Guava Chutney : జామకాయ చట్నీ ఎప్పుడైనా తిన్నారా.. ఎన్ని లాభాలో తెలుసా? రుచితో పాటు అనేక సమస్యల నుంచి జామ చట్నీ ఉపశమనం కలిగిస్తుంది. జమలో ఉన్న ప్రోటిన్లు రక్తంలో షుగర్ లెవల్స్ కంట్రోల్ చేస్తుంది. వీటిల్లో తక్కువ కేలరీలు, యాంటీఆక్సిడెంట్ లక్షణాలు, విటమిన్లు అధికంగా ఉన్నాయి. గుండెతో పాటు జీర్ణక్రియ సమస్యలకు మేలు చేస్తాయి. By Vijaya Nimma 23 Jan 2024 in Latest News In Telugu లైఫ్ స్టైల్ New Update షేర్ చేయండి Guava Chutney Benefits : జామ చట్నీ(Guava Chutney) రుచిలో ఎంతో బాగుంటుంది. మధుమేహానికి(Diabetes) మాత్రమే కాకుండా జీర్ణక్రియకు కూడా చాలా మేలు చేస్తుంది. శీతాకాలం(Winter) లో చాలా పండ్లు, కూరగాయలు మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. చాలా మంది ఇష్టపడే ఈ పండ్లలో జామ ఒకటి. చాలా చోట్ల దీని చట్నీని కూడా ఎక్కువగా తింటుంటారు. ఈ చట్నీ రుచిగా ఉండటమే కాకుండా ఆరోగ్యానికి కూడా ఎంతో మేలు చేస్తుంది. శీతాకాలంలో అనేక రకాల కూరగాయలు, పండ్లు మార్కెట్లో(Fruits Market) లభిస్తాయి. ఇవి మీ ఆరోగ్యాన్ని ఎంతో కాపాడుతాయి. ఇందులో జామ ప్రముఖ పాత్ర పోషిస్తుంది. దీనిని తినడం వల్ల కూడా అనేక ప్రయోజనాలు లభిస్తాయి. ప్రజలు పచ్చి జామపండ్లను తినడానికి(Eating Guava) ఇష్టపడతారు. రుచికరంగా ఉండటమే కాకుండా అనేక సమస్యల నుంచి ఇది ఉపశమనం కలిగిస్తుంది. మామూలుగా అయితే జామపండును అలానే తింటారు, కానీ చాలా చోట్ల దానిని చట్నీ చేసుకుంటారు. జామతో పాటు కొన్ని సుగంధ ద్రవ్యాలు కలిపి చట్నీ తయారు చేస్తారు. ఈ చట్నీ తీపితో పాటు కాస్త కారంగా ఉంటుంది. ఇది ఆరోగ్యానికి కూడా ఎంతో మేలు చేస్తుంది. Also Read : Breaking:వైసీపీకి బిగ్ షాక్.. ఎంపీ శ్రీకృష్ణదేవరాయలు రాజీనామా రక్తంలో షుగర్ లెవల్స్ కంట్రోల్: జామ చట్నీలో అధిక మొత్తంలో పీచు పదార్థం ఉంటుంది. ఇది రక్తపోటు నియంత్రణలో సహాయపడుతుంది. అంతేకాకుండా మధుమేహంతో బాధపడేవారికి మేలు చేస్తుంది. గుండెకు ఎంతో మేలు: జామలో పొటాషియం, ఫైబర్‌తో సహా అనేక పోషకాలు ఉన్నాయి, కాబట్టి ఇది రక్తపోటు, కొలెస్ట్రాల్(Cholesterol) స్థాయిలను నియంత్రించడంలో సహాయం చేస్తుంది. అంతేకాకుండా గుండె ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. జీర్ణ సహాయం: డైటరీ ఫైబర్ జామ చట్నీలో ఎక్కువగా ఉంటుంది. ఇది జీర్ణక్రియలో ఎంతో మేలు చేస్తుంది. ఆరోగ్యకరమైన జీర్ణవ్యవస్థను ప్రోత్సహిస్తుంది. తక్కువ కేలరీలు: మీరు తక్కువ కేలరీల ఆహారం కోసం చూస్తున్నట్లయితే జామ చట్నీ మీకు గొప్ప ఎంపిక. ఇది రుచిగా ఉండటమే కాకుండా తక్కువ క్యాలరీలు కలిగి ఉంటుంది. యాంటీఆక్సిడెంట్ లక్షణాలు: జామ చట్నీలోని యాంటీఆక్సిడెంట్లు ఫ్రీ రాడికల్స్‌తో పోరాడతాయి. అంతేకాకుండా దీర్ఘకాలిక వ్యాధుల ప్రమాదాన్ని తగ్గిస్తాయి. విటమిన్లు అధికం: ఈ చట్నీలో విటమిన్లు పుష్కలంగా ఉన్నాయి, ముఖ్యంగా విటమిన్-సి ఇందులో ఉంటుంది. ఇది మీ రోగనిరోధక శక్తిని బాగా పెంచుతుంది. ఇది కూడా చదవండి: చెవిలో పేరుకున్న ఎలాంటి మురికి అయినా ఇలా చేస్తే క్షణంలో క్లీన్ అవుతుంది గమనిక: ఈ కథనం ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇచ్చినది. RTV దీనిని ధృవీకరించడంలేదు. ఆరోగ్య సమస్యల నివారణకు సంబంధిత వైద్య నిపుణుడిని సంప్రదించడం ఉత్తమం. #health-benefits #best-fruits-for-diabetes #guava-chutney మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి