Winter Season Ghee Benefits: చలికాలంలో నెయ్యి తింటే ఏం అవుతుందో తెలుసా..? నెయ్యి అంటే చాలామందికి ఇష్టం ఉంటుంది. ప్రతి ఆహార పదార్థాలతోపాటు అన్నంలో ఈ నెయ్యి అనేది కచ్చితంగా వేసుకొని తింటారు. ముఖ్యంగా చలికాలంలో రోజూ నెయ్యి తింటే జీర్ణ సమస్యలతోపాటు మలబద్దక, కడుపు ఉబ్బరం, గ్యాస్, సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుంది. By Vijaya Nimma 09 Dec 2023 in లైఫ్ స్టైల్ Uncategorized New Update షేర్ చేయండి Winter Season Ghee Benefits: చాలామందికి నెయ్యి అంటే చాలా ఇష్టం ఉంటుంది. ప్రతి ఆహార పదార్థాలతోపాటు అన్నంలో కూడా నెయ్యి కచ్చితంగా వేసుకొని తింటారు. తినడానికే కాదు వంటలకు కూడా ఉపయోగిస్తారు. నెయ్యితో చేసిన వంటలు చాలా రుచిగా ఉంటాయి. అయితే.. చలికాలంలో నెయ్యి ఎక్కువగా తినొచ్చా..? తినకూడదా..? అనే సందేహం ఉంటుంది. చలికాలం వచ్చిందంటే చాలు ఆరోగ్యంపై శ్రద్ధ పెడుతూ ఉంటారు. ప్రతి చిన్న దానికి ఏదో రకమైన సమస్య అందరినీ వేధిస్తూ ఉంటుంది. దానివల్ల కొంతమంది ఏమైనా తినాలంటే భయపడుతూ ఉంటారు. చలికాలంలో నెయ్యి ఎక్కువగా తీసుకోవచ్చా లేదా అనేది ఇప్పుడు తెలుసుకుందాం. ఇది కూడా చదవండి: పటికతో అవాంఛిత రోమాలు పరార్.. ఇలా ఎప్పుడైనా ట్రై చేశారా..? ఈ చలికాలంలో ఎక్కువగా జలుబు, గ్యాస్ సమస్యలు, శ్వాస తీసుకోవడం, అస్తమా వంటి సమస్యలు మనల్ని వేధిస్తాయి. ఈ కాలంలో యాంటీ బయాటిక్స్ ఎక్కువగా తినడం వల్ల శరీరానికి మంచిది కాదు. చలికాలంలో నీళ్లు తక్కువగా తాగుతారు కావున ఆరోగ్యంపై మరి ఎక్కువ జాగ్రత్తగా ఉండాలని వైద్యులు చెబుతుంటారు. అయితే.. కొందరికి నెయ్యి తీసుకోవాలా వద్దా అనే డౌట్ ఉంటుంది. చలికాలంలో నెయ్యి తింటే జలుబు వస్తుందని కొందరిలో భయం ఉంటుంది. మార్కెట్లో దొరికే నెయ్యిలో కల్తీ ఉంటుంది కాబట్టి ఇంట్లో నెయ్యి చేసుకొని తినడం ఉత్తమమని వైద్యులు చెబుతున్నారు. కాగా.. నెయ్యి తినడం వల్ల బరువు పెరుగుతారని కొంతమంది అనుకుంటారు. నిజానికి నెయ్యి తింటే ఆరోగ్యంగా ఉంటాము. నెయ్యిలో ఆరోగ్యకరమైన కొవ్వులు మన కడుపుని నిండుగా ఉంచుతుంది. ఫలితంగా తినడం తగ్గుతుంది. దీనివల్ల బరువు అదుపులో ఉంటుంది. నెయ్యి తింటే చర్మం పగలదు అంతేకాకుండా.. జీర్ణ సమస్యలు ఉంటే నెయ్యి తినడం వలన ఆ సమస్య దూరం అవుతుంది. మనం తినే ఆహారంలో రోజూ కొద్దిగా నెయ్యి తింటే జీర్ణ వ్యవస్థకు ఎంతో మంచిది. మలబద్దక సమస్య ఉన్నవారు నెయ్యి తింటే కడుపు ఉబ్బరం, గ్యాస్, సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుంది. ఇందులో ఉంటే యాంటీ ఆక్సిడెంట్లు శక్తి పెంచడంతోపాటు.. శరీరంలో రోగ నిరోధకశక్తిని పెచుతుంది. ఫలితంగా ఎముకలు, కీళ్ల నొప్పుల సమస్య నుంచి నెయ్యి దూరం చేస్తుంది. చలికాలంలో చర్మం పగలకుండా ఉండాలంటే నెయ్యిని కచ్చితంగా తీసుకోవాలి. ఇంకా ఎన్నో ఆరోగ్య సమస్యలను తగ్గించడంలో నెయ్యి ప్రధాన పాత్ర పోషిస్తుందని వైద్య నిపుణులు చెబుతున్నారు. గమనిక: ఈ కథనం ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇచ్చినది. RTV దీనిని ధృవీకరించడంలేదు. ఆరోగ్య సమస్యల నివారణకు సంబంధిత వైద్య నిపుణుడిని సంప్రదించడం ఉత్తమం. #health-benefits #winter-season #ghee-benefits మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి