Garlic With Honey : మీ రోగాలు పారిపోవాలా..? పొద్దున లేవగానే ఈ రెండు తినండి శీతకాలంలో పులియబెట్టిన వెల్లుల్లి, తేనెను తింటే శరీరంలోని వ్యాధుల నుంచి ఉపశమనం లభిస్తుంది. ప్రతిరోజూ ఉదయం ఖాళీ కడుపుతో పులియబెట్టిన వెల్లుల్లిని తింటే మధుమేహం, జలుబు, దగ్గు, కఫం, అలర్జీల వంటి సమస్యలు తగ్గుతాయి. By Vijaya Nimma 01 Jan 2024 in Latest News In Telugu లైఫ్ స్టైల్ New Update షేర్ చేయండి Garlic v/s Honey : మన శరీరానికి వ్యాధులను దూరంగా ఉంచాలనుకుంటే..మందుల కంటే ఆహారంపై ఎక్కువ ఫోకస్ పెట్టాలి. ఆరోగ్యకరమైన ఆహారం, సరైన జీవనశైలితో.. వ్యాధుల నుంచి బయట పడవచ్చు. ఆయుర్వేదం ప్రకారం కొన్ని ఆహారాలు తింటే రెట్టింపు ప్రయోజనాలు లభిస్తాయని నిపుణులు చెబుతున్నారు. ఆరోగ్యంగా ఉండాలంటే ఆయుర్వేద మార్గాలను పాటించాలి. తీవ్రమైన వ్యాధుల సమస్యల నుంచి శరీరాన్ని రక్షించే అనేక అంశాలు ఆహారం, పానీయాలు ఆయుర్వేదంలో ఉన్నాయి. ప్రస్తుత రోజుల్లో.. పెరుగుతున్న వ్యాధుల మధ్య ఆరోగ్యంగా ఉండటం అనేది సవాల్‌గా మారిది. కొందరైతే.. చిన్న వయస్సులోనే అనేక వ్యాధుల బారిన పడుతున్నారు. దీనికి ప్రధాన కారణం అనారోగ్యకరమైన ఆహారం, చెడు అలవాట్లు అని వైద్యులు చెబుతున్నారు. ఆహారం, పానీయాలను సరిగ్గా తీసుకుంటే ఆరోగ్యానికి అనేక రెట్లు ప్రయోజనాలు లభిస్తాయి. అలాంటి వాటిలో వెల్లుల్లి , తేనె ఒకటి. ఈ రెండు కలిపి తింటే శరీరానికి ప్రయోజనాలు మాత్రమే లభిస్తాయి. కానీ..పులియబెట్టిన వెల్లుల్లిని తేనెతో కలిపి ఉదయాన్నే తింటే రెట్టింపు లాభాలు కలుగుతాయి. వెల్లుల్లి, తేనె కలిపి తింటే ఎలాంటి లాభాలు కలుగుతాయో ఇప్పుడు కొన్ని విషయాలు తెలుసుకుందాం. వెల్లుల్లి, తేనె ఉదయాన్నే తింటే కలిగే ప్రయోజనాలు శీతకాలంలో పులియబెట్టిన వెల్లుల్లి(Garlic), తేనె(Honey) ను తింటే శరీరంలోని వ్యాధుల నుంచి కాపాడుతుంది. వెల్లుల్లి, తేనె కలిపి తింటే సీజనల్ ఫీవర్, దగ్గు,జలుబు, అలర్జీల సమస్య రావు. వెల్లుల్లి తింటే శరీరంలో పేరుకుపోయిన చెడు కొలెస్ట్రాల్ తగ్గుతుంది. వెల్లుల్లి, తేనె తింటే శరీరం డిటాక్సిఫై అయి..రోగనిరోధక శక్తి పెరుగుతుంది. క్యాన్సర్ నివారణకు ఈ రెండూ సహజ యాంటీ బయాటిక్స్‌గా పనిచేస్తాయి. ప్రతిరోజూ ఉదయం ఖాళీ కడుపుతో పులియబెట్టిన వెల్లుల్లిని తింటే మధుమేహం తగ్గుతుంది. వెల్లుల్లిలో వైరల్ ఇన్ఫెక్షన్లతో పోరాడే, బ్యాక్టీరియాతో పోరాడుతుంది. దీనిలో జీర్ణక్రియను మెరుగుపరిచే గుణాలున్నాయి. వెల్లుల్లి, తేనె కలిపి తింటే ఎలర్జీ తగ్గుతుంది, శరీరంలో రోగనిరోధక శక్తి అధికంగా పెరుగుతుంది. వెల్లుల్లి, తేనె జలుబు, దగ్గు, కఫం కూడా తగ్గిస్తుంది. పులియబెట్టిన వెల్లుల్లి తయారీ విధానం పులియబెట్టిన వెల్లుల్లి కోసం, ఒక కూజా తీసుకొని.. ఒలిచిన వెల్లుల్లి లవంగాలతో సగం కూజాని నింపాలి. ఇప్పుడు అందులో తేనె వేసి పూర్తిగా నింపి మూత పెట్టాలి. దానిని 3-4 వారాల పాటు పులియబెట్టాలి. వెల్లుల్లి రెబ్బలు పూర్తిగా తేనెలో మునిగిపోయేలా కూజాను ఉంచాలి. మొదట్లో తేనె చిక్కగా ఉంటుంది.కానీ తేనె పలుచగా మారడం ప్రారంభించినప్పుడు, రోజుకు ఒకసారి మాత్రమే కూజాను కదిలించాలి. 3-4 వారాల తర్వాత దీనిని ఉపయోగించవచ్చు. ప్రతిరోజూ ఉదయం ఒక వెల్లుల్లి రెబ్బను తీసి ఖాళీ కడుపుతో తింటే ఆరోగ్యానికి ఎంతో మేలు కలుగుతుంది. ఇది కూడా చదవండి: 48 రోజులు ఈ ఆకు కూర తింటే జరిగేది ఇదే.. కచ్చితంగా తెలుసుకోండి! గమనిక: ఈ కథనం ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇచ్చినది. RTV దీనిని ధృవీకరించడంలేదు. ఆరోగ్య సమస్యల నివారణకు సంబంధిత వైద్య నిపుణుడిని సంప్రదించడం ఉత్తమం. #health-benefits #garlic #honey మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి