంది. దీంతో గుండెకు సంబంధించిన సమస్యలు దరిచేరవు.
  • జామలో పీచుపదార్థం పుష్కలంగా ఉంటుంది. బరువు తగ్గాలనుకునేవారి డైట్‌లో జామపండు తీసుకుంటే మంచి ఫలితం ఉంటుంది.
  • ఆపిల్, బొప్పాయి, నేరేడు పండు కంటే జామకాయలోనే పీచు పదార్ధం అధికం.
  • షుగరు వ్యాధితో బాధపడేవారు తప్పనిసరిగా తినవల్సిన కాయ జామకాయ.
  • డయాబెటిస్ రోగులకు సంజీవనిలా జామకామ పనిచేస్తోంది
  • నెలసరిలో వచ్చే నొప్పి, ఇబ్బందులకు జామ దివ్యౌషధంలా పనిచేస్తుంది
  • గర్భిణులకు అవసరమైన ఫోలిక్ యాసిడ్ అందడంతోపాటు సంతానోత్పత్తిని పెంచే హార్మోల్లను జామకాయ ఉత్పత్తి చేస్తుంది.

ఇది కూడా చదవండి: వామాకుతో ఎన్ని లాభాలు ఉన్నాయో తెలుసా..?

ఎరుపు, తెలుపు రంగు గుజ్జుతో ఉండే జామ అంటే అందరూ ఇష్టంగా తింటారు. వగరు, పులుపుతో కూడిన తియ్యని రుచి కలిగిన జామకాయ ఈ సీజన్‌లో ఎక్కువగా దొరుకుతాయి. పెరటి చెట్టుగా భావించే జామలో అధిక పోషకాలున్నాయి. జామ పండ్లలో పీచు, విటమిన్- ఎ, సి, ఫోలిక్ ఆమ్లాల శాతం ఎక్కువ ఉన్నాయి. మాంగనీస్, పొటాషియం, కాపర్ వంటి ఖనిజాలు ఎక్కువగా లభిస్తాయి.ఈ పండు మనకు అందుబాటు ధరలో, దగ్గరగానే దొరుకుతుంది. వాస్తవానికి యాపిల్, మామిడి, కమలాపండు, స్ట్రాబెర్రీ పళ్లకన్నా ఎక్కువ సి-విటమిన్లు జామలోనే నాలుగు రెట్లు ఎక్కువ ఉంటాయి.

Advertisment
Advertisment
తాజా కథనాలు